ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ మహమ్మారి సంక్షోభంలో 80రెడ్ క్రాస్

రక్తకేంద్రాల సేవలు అమోఘం: హర్షవర్ధన్

రెడ్ క్రాస్ సొసైటీ ప్రధానకేంద్రంలో ఎన్.ఎ.టి. సదుపాయాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి
“రక్తదానం చేస్తే పుణ్యక్షేత్రాలు, తీర్ధాలను సందర్శించినంత పుణ్యం”

Posted On: 20 MAR 2021 2:18PM by PIB Hyderabad

రక్త మార్పిడి ద్వారా వ్యాధులు సంక్రమించకుండా నివారించేందుకు ఉపయోగడే న్యూక్లియిక్ ఆసిడ్ టెస్టింగ్ (ఎన్.ఎ.టి.) సదుపాయం భారతీయ రెడ్ క్రాస్ సొసైటీ ప్రధాన కార్యాలయంలోని రక్తనిధి కేంద్రంలో ప్రారంభమైంది. కేంద్ర   ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ హర్షవర్ధన్ సదుపాయాన్ని ప్రారంభించారు. రక్తదాన శిబిరాలను నిర్వహించడానికి, రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రానికి రక్తం యూనిట్లను చేర్చడానికి ఉపయోగించే రెండు రక్త సేకరణ వ్యాన్లతో సహా పూర్తిగా సదుపాయాలతో కూడిన మూడు వాహనాలను కేంద్రమంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. భారతీయ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రెటరీ జనరల్ ఆర్.కె. జైన్, తలసేమిక్స్ ఇండియా సంస్థ అధ్యక్షుడు దీపక్ చోప్రా, ఈ రెండు సంస్థల సీనియర్ కార్యనిర్వహక సభ్యులు, ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

https://ci5.googleusercontent.com/proxy/d2zoojwfMxfZVa9WmNE25iYOHudDyHs8OF-hMPlzbKLaGw9L3rJTEwpmNZfiiG9mzw_FGOxUY9wf4S-9HxUNcoFOtoYvvUeosUC9vMohxTAeb8HS5X6mJhFF4A=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001MPC5.jpg

  ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ,..కోవిడ్ మహమ్మారి వ్యాపిస్తున్న తీవ్ర సంక్షోభ సమయంలో కూడా రక్తదాన శిబిరాలను నిర్వహించడంలో 80 భారతీయ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రాలు గణనీయమైన పాత్ర పోషించడం, నిరాటంకంగా రక్తాన్ని సేకరించడం ఎంతో అభినందనీయమని అన్నారు. క్లిష్ట సమయాల్లో కూడా రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రాలు తమ కృషిని కొనసాగిస్తూనే వచ్చాయని, పలు నివాస ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహించాయని, రెడ్ క్రాస్ రక్తకేంద్రాల్లో రక్తదానం అందించేందుక వచ్చే దాతలకు రవాణా సదుపాయాలు కూడా కల్పించాయని డాక్టర్ హర్షవర్ధన్ ప్రశంసించారు.

https://ci4.googleusercontent.com/proxy/oIkZSbXLwjvF96hc6y4QSGsgt9zTGo6o0no0k2dcM9QJ9rko2KJLjAHmNkbqzax83viZwcnn2BOZjkOo8Qr55LwrHy2hWwl0xgQHYpWri_rD5rL0ljhffJ3hpA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002CQB6.jpg

  రక్తమార్పిడిలో వ్యాధుల సంక్రమణను పసిగట్టేందుకు మామూలుగా ఉపయోగించే ఎలిసా (ఇ.ఎల్.ఐ.ఎస్.ఎ.) పరీక్షకు బదులు ఎన్.ఎ.టి. పరీక్షా సదుపాయాన్ని ప్రవేశపెట్టడం ఎంతో ప్రయోజనకరమన్నారు. ఈ సదుపాయంతో హెచ్.ఐ.వి., హెపటైటిస్-బి, హెపటైటిస్-సి, వంటి వ్యాధుల సంక్రమించే అవకాశాలను గణనీయంగా తగ్గించేందుకు ఈ సదుపాయం దొహదపడిందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అన్నారు. అలాగే, స్వచ్ఛంద రక్తదానాన్ని పెంచేందుకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలోని రక్తదాన వాహనాలు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

