పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఎన్‌పీఎన్‌టీ కంప్లైంట్ డ్రోన్ కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా 34 గ్రీన్ జోన్ సైట్లలో అనుమతులు
प्रविष्टि तिथि:
25 MAR 2021 6:47PM by PIB Hyderabad
దేశంలో డ్రోన్ కార్యకలాపాలకు సదుపాయాలు కల్పించడం, సులభతరం చేయడం మరియు ప్రోత్సహించడానికి గాను మొత్తం 34 అదనపు హరిత మండలాల్లో "నో-పర్మిషన్-నో-టేకాఫ్" (ఎన్‌పీఎన్‌టీ) కంప్లైంట్ డ్రోన్ కార్యకలాపాలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ ఆమోదించబడిన సైట్లలో డ్రోన్ వాడకాన్ని గ్రౌండ్ లెవెల్ (ఏజీఎల్) పైన 400 అడుగుల వరకు అనుమతిస్తారు. 20 ఫిబ్రవరి 2021 నాటి ఆమోదం పొందిన ఇరవై ఆరు గ్రీన్ జోన్ సైట్లు మరియు 03 ఏప్రిల్ 2020 నాటి ఆమోదం తెలిపిన ఆరు గ్రీన్ జోన్ సైట్లకు తాజా అనుమతించబడి సైట్లు అదనం. డీజీసీఏ ప్రకారం, “ఎన్‌పీఎన్‌టీ లేదా‘ నో పర్మిషన్ - నో టేక్-ఆఫ్’ సమ్మతి భారతదేశంలో పనిచేసే ముందు డిజిటల్ స్కై ప్లాట్‌ఫామ్ ద్వారా చెల్లుబాటు అయ్యే అనుమతి పొందటానికి ప్రతి రిమోట్లీ పైలట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు (నానో మినహా) తగిన అనుమతులనిస్తుంది. ఇది అవసరమైన ఆమోదాలకు పొందక ముందే డ్రోన్‌ల వినియోగించకుండా చేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఆమోదించబడిన ‘గ్రీన్-జోన్’లలో ప్రయాణించడానికి డిజిటల్ స్కై పోర్టల్ లేదా యాప్ ద్వారా ఈ విమానాల సమయం మరియు గమ్య స్థానం గురించి మాత్రం తెలియజేయాలి. రిమోట్గా పైలట్ చేసిన విమానాల కోసం జాతీయ మానవరహిత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థగా పనిచేసే ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఫ్రేమ్‌వర్క్ వినియోగదారులను ఆదేశిస్తుంది. గ్రీన్ జోన్ సైట్లలోని డ్రోన్ విమానాలు మానవరహిత విమాన వ్యవస్థ (యుఏఎస్) నిబంధనలు, 2021 యొక్క వర్తించే షరతులకు అనుగుణంగా ఉండాలి. పేర్కొన్న సైట్లలో ఎన్‌పీఎన్‌టీ-కంప్లైంట్ డ్రోన్‌ల కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక పరిపాలన వ్యవస్థలను అభ్యర్థించడమైంది.
గ్రీన్ జోన్ సైట్ల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
***
(रिलीज़ आईडी: 1707710)
आगंतुक पटल : 219