జల శక్తి మంత్రిత్వ శాఖ

‘జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రెయిన్’ ప్రచార ఉద్యమాన్ని ఈ నెల 22న ప్రారంభించనున్న ప్ర‌ధాన మంత్రి


కేన్ బెట్వా లింక్ ప్రాజెక్టు కై చరిత్రాత్మక ఎమ్ఒఎ పై జరుగనున్న సంతకాలు

నీటి సంరక్షణ కోసం ‘జల శపథా’న్ని స్వీకరించనున్న గ్రామ సభ లు

Posted On: 21 MAR 2021 1:16PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రపంచ జల దినం అయిన ఈ నెల 22 న మధ్యాహ్నం 12 గంటల ముప్ఫై నిమిషాల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ‘జల శక్తి అభియాన్: క్యాచ్ ద రెయిన్’ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి సమక్షం లో, కేన్ బెట్ వా లింక్ ప్రాజెక్టు అమలు కోసం ఉద్దేశించిన చరిత్రాత్మకమైనటువంటి ఒక ఒప్పంద పత్రం పై కేంద్ర జల శక్తి శాఖ మంత్రి, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానానికి తలపెట్టిన జాతీయ దృష్టికోణ ప్రణాళిక లో ఒకటో ప్రాజెక్టు గా ఉంది.

‘జల శక్తి అభియాన్: క్యాచ్ ద రెయిన్’ ను గురించిన వివరాలు


ఈ ప్రచార ఉద్యమాన్ని వాన నీటి ని ‘‘వర్షం ఎక్కడ కురిసినప్పటికీ, ఎప్పుడు కురిసినప్పటికీ వర్షపు నీటి ని ఒడిసి పట్టండి’’ అనే ఇతివృత్తం తో దేశం అంతటా గ్రామీణ ప్రాంతాల లో,  పట్టణ ప్రాంతాల లో చేపట్టనున్నారు.  ఈ ప్రచార ఉద్యమాన్ని 2021 మార్చి నెల 22వ తేదీ నాటి నుంచి అదే సంవత్సరం లో నవంబర్ 30వ తేదీ వరకు అంటే వాన కాలం ముందు నుంచి వానకాలం ముగిసే వరకు అమలుచేయనున్నారు.  దీనిని జల సంరక్షణ ను ప్రజల భాగస్వామ్యం తో కూకటివేళ్ల స్థాయి వరకు తీసుకుపోవడం కోసం ఒక ప్రజా ఆందోళన వలె మొదలుపెట్టబోతున్నారు.  వాన నీటి ని సరి అయిన పద్ధతి లో నిలవ చేయడానికి ఉద్దేశించిన వాన నీటి ఇంకుడు గుంతల నిర్మాణాల ను ఏర్పాటు చేసే విధం గా అన్ని వర్గాల వారిని ప్రోత్సహించడానికి ఈ ప్రచార ఉద్యమాన్ని నిర్వహించాలని సంకల్పించడమైంది.


ఈ కార్యక్రమం అనంతరం, నీటి ని గురించి, నీటి ని సంరక్షించడం గురించిన అంశాలను చర్చించడం కోసం ప్రతి జిల్లా లోని అన్ని గ్రామ పంచాయతీల లోనూ (ఎన్నికలు జరగవలసివున్న రాష్ట్రాలు మినహాయించి) గ్రామ సభల ను జరుపుతారు.  గ్రామ సభ లు కూడా నీటి ని సంరక్షించడం కోసం ‘జల శపథా’న్ని స్వీకరించనున్నాయి.
 

కేన్ బెట్ వా లింకు ప్రాజెక్టు కై ఉద్దేశించిన ఎమ్ఒఎ ను గురించి

ఈ ఒప్పందం పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ దర్శనాన్ని అమలుపరచేందుకు అంతర్ రాష్ట్ర సహకారానికి నాంది పలుకనుంది.   నదుల ను ఒక దానితో మరొకటి ని ముడిపెట్టడం ద్వారా నీటి ని ఆ వనరు మిగులు గా ఉన్న ప్రాంతాల నుంచి నీటి ఎద్దడి బారిన పడ్డ ప్రాంతాల తో పాటు నీటి కొరత తో సతమతం అవుతున్న ప్రాంతాలకు తీసుకు పోవాలన్నదే శ్రీ వాజ్ పేయీ దృష్టికోణం.  ఈ ప్రాజెక్టు  లో భాగం గా కేన్ నది నుంచి నీటి ని బేట్ వా నది కి బదలాయించడం జరుగుతుంది. ఇందుకోసం దౌధాన్ ఆనకట్ట ను నిర్మించడం తో పాటు రెండు నదుల ను కలుపుతూ ఒక కాలువ ను, దిగువ ఆర్ ప్రాజెక్టు ను, కోతా బరాజు ను, బినా కాంప్లెక్స్ బహుళార్థ సాధక ప్రాజెక్టు ను నిర్మించడం జరుగుతుంది.  ఇది ప్రతి సంవత్సరం లో 10.62 లక్షల హేక్టేయర్ ల భూమి కి సాగు నీటి ని, దాదాపు గా 62 లక్షల మంది కి తాగే నీటి ని అందించడమే కాక, 103 మెగా వాట్ జల విద్యుత్తు ను కూడా ఉత్పత్తి చేయగలుగుతుంది.

ఈ ప్రాజెక్టు నీటి కోసం తపిస్తున్న మధ్య ప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతానికి, ప్రత్యేకించి పన్నా, టీకంగఢ్, ఛత్తర్ పుర్, సాగర్, దమోహ్, దతియా, విదిశ, శిప్ పురి , రాయ్ సేన్ జిల్లాల కు, ఉత్తర్ ప్రదేశ్ లోని బందా, మహోబ, ఝాంసీ, లలిత్ పుర్ జిల్లా లకు గొప్ప ప్రయోజనకారి కాగలదు.  ఇది దేశ ప్రగతి కి నీటి కొరత అనేది ఒక అడ్డంకి గా నిలువకుండా చూడటానికి గాను మరిన్ని నదుల ను ఒకదాని తో మరొకటి ని కలిపేందుకు మార్గాన్ని సుగమం చేయనుంది.


 

***



(Release ID: 1706489) Visitor Counter : 227