ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి వీధి వర్తకులు (స్ట్రీట్ వెండార్స్)కు ఆత్మ నిర్భర్ నిధి (పిఎం ఎస్‌విఎ నిధి) కింద లబ్ధిదారులకు రూ.23.24 లక్షలు మేరకు రుణాలను మంజూరు చేసిన, 18.54 లక్షలు పంపిణీ
Posted On:
22 MAR 2021 3:49PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి వీధి వర్తకులు (స్ట్రీట్ వెండార్స్)కు ఆత్మ నిర్భర్ నిధి (పిఎం ఎస్‌విఎ నిధి) కింద లబ్ధిదారులకు 15.03.2021 వరకు రూ.23.24 లక్షలు మేరకు రుణాలను మంజూరు చేసిన, 18.54 లక్షలు పంపిణీ చేసినట్టు గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఒహెచ్‌యుఎ ) వెల్లడించింది.
ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సోమవారం లిఖితపూర్వకంగా లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో తెలిపారు. లాక్ డౌన్ కారణంగా వ్యాపారాలు దారుణంగా దెబ్బ తిన్న 50లక్షల మంది వీధి వర్తకులకు ఒక రేడాది కాలపరిమితితో రూ. 10,000 అనుషంగిక షరతులు లేని నిర్వహణ మూల నాధిని కల్పించాలన్న లక్ష్యంతో జూన్ 1, 2020న ఎంఒహెచ్‌యుఎ ప్రధానమంత్రి వీధి వర్తకులు, ఆత్మనిర్భర్ నిధి (పిఎం ఎస్‌విఎ నిధి) పథకాలను ప్రారంభించినట్టు మంత్రి తెలిపారు. క్రమం తప్పకుండా రుణాన్ని తిరిగి చెల్లించే వారికి 7% మేరకు వడ్డీ రాయితీని ప్రోత్సాహకాన్ని, నిర్దేశిత డిజిటల్ ట్రాన్సాక్షన్లను చేసినందుకు నెలకు రూ.100 క్యాష్ బ్యాక్ రివార్డును కూడా ఈ పథకం కల్పిస్తుంది.
కాలపరిమితిలో లేక ముందస్తు చెల్లింపులు చేసే వీధివర్తకులు వచ్చే రుణ పంపిణీ చక్రంలో మరింత నిర్వహణ మూలధన రుణాన్ని పొందేందుకు అర్హులని మంత్రి వివరించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల అర్హతను నిర్ధారించడం కోసం ప్రథకం వారి సామాజిక -ఆర్థిక ప్రొఫైలింగ్‌కు అవకాశమివ్వడమే గాక, అర్హులైన వారిని ఆ పథకానికి లింక్ చేస్తుంది. దీనితోపాటుగా, ఆహార పదార్ధాలను అమ్మే వీధి వర్తక లబ్ధిదారులకు ఆహార బట్వాడా కోసం వారికి ఆన్-బోర్డ్-ఇ- కామర్స్ ప్లాట్‌ఫాంలను ఏర్పాటు చేయాలని కూడా పథకం లక్ష్యిస్తోంది.
రాష్ట్రాల వారీగా కేటాయించిన రుణాలు, వాటి పంపిణీకి సంబంధించిన డాటా జతపరచడమైంది.
***
(Release ID: 1706830)
Visitor Counter : 243