శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

గ్రామీణప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకోసం స్వల్పఖర్చుతో సాంకేతిక పరిజ్ఞానం మహిళ సారథ్యంలోని స్టార్టప్ కంపెనీ రూపకల్పన

Posted On: 29 MAR 2021 12:33PM by PIB Hyderabad

  ఫైబర్ వంటి బ్యాండ్.విడ్త్ తో  ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికి దోహదపడే సృజనాత్మకమైన వైర్.లెస్ ఉత్పాదనను ఒక మహిళ సారథ్యంలోని ఆస్ట్రోమ్ అనే స్టార్టప్ కంపెనీ రూపొందించింది. ఫైబర్ కేబుల్ వేయడానికయ్యే ఖర్చుతో పోల్చుకుంటే  నామమాత్రపు అతిస్వల్బ వ్యయంతోనే గ్రామీణ ప్రాంతాలకు, పట్టణాల శివార్లకు ఇంటర్నెట్ సేవలను అందించేందుకు టెలికం నిర్వాహకులకు ఈ వైర్.లెస్ ఉత్పాదన ఎంతగానో ఉపకరిస్తుంది.

  భారతదేశం వంటి దేశాల్లోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడం చాలా కష్టం. ఎందుకంటే ఫైబర్ వేయడం చాలా ఖర్చుతో కూడిన పని. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతోనే అధిక డేటా సామర్థ్యాన్ని ఎక్కువ ప్రాంతానికి అందించగల వైర్‌లెస్ బ్యాక్‌హాల్ ఉత్పాదనల ఆవశ్యకత ఎంతో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైర్‌లెస్ బ్యాక్‌హాల్ ఉత్పాదనల తగినంత డేటాను అవసరమైనంత వేగంతో అందించలేకపోతున్నాయి.  అవసరమైన పరిధిలో డాటాను విస్తరించడానికి కూడా అవి దోహదపడలేక పోతున్నాయి. పైగా, వాటిని తగిన విస్తృతితో అందించడానికి ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటోంది.

ఆస్ట్రోమ్ అనే సార్టప్ కంపెనీ రూపొందించిన వైర్.లెస్ ఉత్పాదనతో  ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించేందుకు అవకాశాలున్నాయి.  గిగామెష్ అనే ఈ ఉత్పాదన ద్వారా నాణ్యమైన, హైస్పీడ్, గ్రామీణ టెలికం మౌలిక సదుపాయాలను అందజేసేందుకు టెలికం నిర్వాహకులకు అవకాశం ఏర్పడుతుంది. అదీ,..ఇప్పటికే అవుతున్న ఖర్చులో ఐదోవంతు వ్యయంతోనే ఈ సదుపాయం కల్పించచ్చు. ఈ సదుపాయంకోసం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న గ్రామీణ అనుసంధాన వినియోగదారులు, రక్షణ విభాగం వినియోగదారులు త్వరలోనే కొత్త ఉత్పాదన పనితీరును ప్రత్యక్షంగా వీక్షించబోతున్నారు. తమ టెక్నాలజీ పనితీరును గురించి ఆస్ట్రోమ్ స్టార్టప్ కంపెనీ వారికి ప్రత్యక్షంగా వివరించబోతోంది.

  బెంగుళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (..ఎస్.సి.)లో ఆస్ట్రోమ్ స్టార్టప్ కంపెనీ ఉత్పాదనతో కూడిన సాంకేతిక పరిజ్ఞానానికి అంకురార్పణ జరిగింది. భారత ప్రభుత్వపు విజ్ఞాన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ (డి.ఎస్.టి.) ఆధ్వర్యంలోని డి.ఎస్.టి.-.బి.. మహిళా స్టార్టప్ కార్యక్రమం కింద ఈ ఉత్పాదనకు అవసరమైన ప్రోత్సాహం లభించింది. 2018లో ల్యాబ్ లో రూపొందించిన ఈ ఉత్పాదనకు సంబంధించి ఆస్ట్రోమ్ కంపెనీకి భారతదేశంలోను, అమెరికాలో పేటెంట్ హక్కులు కూడా మంజురయ్యాయి. అప్పటినుంచి ఈ టెక్నాలజీని గిగామెష్ పేరిట శక్తివంతమైన ఉత్పాదనగారూపుదిద్దారు. మనదేశంలోని మూరుమూల ఉన్న చిట్టచివరి ప్రాంతానికి  కావలసిన టెలికం మౌలికసదుపాయాల అవసరాలను కూడా ఈ టెక్నాలజీ తీర్చగలదని నిర్ధారితమైంది. క్షేత్ర స్థాయిలో ఈ ఉత్పాదన సామర్థ్యం, వాణిజ్యపరమైన వినియోగం కూడా రుజువైపోయింది.

