ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
సార్వత్రిక ప్రాథమిక ఆరోగ్య రక్షణలో కీలకమైన మైలురాయి దాటిన భారత్
లక్ష్యానికి ముందే వినియోగంలోకి వచ్చిన70,000 ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల ద్వారా ఇప్పటికే 41.35 కోట్లమందికి ఆరోగ్య సేవలు
9.45 లక్షలకు పైగా టెలీ సంప్రదింపులు
Posted On:
21 MAR 2021 9:55AM by PIB Hyderabad
ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందరికీ అందుబాటులోకి తీసుకురావటంలో భారతదేశం మరో కీలకమైన మైలురాయి దాటింది. 2021 మార్చి 31 లోగా 70 వేల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోగా ఆ గడువుకు ముందే లక్ష్యాన్ని సాధించింది. ఒకవైపు కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించటం, వివిధ ప్రక్రియల ప్రామాణీకరణ, ఎప్పటికప్పుడు చాలా సరళంగా మార్పులు చేసుకుంటూ అన్ని స్థాయిలలో సమాలోచనలు సాగిస్తూ, సమస్యలను పరిష్కరించూ ముమ్దుకు సాగటం వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ లక్ష్యాన్ని సాధించగలిగాయి. సమర్థవంతమైన వికేంద్రీకరణకు, సహకార సమాఖ్య విధానానికి ఇది నిదర్శనంగా నిలిచింది.
కొహిమా లోని యుపిహెచ్ సీఖజౌ ఆరోగ్య కేంద్రం
2018 ఏప్రిల్ లో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించటం భారతదేశ ప్రజారోగ్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. 2022 డిసెంబర్ నాటికల్లా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని 1,50,000 ఉప ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలుగా మార్చి సమగ్రమైన ప్రాథమైక ఆరోగ్య సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ముందస్తు రోగ నివారణను ప్రోత్సహించటం, ప్రజల క్షేమం మీద దృష్టి సారిస్తూ స్థానికంగా నిరంతర ఆరోగ్య సేవలు అందిస్తారు. ఉచితంగా దగ్గర్లో అందుబాటులో ఉండే ఈ వైద్య సేవలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి. అందరికీ ఆరోగ్యమనే భారత దృక్పథాన్ని సాకారం చేసుకోవటానికి ఇది దోహదపడుతుంది.
అదసపు సిబ్బందిని జోడించటం, బీ ఎస్సీ నర్సింగ్ లేదా బిఈమెస్ అర్హత ఉండి శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ( సి హెచ్ ఓ) పేరుతో ఉప ఆరోగ్యకేంద్రానికి అధిపతిగా నియమిస్తారు. వీరు ఆయుష్మాన్ భారత్ ఆస్పత్రిలో ప్రాథమిక ఆరోగ్య సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు నాయకత్వం వహించి నడుపుతారు.
ఇప్పుడున్న పునరుత్పాదక, శిశు ఆరోగ్య సేవలను, అంటువ్యాధి నిర్మూలన సేవలను విస్తృతపరచి బలోపేతం చేయటంతోబాటు రక్తపోటు, మధుమేహం. నోటి, రొమ్ము సర్వైకల్ కాన్సర్ల నిర్థారణ పరీక్షలు జరపటం వీటి బాధ్యత. క్రమేణా మానసిక వైద్యం, ఇ ఎన్ టి, నేత్ర వ్యాధి చికిత్స, నోటి వ్యాధుల చికిత్స, వృద్ధాప్య సమస్యలకు చికిత్స లాంటి ఇతర సేవలను కూడా జోడిస్తూ ఉంటారు. తప్పనిసరి వ్యాధి నిర్థారణ పరీక్షల జాబితా పెంచుతున్నారు.
o హెచ్ ఎస్ సి-హెచ్ డబ్ల్యుసి లు : ఇప్పుడున్న 7 నుంచి 14 పరీక్షలు
o పిహెచ్ సి- హెచ్ డబ్ల్యుసి లు: ఇప్పుడున్న 19 నుంచి 63 పరీక్షలు
· అన్ని ఎస్ హెచ్ సి , పిహెచ్ సి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలలో అత్యవసర ఔషధాల జాబితాను విస్తృతం చేయటంతోబాటు దానిని నేషనల్ హెల్త్ మిషన్ లోని జాతీయ ఉచిత ఔషధ సేవా కార్యక్రమం పరిధిలోకి చేర్చారు. దీనివలన బీపీ, చక్కెరవ్యాధి సహా సహా అన్ని జబ్బుల చికిత్సకు సహా అన్నిటికీ ఔషధాల సరఫరా నిరంతరాయంగా జరుగుతుంది.
