కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఐదు ఆలిండియా సర్వేలకు మాస్టర్ ట్రయినర్లకు శిక్షణ నిర్వహించనున్న లేబర్ బ్యూరో
Posted On:
28 MAR 2021 11:06AM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఐదు ఆలిండియా సర్వేల నిర్వహణకు వీలుగా నిర్వహిస్తున్న వరుస శిక్షణ కార్యక్రమాలలో భాగంగా లేబర్ బ్యూరో సూపర్‌వైజర్లు, వలస కార్మికులపై ఆలిండియా సర్వేలో పాల్గొంటున్న ఇన్వెస్టిగేటర్లు, ఆలిండియా క్వార్టర్లీ ఎస్టాబ్లిష్ మెంట్ ఆధారిత సర్వే ఇన్వెస్టిగేటర్లకు 2021 మార్చి 24 నుంచి 26 వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించించింది. లేబర్ బ్యూరో అధికారులు ఈ శిక్షణనిచ్చారు. ఇందులో సర్వేలో పాలుపంచుకుంటున్న సూపర్‌వైజర్లు, బ్యూరో అధికారులు పాల్గొన్నారు. భౌతికంగా శిక్షణ కార్యక్రమానికి హాజరు కావడంతో పాటు ఎంతో మంది సూపర్‌వైజరీ అధికారులు దేశవ్యాప్తంగా వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈరెండు సర్వేలకు సంబంధించి మెరుగైన పర్యవేక్షణకు వీలుగా గట్టి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లేబర్ బ్యూరోకు చెందిన అధికారులు వలసకార్మికులకు సంబంధించి ఆలింయడా సర్వే, త్రైమాసిక ఎస్టాబ్లిష్‌మెంట్ ఆధారిత ఎంప్లాయ్‌మెంట్ సర్వేల నిర్వహణనకు సంబంధించి సవివరమైన ప్రెజంటేషన్ ఇచ్చారు. రెండు రోజులలో సమాంతరంగా రెండు సర్వేలకు శిక్షణ ఇచ్చారు. సర్వే లక్ష్యాలు, సర్వేయంత్రంగం,ఇంటింటి సర్వే క్షేత్రస్థాని పని వివరాలను సూపర్‌వైజర్లకు పరిచయం చేశారు.
నాణ్యత, కచ్చితత్వంతొ కూడిన ఫలితాలు రాబట్టేందుకు సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
.
లేబర్ బ్యూరో ఈ ఏడాది నిర్వహించనున్న ఐదు ఆలిండియా సర్వేలలో ఈరెండు సర్వేలు ఉన్నాయి. ఈ సర్వేలకు ఐటి మద్దతు నిచ్చేందుకు లేబర్ , గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్‌ప్రైజ్ అయిన బిఇసిఐఎల్ ను నియమించింది. ఐటి పార్టనర్ అభివృద్ధి చేసిన సాప్ట్‌వేర్ అప్లికేషన్ వాడకంపైనా సూపర్‌వైజర్లకు ఈ శిక్షణ సందర్భంగా అనుభవం కల్పించారు. క్షేత్రస్థాయి సమాచార సేకరణకు చేతిలోని ట్యాబ్ లద్వారా ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు సమాచారం సేకరిస్తారు. సర్వే సాఫ్ట్‌వేర్‌లో క్షేత్ర స్థాయి సమాచార సేకరణ పని సులభం అయ్యేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే మున్నెన్నడూ లేనంతగా మరింత ఖచ్చితత్వం సాధించేందుకు అవసరమైన అన్ని ఫీచర్లు చేర్చారు. ఈ సర్వేల నిర్వహణలో టెక్నాలజీ అనుసంధానంతో సర్వేల రూపకల్పన సమయం 30నుంచి 40 శాతం వరకు తగ్గుతుంది.
వలస కార్మికులపై న అలాగే ఎక్యుఇఇఎస్‌లకు సంబంధించి లేబర్ బ్యూరో ఆలిండియా సర్వేను 2021 ఏప్రాల్ 1న ప్రారంభించనుంది. మిగిలిన మూడు సర్వేలను దశలవారీగా ఒకదాని తర్వాత ఒక దానిని ప్రారంభిస్తారు. ఈ సర్వేలు కార్మిక ఉపాధి రంగానికి సంబంధించి విధాన రూపకల్పనకు కీలక సమాచారాన్ని అందించనున్నాయి.
ఈ సర్వేలను నిపుణుల కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎస్.పి. ముఖర్జీ నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ లేబర్ బ్యూరో డిజి శ్రీ డిపిఎస్ నెగి, ఈ సర్వేల ప్రాధాన్యతను, అవి ఏ విధంగా కార్మిక, ఉపాధి విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించనున్నాయో తెలిపారు.
***
(Release ID: 1708308)
Visitor Counter : 184