  ఆస్ట్రోమ్ స్టార్టప్ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు, సి... అయిన నేహా శతక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, తనకు పెట్టుబడిదార్లకు మధ్య అనుసంధాన కర్తగా ఐ.ఐఎస్.సి. ఎంతో విశేషపాత్ర పోషించిందని, వాణిజ్యపరంగా తగిన మార్గదర్శకత్వం అందించిందని అన్నారు. క్షేత్రస్థాయిలో తమ ఉత్పాదన  వినియోగంపై ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించడానికి ఐ..ఎస్.సి. ఎంతో సహాయపడిందని నేహా శతక్ చెప్పారు. ఇందుకోసం డి.ఎస్.టి.-.బి.. మహిళా స్టార్టప్ పథకం చేపట్టిన వారంరోజుల పర్యటన ఎంతో ప్రయోజనకరమైనదిగా  ఆమె గుర్తు చేసుకున్నారు. అమెరికన్ మార్కెట్ లో తమ ఉత్పాదనను ప్రారంభించేందుకు అవసరమైన మద్దతును కూడా ఈ పర్యటన అందించిందని ఆమె తెలిపారు.

  అనుసంధాన సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థలో ఎంతో ఆశావహమైన సృజనాత్మక పరిష్కారాలను అందించినందుకు గాను ఆస్ట్రోమ్ స్టార్టప్ కంపెనీకి ఐ.టి.యు-ఎస్.ఎం.. అవార్డు లభించింది. ఈ ఉత్పాదనకు అంతర్జాతీయ టెలికమ్యానికేషన్ యూనియన్ (.టి.యు.)నుంచి లభించిన గణనీయమైన గుర్తింపుగా దీన్ని పరిగణించవచ్చు. క్వాల్ కామ్ సౌజన్యంలోని ప్రతిష్టాత్మకమైన ఇవో నెక్సస్ అనే ఫైవ్ జీ (5G) ప్రోగ్రామ్ కు కూడా ఈ ఉత్పాదన ఎంపికైంది. ప్రపంచ మార్కెట్లో ఈ ఉత్పాదన ఆవిష్కారానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది.

  మల్టీ-బీమ్ ఇ-బ్యాండ్ ఉత్పాదన అయిన గిగా మెష్ టెక్నాలజీకి ఉన్న ప్రత్యేకతల కారణంగా ఈ ఉత్పాదన పెట్టుబడి వ్యయం తగ్గించడంలో ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతి లింక్ ద్వారా మల్టీ జి.బి.పి.ఎస్. డేటా సదుపాయాన్ని ఇది అందజేయగలుగుతుంది. ఆటోమాటిక్ లింక్ అలైన్మెంట్, లింకుల మధ్య క్రియాశీలక పవర్ అలొకేషన్, రిమోట్ లింక్ ఫార్మేషన్ వంటి ప్రత్యేకతలు ఈ ఉత్పాదన సొంతం. టెలికం నిర్వాహకుల తక్కువ ఖర్చుతోనే గణనీయమై ఫలితాలతో కూడిన సేవలందించేందుకు ఈ ప్రత్యేకతలన్నీఎంతో దోహదపడతాయి.

  అస్ట్రోమ్ స్టార్టప్ కంపెనీ ప్రస్తుతం ఐ..ఎస్.సి యూనివర్సిటీ క్యాంపస్.లో క్షేత్రస్థాయి ప్రయోగాత్మక పరీక్షలు (ట్రయల్స్) నిర్వహిస్తోంది. క్యాంపస్.లో  మల్టీ జి.బి.పి.ఎస్. స్పీడ్లతో డాటాను అందించడంలో ఈ కంపెనీ విజయం సాధించిందని ఈ ట్రయల్స్.లో ఇప్పటికే రుజువైపోయింది

 

మరిన్ని వివరాలకోసం, డాక్టర్ నేహా శతక్ ను (neha@astrome.co) సంప్రదించవచ్చు.

 

Description: C:\Users\Admin\Downloads\IMG_8378.jpeg

2020వ సంవత్సరానికిగాను ఐ.... టెక్నాలజీ స్టార్టప్ అవార్డును అందుకుంటున్న

 ఆస్ట్రోమ్ స్టార్టప్ కంపెనీ సి..., ఇంజినీరింగ్ విభాగం డైరెక్టర్.

 

 

Description: C:\Users\Admin\Downloads\GigaMesh-light.jpeg

కనెక్టివిటీ ప్రయోగాత్మక పరీక్షల కోసం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (..ఎస్.సి.) ఆవరణలో గిగామెష్ టెక్నాలజీ ఉత్పాదన ఏర్పాటు చేసినప్పటి చిత్రం

 

************

 

 (Release ID: 1708309) Visitor Counter : 5