ప్రధాన మంత్రి కార్యాలయం

‘శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర’ ట్రస్టు ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన ప్రధాన మంత్రి

ఒక చాలా గొప్ప రామాలయాన్ని అయోధ్య లో నిర్మించడం కోసం అన్ని నిర్ణయాల ను స్వతంత్ర ట్రస్టు తీసుకోనుందని తెలిపిన ప్రధాన మంత్రి

భారతదేశ ప్రజల స్వభావాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

భారతదేశం లో నివసిస్తున్న అన్ని సముదాయాల వారు ఒక పెద్ద కుటుంబం లో సభ్యులు అని స్పష్టం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 05 FEB 2020 1:42PM by PIB Hyderabad

సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశించిన ప్రకారం అయోధ్య లో ఒక రామాలయ నిర్మాణాన్ని పర్యవేక్షించడం కోసం ఒక ట్రస్టు ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంటు లో నేడు ప్రకటించారు.

 

‘‘సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వు ఆధారం గా నా ప్రభుత్వం ‘శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర’ ట్రస్టు ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కు ఈ రోజు న ఆమోదం తెలిపింది.  ఈ ట్రస్టు అయోధ్య లో ఒక వైభవోపేతమైనటువంటి రామాలయం స్థాపన కు సంబంధించిన అన్ని నిర్ణయాల ను తీసుకొనే స్వేచ్ఛను కలిగివుంటుంది’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

ఈ నిర్ణయం అయోధ్య పై సర్వోన్నత న్యాయ స్థానం ఇచ్చిన చారిత్రక తీర్పు కు అనుగుణం గా ఉంది

 

మాననీయ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సున్నీ వక్ఫ్ బోర్డు కు 5 ఎకరాల భూమి ని కేటాయించవలసింది గా ప్రభుత్వం యుపి ప్రభుత్వాన్ని అభ్యర్ధించింది.  అభ్యర్థన కు  రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

భారతదేశ సభ్యత, సంస్కృతి, స్ఫూర్తి మరియు ఆదర్శాల లో అయోధ్య కు మరియు భగవాన్ రాముని కి చరిత్రాత్మకమైనటువంటి మరియు ఆధ్యాత్మికమైనటువంటి ప్రాముఖ్యం జోడింపబడివుందనే సంగతి ని మనం అందరమూ ఎరుగుదుము.

 

‘‘ఒక భవ్యమైన రామాలయాన్ని నిర్మించడాన్ని, రానున్న కాలం లో రామ్ లాలా కు ప్రణామాల ను అర్పించేందుకు తరలివచ్చే భక్త జనుల యొక్క స్ఫూర్తి ని దృష్టి లో పెట్టుకొని ప్రభుత్వం మరొక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది.  దాదాపు గా 67.703 ఎకరాల మేర సేకరించిన యావత్తు భూమి ని ‘శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర’ ట్రస్టు కు బదలాయించాలని నిర్ణయించడం జరిగింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

భారతదేశ ప్రజలు ప్రదర్శించిన స్వభావాన్ని మెచ్చుకొన్న ప్రధాన మంత్రి

 

అయోధ్య అంశం లో మాననీయ సర్వోన్నత న్యాయస్థానం యొక్క నిర్ణయం వెలువడిన దరిమిలా దేశం లో శాంతి ని మరియు సద్భావన ను పరిరక్షించడం లో ప్రజలు కనబరచిన పరిణతి ని కూడా ప్రధాన మంత్రి ప్రశంసించారు.

ఇదే విషయాన్ని ట్విటర్ లో ఆయన ఒక సందేశం లో విడి గా పొందుపరుస్తూ, అందులో ‘‘భారతదేశ ప్రజలు ప్రజాస్వామిక ప్రక్రియల పట్ల మరియు విధానాల పట్ల అసాధారణ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  130 కోట్ల మంది భారతదేశ ప్రజల కు ఇవే నా నమస్కారాలు’’ అని పేర్కొన్నారు.

 

భారతదేశం లో నివసిస్తున్న అన్ని సముదాయాల వారు ఒక పెద్ద కుటుంబం లోని సభ్యులు

‘మనం అందరం ఒక కుటుంబం లో సభ్యులు గా ఉన్నాము’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.  ఇదీ భారతదేశం యొక్క సభ్యత అంటే.  భారతదేశం లో ప్రతి ఒక్కరు సంతోషం గాను, ఆరోగ్యం గాను ఉండాలని మేము కోరుకొంటాము.  ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ మార్గదర్శకత్వం లో భారతదేశం లో ప్రతి ఒక్కరి సంక్షేమార్థం మేము కృషి చేస్తున్నాము అని ప్రధాన మంత్రి అన్నారు.

 ‘‘మనమంతా కలసికట్టు గా ఒక విశాలమైన రామ మందిరాన్ని నిర్మించే దిశ గా కృ షి చేద్దాము’’ అని ప్రధాన మంత్రి  అన్నారు.

 

***(Release ID: 1708286) Visitor Counter : 57