విద్యుత్తు మంత్రిత్వ శాఖ

గ్రామ్ ఉజాలా పరిధి విస్తరణ, నేడు వారణాసిలో ప్రారంభం

బీహార్ లో 2రోజుల్లో 6,150 దాటిన పంపిణీ: విద్యుత్ మంత్రి

మొదటి దశలో కోటిన్నర ఎల్ ఇ డి బల్బుల పంపిణీ

Posted On: 24 MAR 2021 3:16PM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్, పునరుత్పాదక ఇంధనవనరుల శాఖ సహాయమంత్రి శ్రీ ఆర్ కె సింగ్ ఈ రోజు ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో గ్రామ్ ఉజాలా పథకానికి శ్రీకారం చుట్టారు.  ఈ పథకం కింద ఎనర్జీ ఎఫిషెయెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ కు చెందిన కన్వర్జెన్స్ ఎనర్జీ సెర్వీసెస్ లిమిటెడ్ గ్రామీణ ప్రాంతాలలో నాణ్యమైన ఎల్ ఇ డి బల్బులను ఒక్కొక్కటి రూ.10 కే పంపిణీ చేస్తుందీ పథక ప్రారంభ కార్యక్రమానికి విద్యుత్ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అలోక్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

ఈ గ్రామ్ ఉజాలా పథకం మొదటి దశ కింద కోటీ 50 లక్షల ఎల్ ఇ డి బల్బుల పంపిణీ జరుగుతుంది. దీనివలన భారత వాతావరణ మార్పు మీద సానుకూల ప్రభావం ఉంటుంది.  ఏదాదికి 2025 కిలోవాట అవర్ చొప్పున విద్యుత్ ఆదా అవుతుంది. అదే విధంగా ఏడాదికి 1.65 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంది. కేవలం రూ.10 కే బల్బ్ అందుబాటులోకి రావటం, మరింత వెలుగు రావటం ద్వారా గ్రామీణ  ప్రజలకు మెరుగైన జీవనాన్ని, ఆర్థికంగా ఆదా, మెరుగైన రక్షణ కల్పించినట్టవుతుంది.

గ్రామీణ ప్రజలకు అందుబాటు ధరలో నాణ్యమైన ఎల్ ఇ డి బల్బులు అందిస్తున్న కన్వర్జెన్స్ ఎనర్జీ సెర్వీసెస్  సంస్థను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. అందరికీ విద్యుత్ నినాదంతో కేంద్రంతో ఒప్పందం చేసుకున్న నాలుగేళ్ళలోనే ప్రతి గ్రామానికీ విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నందుకు ఉత్తరప్రదేశ్ రాష్టప్రభుత్వాన్ని కూడా అభినందించారు. ఇంధన మార్పులోను, ఇంధన సామర్థ్యంలోనూ భారత్ ముందున్నదని చెబుతూ గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నదే ఈ పథకం ధ్యేయమన్నారు. 100 వాట్ల సాధారణ బల్బ్ కు సమానంగా 12 వాట్ల ఎల్ ఇ డి బల్బ్ కాంతినిస్తుందన్నారు.

ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 36 కోట్ల ఎల్ ఇ డి బల్బులు పంచటంతోబాటు కోటీ 15 లక్షల బల్బులను ఎల్ ఇ డి తో మార్చినందుకు, వేలాది మెగావాట్ల విద్యుత్ ఆదా చేసినందుకు  సంస్థను అభినందించారు. పథకం బీహార్ లోని అర్రా లో  కేవలం 2 రోజుల్లోనే 6,150 పంపిణీ లక్ష్యాన్ని మించిపోయిందన్నారు.  ఈ పథకం కింద మూడేళ్ల వారంటీతో 7 వాట్ల, 12 వాట్ల బల్బుల పంపిణీ జరుగుతోంది. ఐదు జిల్లాల్లోని గ్రామాల్లో ఒక్కో వాడకందారుకు ఐదు బల్బులవరకు పాత బల్బుల స్థానంలో ఎల్ ఇ డి బల్బులు తీసుకోవచ్చు.  మీటర్ల ద్వారా వినియోగంలో తగ్గుదలని కూడా లెక్కిస్తారు.

 

 

****


(Release ID: 1707315) Visitor Counter : 212


Read this release in: English , Urdu , Hindi , Punjabi