సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ఉద్యోగార్ధుల గరిష్ట వయోపరిమితిని పెంచడం
Posted On:
25 MAR 2021 12:29PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారి భద్రతా ప్రోటోకాళ్ళను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామానికి సురక్షితంగా అర్హత పరీక్షలు నిర్వహించేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి రిక్రూటింగ్ ఏజెన్సీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కోవిడ్-19కు ముందు/ ఆ సమయంలో వేరే ప్రాంతానికి మారిన అభ్యర్ధులు కూడా పరీక్షకు హాజరయ్యే అవకాశం ఇచ్చేందుకు, సివిల్ సర్వీసు (ప్రిలిమినరీ) పరీక్ష -2020ను 04.10.2020 సమయంలో అభ్యర్ధులకు పరీక్షా కేంద్రాన్ని మార్చుకునే ఎంపికను యుపిఎస్‌సి ఇచ్చింది. దేశంలో మహమ్మారి, లాక్‌డౌన్‌ల కారణంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ వర్గాలలో ఉన్న పోస్టుల నియామకానికి గరిష్ట వయోపరిమితిని పెంచవలసిన అవసరం తలెత్తదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అర్హులైన నిరుద్యోగ యువతకు రెండేళ్ళ గరిష్ట వయోపరిమితి పెంచాలన్న విషయం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవలసిన అంశం.
ఈ సమాచారాన్ని ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డిఒఎన్ఇఆర్) (ఇండిపెండెంట్ ఛార్జి) సహాయ మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు & పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు గురువారం సమర్పించిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు.
****
(Release ID: 1707528)
Visitor Counter : 183