రైల్వే మంత్రిత్వ శాఖ

రైళ్లలో ధూమపాన నివారణ , మండే గుణం వున్న వస్తువుల రవాణాని నివారించడానికి భారతీయ రైల్వేల ప్రత్యేక కార్యక్రమం

అందరిలో అవగాహన కల్పించడానికి అన్ని రైల్వే జోన్లలో వారం రోజులు సాగే అవగాహనా కార్యక్రమం ప్రారంభం

అవగాహన కల్పించడంతోపాటు అన్ని స్టేషన్లు రైళ్లలో ముమ్మర తనిఖీలు

Posted On: 23 MAR 2021 1:48PM by PIB Hyderabad

రైళ్లలో అగ్ని ప్రమాదాలను అరికట్టడానికి భారతీయ రైల్వేల శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈనెల 22వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యింది.    కదులుతున్న రైళ్లలో ధూమపానం చేయడంమండే గుణం వున్న వస్తువులను రవాణా చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఆస్థి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయని గుర్తించిన రైల్వే శాఖ అన్ని రైల్వే జోన్లలో ధూమపానాన్ని అరికట్టి,  మండే గుణం వున్న వస్తువులను రవాణా చేయకుండా చూడడానికి  ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అవగాహన కల్పించిన తరువాత ఈనెల 31వ తేదీ నుంచి చట్టపరంగా చర్యలను తీసుకోవడం ప్రారంభిస్తారు. కార్యక్రమం 2021 ఏప్రిల్ 30వ తేదీవరకు కొనసాగుతుంది. 

కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయడానికి ఈ కింది చర్యలను తీసుకోవాలని అన్ని జోనల్ రైల్వేల అధికారులను రైల్వే అధికారులు ఆదేశించారు. 

 1.      అవగాహన కల్పించడానికి సమగ్ర ప్రచారం :  సంబంధిత వర్గాలకు చెందిన వారికి అవగాహన కల్పించడానికి వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలి. దీనిలో రైల్వే వినియోగదారులు మరియు స్టేషన్లు రైళ్లలో పనిచేస్తున్న  రైల్వే /  రైల్వే ఉద్యోగులు కానివారు  అంటే  పార్శిల్ సిబ్బందిలీజు హోల్డర్లు మరియు వారి సిబ్బందిపార్శిల్ కూలీలు క్యాటరింగ్ సిబ్బందితో పాటు ఔట్  సోర్చింగ్ సిబ్బంది సహాయంతో  అగ్ని ప్రమాదాలను అరికట్టడానికి అనుసరించవలసిన కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి.  “ధూమపానాన్ని నిషేధించడం ” రైలు ద్వారా మండే గుణం వున్న వస్తువులు రవాణా కాకుండా చూడడానికి  ఎస్‌ఎల్‌ఆర్‌లు / విపియులు / లీజుకు తీసుకున్న పార్శిళ్లను  తనిఖీ చేయడం వంటి ప్రత్యక్షచర్యలతో పాటు కరపత్రాలను పంపిణి చేయడం స్టిక్కర్లను అతికించడంప్రదర్శనలను నిర్వహించడంస్టేషన్లలో పిఏ సిస్టమ్ ద్వారాప్రకటించడం ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియాలో ప్రకటనలు జారీచేయడం ద్వారా అవగాహన కలిగించాలి. 

2. అవగాహన కార్యక్రమాలు ముగిసిన తరవాత నిరంతరం పటిష్టంగా ఈ కింది చర్యలను ప్రారంభించాలి 

ఎ. రైళ్లు, రైల్వే ప్రాంగణాల్లో నిబంధనలకు విరుద్ధంగా ధూమపానం చేసేవారిపై రైల్వే చట్టాలు లేదా పొగాకు చట్టం ప్రకారం కేసులను నమోదు చేయాలి.  సిగరెట్ మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం2003.నిబంధనలను అమలు చేయడానికి  వాణిజ్య విభాగంలో  టికెట్ కలెక్టర్ ర్యాంకు  అధికారి లేదా ఆపరేటింగ్ డిపార్ట్‌మెంట్ లో  సమానమైన ర్యాంక్ కలిగి ఉన్న అధికారి లేదా ఆర్‌పిఎఫ్‌లో ఎ ఎస్ ఐ  ర్యాంకు అధికారి అధికారం కలిగి వుంటారు. 

బి. మండే గుణం పేలే ప్రమాదం వున్న వస్తువుల రవాణాను అరికట్టడానికి పాంట్రీ కార్లు (ఎల్‌పిజి సిలిండర్ల రవాణా కోసం) సహా రైళ్లలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై  రైల్వే చట్టంలోని సంబంధిత సెక్షన్ల  ప్రకారం చర్యలు తీసుకోవాలి. 

సి. అకస్మాత్తుగా మంటలు వ్యాప్తి చెడకుండా చూడడం, వంటల కోసం సేగ్రి పొయ్యిల వాడకం మండే గుణం వున్న వ్యర్ధాలను నిల్వ చేయకుండా చూడడానికి ప్లాట్‌ఫారమ్‌లు,రైల్వే యార్డులు , వాషింగ్ / సిక్ లైన్లను తరచు తనికీ చేయాలి. ఇంధన కేంద్రాలలో కూడా ఇటువంటి తనిఖీలను నిర్వహిస్తూ నిందితులపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలి. 

డి.  పేలుడు పదార్థాల మండే గుణం వున్న వస్తువులను బుకింగ్ చేయకుండా చూడడానికి  పార్సెల్ కార్యాలయాలు / లీజుదారుల ద్వారా బుక్ చేసుకున్న  పార్శిళ్లను   తనిఖీ చేయాలి. 

ఇ. రైళ్లలో మరియు ప్లాట్‌ఫామ్‌లపై  సిగ్రి / స్టవ్‌లను ఉపయోగించే అధీకృత / అనధికార విక్రేతలపై కూడా చర్యలు తీసుకోవచ్చు.

***



(Release ID: 1706887) Visitor Counter : 163