o ఎస్ హెచ్ సి-హెచ్ డబ్ల్యు సిలు : ఇప్పుడున్న 57 నుంచి 105 ఔషధాలు
o పి హెచ్ సి – హెచ్ డబ్ల్యుసి లు: ఇప్పుడున్న 232 నుంచి 172 ఔషధాలు
జార్ఖండ్ లోని రాంచీలోని హెచ్ డబ్ల్యు సిలలో ఎంసిహెచ్ సేవలు
ఆరోగ్య సేవలు అందించటంతోబాటు లింగ సమానత్వాన్ని చాటటంలో హెచ్ డబ్ల్యు సి లు ముందున్నాయి. ఇప్పటిదాకా ఈ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలలో 41.35 కోట్లమంది ప్రజలు ఆరోగ్య సేవలందుకున్నారు. వారిలో 54% మంది మహిళలు.
చత్తీస్ గఢ్ లోని గదాదిహ్ హెచ్ డబ్ల్యు సి లో అంటువ్యాధేతర వ్యాధి నిర్థారణ పరీక్షలు
వివిధ కార్యకలాపాల ద్వారా హెచ్ డబ్ల్యు సి లు ఆరోగ్యకరమైన జీవనశైలిమీద దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటిదాకా ఈ కేంద్రాలు 64.4 లక్షల శిబిరాలు నిర్వహించాయి. స్థానిక సందర్భాన్ని బట్టి రాష్ట్రాలు యోగ, స్థానిక క్రీడలు, ఈశాన్య రాష్ట్రాల్లో జుంబా లాంటి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఏడాది పొడవునా మొత్తం 39 రకాల ఆరోగ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలతో రూపొందించిన కాలెండర్ ను పాటిస్తున్నాయి.
మిజోరం లోని హెచ్ డబ్ల్యు సిలో వృద్ధుల సంరక్షణ సేవలు
హెచ్ డబ్ల్యు సి ల ద్వారా అందించే సేవలలో వ్యాధి నివారణ చర్యలది కీలకపాత్ర. ఆశా కార్యకర్తలు, ఎ ఎన్ ఎం ల ద్వారా 30 ఏళ్ళు పైబడ్డ జనాభా లెక్కలు తీయించారు. రిస్క్ ను వయోవర్గం ఆధారంగా లెక్కించటానికి ఇది దోహదపడింది. వివిధ వ్యక్తులను అంటువ్యాధేతర వ్యాధులకోసం పరీక్షలు జరిపారు. అలా గుర్తించినవారిని చికిత్సలో ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఇప్పటిదాకా బీపీకి 9.1 కోట్లమందికి, మధుమేహానికి 7.4 కోట్లమందికి, నోటి కాన్సర్ కు 4.7 కోట్లమందికి, రొమ్ము కాన్సర్ కు 2.4 కోట్ల మందికి, సర్వైకల్ కాన్సర్ కు 1.7 కోట్లమందికి పరీక్షలు జరిపారు.
జార్ఖండ్ లోని రాంచీలో ఒక హెచ్ డబ్ల్యుసి లో రొమ్ము కాన్సర్ మీద కౌన్సిలింగ్
హెచ్ డబ్ల్యుసి ల మరో ముఖ్యమైన అంశం టెలీ సంప్రదింపులు. ఈ హెచ్ డబ్ల్యుసి లలో 9.45 లక్షలకు పైగా టెలీ సంప్రదింపులు జరిగాయి.
కోవిడ్-19 సంక్షోభ సమయంలో కోవిడ్ నివారణకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు ప్రజారోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషించాయి. అదే సమయంలో కోవిడ్ తో సంబంధం లేని ఇతర వ్యాధుల చికిత్సలో సైతం ముందున్నాయి. అంటువ్యాధులు కాని వాటికి మొత్తం 75% వరకు వ్యా2020 ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా వ్యాధినిర్థారణ పరీక్షలు జరిగాయి. ఇప్పుడున్న పరిస్థితుల మధ్య ఈ ఆయుష్మాన్ భారత్ కేంద్రాలమీద ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి ఇదే నిదర్శనం.
