ఆర్థిక మంత్రిత్వ శాఖ

మార్చి నెల‌లో జీఎస్టీ బ‌కాయిల‌ను చెల్లించేందుకు ప‌న్ను చెల్లింపుదారులు వారి క్రెడిట్ లెడ్జ‌ర్‌లో అందుబాటులో ఉన్న‌ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ను చ‌ట్ట ప‌రిమితికి లోబ‌డి స్వేచ్ఛ‌గా ఉప‌యోగించుకోవ‌చ్చు

Posted On: 21 MAR 2021 11:58AM by PIB Hyderabad

పూర్తి కావ‌స్తున్న ఆర్థిక సంవ‌త్స‌రానికి త‌మ ల‌క్ష్యాల‌ను సాధించేందుకు కొంతమంది జీఎస్టీ అధికారులుఅన‌ధికార స‌మాచార మార్గాలైన  ఫోన్ కాల్స్, వాట్సాప్ , పన్ను చెల్లింపుదారులను 'నగదుస‌రూపంలో ' గరిష్ట పన్ను చెల్లించ‌మంటూ సందేశాలు వంటి  ఉపయోగిస్తున్నారని ధృవీకరించని నివేదికలు కొన్ని మీడియాల‌లో  రావ‌డం జ‌రిగింది.
అయితే, అటు ప్ర‌భుత్వం కానీ ఇటు సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ క‌స్ట‌మ్స్ (సిబిఐసి) కానీ క్షేత్ర స్థాయిలోని అధికారుల‌కు అటువంటి ఆదేశాలు జారీ చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నాం. ఆర్థిక సంవ‌త్స‌రంలో చివ‌రి నెల అయిన మార్చ‌, 2021లో త‌మ జిఎస్టీ బ‌కాయిల‌ను చెల్లించవ‌ల‌సిన ప‌న్ను చెల్లింపుదారులు వారి క్రెడిట్ లెడ్జ‌ర్‌లో అందుబాటులో ఉన్న ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ను చ‌ట్టం అనుమ‌తించిన మేర‌కు  స్వేచ్ఛ‌గా ఉప‌యోగించుకోవ‌చ్చు. 

***


(Release ID: 1706499) Visitor Counter : 143