ఆయుష్

ప్రజల ఉత్పాదకత సామర్త్యాన్ని ఇంకా పెంచడానికి ఒక సాధనంగా యోగాను వినియోగించేలా మార్గాలను అన్వేషించేందుకు

అంతర్గతంగా వివిధ విభాగాల నిపుణుల బృందం ఏర్పాటు చేసిన ఆయుష్ మంత్రిత్వ శాఖ

Posted On: 25 MAR 2021 12:09PM by PIB Hyderabad

ఆరోగ్యం, శ్రేయస్సు, వ్యక్తిగత వృద్ధిని కోరుకునే వారికి యోగ ఒక వరం. ఇది అందరికి ఆమోదయోగ్యమైన ప్రక్రియ. సాధనను కార్యాలయంలో ఉత్పాదకత పెంచే సాధనంగా ఉపయోగించవచ్చా? దాని విస్తృత స్వీకరణ, ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధమైన వృద్ధి, అభివృద్ధిపై సానుకూల ప్రభావాలను చూపుతుందా ?

ఈ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించి ఒక మంచి ఫలదాయకమైన ఒక విధానాన్ని శోధించడానికి కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంతర్ విభాగాల నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ప్రారంభ సమావేశం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా నిన్న (24 మర్చి 2021) జరిగింది. సమావేశానికి ఎస్వ్యాస ఛాన్సలర్ డాక్టర్ హెచ్.ఆర్. నాగేంద్ర అధ్యక్షత వహించారు. దీనిలో సభ్యులు ముఖ్యంగా న్యూ ఢిల్లీ ఎయిమ్స్, ఐఐఎం బెంగళూరు, ఐఐటీ బాంబే, ఇంకా ప్రముఖ యోగ సంస్థలు, కార్పొరేట్ రంగం సభ్యులు పాల్గొన్నారు. 

గడచిన 5 ఏళ్లలో విశ్వ వ్యాప్తంగా యోగ కి విపరీతమైన ప్రజాదరణ లభించిందని  కమిటీ  అభిప్రాయ పడింది. యోగా ఆధ్యాత్మిక అనుసంధానం మరియు ఆరోగ్య ప్రయోజనాలను దాని అభ్యాసకులు విస్తృతంగా స్వీకరించారు. కానీ యోగా ఉత్పాదకత పరిమాణం - ఉద్యోగులకు మెరుగైన పనితీరును అందించడంలో కార్యాలయంలో దాని పాత్ర - విస్తృత పరిధిలో ఇంకా గుర్తింపు రాలేదు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న శారీరక మరియు మానసిక ఒత్తిళ్లు, ప్రస్తుత మహమ్మారి ద్వారా తీవ్రతరం కావడంతో, యజమానులు పరిస్థితిని ఎదుర్కొని, కార్యాలయ శ్రేయస్సును మెరుగుపరచడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఈ పరిమాణం చాలా ముఖ్యమైనది.

భారతదేశ వృద్ధి ఆకాంక్షలు అత్యధికంగా ఉన్నప్పుడు ప్రస్తుత సందర్భంలో ఉత్పాదకత కోసం యోగా అనేది చాలా ముఖ్యమైన అంశం అని కొందరు సభ్యులు ప్రముఖంగా ప్రస్తావించారు. కమిటీ  ప్రాధమిక విధులలో ఒకటి, యోగాను ఉత్పాదకతతో అనుసంధానించిన అంశాలతో సమీక్షించడం, దానిని విశ్లేషించడం. ఏ మేరకు ఉత్పాదకత సాధిస్తారో  వివిధ దిశలను అప్పుడు క్రమపద్ధతిలో గుర్తించి ఈ దిశగా ప్రోటోకాల్‌ను అభివృద్ధి చేస్తారు. కమిటీ తన సిఫారసులను ఖరారు చేయడంలో విజ్ఞానపరమైన విషయాలు, వాటిని నిర్ధారించే అంశాల ఆధారంగా ఒక విధానాన్ని రూపొందించాలని తీర్మానించారు. తగిన ఆధారాలు, శాస్త్రీయతను పరిగణలోకి తీసుకునే ఇందుకు తగిన విధానాన్ని కమిటీ ఖరారు చేస్తుంది. 

ఇప్పటికే అనేక సంస్థలు, పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు యోగ శిక్షకులను తమ కార్యస్థానాల్లో నియమించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఉద్యోగ సిబ్బందికి ఒత్తిళ్లు తగ్గించి, మానవ సహ సంబంధాలను మెరుగు పరచడం, వైషమ్యాలు తగ్గించడం,  పని పట్ల మక్కువ పెంచడం వంటి చర్యల ద్వారా ఉత్పతనీయత పెంచేలా ఆయా సంస్థలు ముందుకు అడుగులు వేస్తున్నాయి. 

ఉత్పాదకత పెరగడం అనేది లాభదాయకత పెంచడం, పాలనాపరమైన వ్యయాలను తగ్గించడం, వనరులను తగు రీతిలో వెచ్చించడం, వృద్ధికి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, పోటీతత్వాన్ని పెంచడం, ఉద్యోగుల శ్రేయస్సు పెంచడం వంటి వివిధ సందర్భాల్లో విభిన్న విషయాలను సూచిస్తుంది. అందువల్ల కమిటీ పనితీరులో బహుళ వైవిధ్యాలు, సంక్లిష్టతలు ఉంటాయి. 

విశ్వవిద్యాలయాలు, ఆధునిక ఔషధ మరియు ఆయుష్ వ్యవస్థలకు సంబంధించిన ఆసుపత్రులు, కార్పొరేట్ సంస్థలు, యోగా సంస్థలతో సహా ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగానికి చెందిన వివిధ సంస్థలు ఈ అధ్యయనంతో సంబంధం కలిగి ఉంటాయని భావిస్తున్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ కూడా ఈ అధ్యయనానికి మద్దతు ఇస్తోంది. 

మే 2021 నాటికి కమిటీ తన ప్రాథమిక సిఫార్సులను సమర్పించనుంది.

                                                                                                                                        

****



(Release ID: 1707558) Visitor Counter : 135