ఈ బృందాల నాయకత్వంలో 60% పైగా, క్షేత్రస్థాయి సిబ్బందిలో 90% పైగా మహిళలే ఉండటం గమనార్హం. ఆరోగ్యరక్షణ రంగంలో లింగభేదానికి తావులేకపోవటానికి ఇదొక ఉదాహరణ. భారత ఆరోగ్య వ్యవస్థలకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యకేంద్రాలు కీలకమైన శక్తిగా తయారవుతున్నాయి. సేవల పరిమాణం, అమలు జరుగుతున్న వేగం ఈ కార్యక్రమం సజావుగా సాగుతోందన్న నమ్మకానికి స్ఫూర్తిగా నిలిచాయి. సమగ్రమైన ప్రాథమిక వైద్య సహాయం ప్రజలకు చేరువలో ఉందన్న నమ్మకాన్ని పెంచుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలలో సేవల విస్తృతి ఈ విధంగా ఉంది:
1. గర్భధారణ, శిశుజననంలో రక్షణ
2. ప్రసూతి, శిశు ఆరోగ్య సేవలు
3. పిల్లలు, యవ్వనుల ఆరోగ్యసేవలు
4. కుటుంబ నియంత్రణ, గర్భ నిరోధక సేవలు, పునరుత్పత్తి ఆరోగ్య సేవలు
5. అంటువ్యాధుల పర్యవేక్షణ: జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు
6. చిన్నపాటి అనారోగ్య సమస్యలకు ఔట్ పేషెంట్ చికిత్స
7. క్షయ, కుష్ఠవ్యాధి లాంటి తీవ్రమైన వ్యాధులకు నిర్థారణ పరీక్షలు, నివారణ, నియంత్రణ
8. ప్రాథమిక నోటి ఆరోగ్య రక్షణ
9. మానసిక ఆరోగ్య సమస్యలకు పరెక్శలు, ప్రాథమిక వైద్య సాయం
10. సాధారన కంటి, చెవి, ముక్కు, గొంతు సమస్యలకు రక్షణ
11. వృద్ధులకు సాంత్వన ఆరోగ్య సేవలు
12. కాలిన బొబ్బలు, భరించలేని నొప్పి సహా అత్యవసర సమస్యలకు వైద్య సేవలు
జార్ఖండ్ లోని బొకారో లో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యకేంద్ర సిబ్బంది బోదకాలు నివారణలో భాగంగా చేపట్టిన సామూహిక మందుల పంపిణీ కార్యక్రమం
2021 మార్చి 20 నాటికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పోర్టల్ ప్రకారం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల వినియోగం పరిస్థితి ఇలా ఉంది:
క్రమ సంఖ్య
|
రాష్ట్రం
|
21.3.2021 నాటికి పనిచేస్తున్న ఆరోగ్యకేంద్రాలు
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
80
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
3411
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
211
|
4
|
అస్సాం
|
2212
|
5
|
బీహార్
|
1738
|
6
|
చండీగఢ్
|
28
|
7
|
చత్తీస్ గఢ్
|
2661
|
8
|
దాద్రా-నాగర్ హవేలి
|
60
|
9
|
డామన్, డయ్యూ
|
30
|
10
|
గోవా
|
102
|
11
|
గుజరాత్
|
5097
|
12
|
హర్యానా
|
725
|
13
|
హిమాచల్ ప్రదేశ్
|
741
|
14
|
జమ్మూ-కశ్మీర్
|
1114
|
15
|
జార్ఖండ్
|
1462
|
16
|
కర్నాటక
|
5838
|
17
|
కేరళ
|
2318
|
18
|
లద్దాఖ్
|
89
|
19
|
లక్షదీవులు
|
3
|
20
|
మధ్యప్రదేశ్
|
6146
|
21
|
మహారాష్ట్ర
|
8603
|
22
|
మణిపూర్
|
180
|
23
|
మేఘాలయ
|
248
|
24
|
మిజోరం
|
139
|
25
|
నాగాలాండ్
|
218
|
26
|
ఒడిశా
|
1629
|
27
|
పుదుచ్చేరి
|
119
|
28
|
పంజాబ్
|
2550
|
29
|
రాజస్థాన్
|
2482
|
30
|
సిక్కిం
|
62
|
31
|
తమిళనాడు
|
4286
|
32
|
తెలంగాణ
|
1577
|
33
|
త్రిపుర
|
291
|
34
|
ఉత్తరప్రదేశ్
|
8223
|
35
|
ఉత్తరాఖండ్
|
661
|
36
|
పశ్చిమ బెంగాల్
|
4681
|
మొత్తం
|
70015
|
*- ఢిల్లీ ఈ పథకాన్ని అమలు చేయటం లేదు.
****
(Release ID: 1706504)
Visitor Counter : 260