చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా శ్రీ రాజేంద్ర బాదామికర్ మరియు సుశ్రీ ఖాజీ జయబున్నీసా మొహియుద్దీన్లను రాష్ట్రపతి నియమించారు.
Posted On:
24 MAR 2021 2:20PM by PIB Hyderabad
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 224 లోని క్లాజ్ (l) ద్వారా ఇవ్వబడిన అధికారం ద్వారా భారత రాష్ట్రపతి.. శ్రీ రాజేంద్ర బాదామికర్, మరియు సుశ్రీ ఖాజీ జయబున్నిసా మొహియుద్దీన్లను కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. వారు తమ కార్యాలయాల బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ను న్యాయశాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ 22 మార్చి 2021 న జారీ చేసింది.
శ్రీ రాజేంద్ర బాదామికర్, బి.ఎస్.సి, ఎల్.ఎల్.బి (Spl.),అక్టోబర్ 18, 1993 న జ్యుడిషియల్ సర్వీస్‌లో మున్సిఫ్‌గా చేరారు. సివిల్ జడ్జి, జిల్లా జడ్జి మరియు సెషన్స్ జడ్జ్ పదవుల్లో 26 సంవత్సరాలకు పైగా పనిచేశారు. కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడిషియల్)గా కూడా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా పనిచేస్తున్నారు.
సుశ్రీ ఖాజీ జయబున్నిసా మొహియుద్దీన్, బి.ఎస్.సి, ఎల్.ఎల్.ఎమ్, అక్టోబర్ 18, 1993 న మున్సిఫ్‌గా జ్యుడిషియల్ సర్వీసులో చేరారు. మరియు సివిల్ జడ్జి, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మరియు సెషన్స్ జడ్జిల కేడర్లలో 26 సంవత్సరాలకు పైగా పనిచేశారు. ఆమె కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్) గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) గా పనిచేస్తున్నారు.
****
(Release ID: 1707259)
Visitor Counter : 195