https://ci6.googleusercontent.com/proxy/dDp1OSd6MIy9BNbc8F0PyujJR07YSRk8OknaKdTK-iRxn4e608Ik2hHMzD9d_S7yzMjbG6FKkLIGnSoXipvqybjoLHZgOR1r1k50TVeMJrVOhf6vKfbehzpc3Q=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003FGGN.jpghttps://ci5.googleusercontent.com/proxy/NTt3ZYpFvp0UerlVBCmJfh4nP68v6-aImeJfzblyvzA1BOoI3fQZO6Owkxo-BPlKYE8XlArib6pnAiuqWe19Q6RDJtoSzJDnWCM94dLGejDA8Ju3M5VPNVv7CA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004W4UE.png

  ఇలాంటి కొత్త సదుపాయాలు ప్రారంభం కావడం ప్రశంసనీయమని, ఈ తరహాలో అధునాతన సాంకేతిక వసతులు కల్పించాలన్న ఆలోచన కూడా ఎంతో అభినందనీయమని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. “సంపూర్ణ స్థాయి ఆరోగ్య రక్షణకు ఈ ఏడాది బడ్జెట్ లో  నిధుల కేటాయింపు 137శాతం పెరగడం ఆరోగ్య రంగంపట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. మేం కొత్తగా 22 అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థలను (ఎయిమ్స్.లను), 127 వైద్య కళాశాలలను ప్రారంభించాం. దీనితో 2014వ సంవత్సరంలో 50వేలుగా ఉన్న ఎం.బి.బి.ఎస్. సీట్లు ఇపుడు దాదాపు 80వేలకు పెరిగాయి, వైద్యవిద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు (పి.జి.సీట్లు) 24వేలకు పైగా పెరిగాయి.” అని ఆయన అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు ఆరోగ్య రక్షణను అదించడంలో ఆయుష్మాన్ భారత్, జాతీయ ఆరోగ్య కార్యక్రమం సాధించిన విజయాలను ఆయన వివరించారు. జన్యుసంబంధమైన తలసేమియా వ్యాధి నివారణకోసం చేపట్టిన ‘తలసేమియా బాల సేవా యోజన’ పథకం కోసం జతీయ ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థిక సహాయం అందించిన అంశాన్ని కేంద్రమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 

 

    ఆధునిక ఆరోగ్య రక్షణ వ్యవస్థలో రక్తమార్పిడి ప్రక్రియ ఎంతో ఆవశ్యకమైదన్నారు.  “అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి వెయ్యిమందిలో ఏడాదికి 50మందివరకూ రక్తదానం చేస్తారు. మనదేశంలో ప్రతి వెయ్యిమందిలో ఏడాదికి 8-10 మంది మాత్రమే రక్తదానం చేస్తారు.  భారీ స్థాయిలో 138కోట్ల జనాభా కలిగిన భారతదేశం అవసరాలకు సంవత్సరానికి కేవలం కోటీ 40లక్షల యూనిట్ల రక్తం సరిపోతుంది. అంటే,.. అర్హులైన మొత్తం జనాభాలో ఒకశాతం జనాభా ప్రతి ఏడాది రక్తదానం చేసినా మనకు రక్తానికి కొరత అనేదే ఉండదు.” అని ఆయన అన్నారు. క్రమంతప్పని, సురక్షితమైన రక్త సరఫరా లక్ష్యంకోసం వందశాతం స్వచ్ఛంద రక్తదాన సేకరణ అన్న ధ్యేయం ఇంకా  మనం సాధించలేదని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. “పటిష్టమైన రక్తదాన సంఘాలు కలిగిన దేశాలు రక్తదాతలకు తగిన ఏర్పాట్లు చేయగలుగుతున్నాయి. రక్తమార్పిడి ప్రక్రియ అన్నది సేకరణ, ప్రాసెసింగ్, వినియోగం వంటి అంశాల్లో విభిన్నమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నది. శాస్త్రీయ ప్రాతిపదిక కలిగినది. అయితే, క్రమం తప్పకుండా రక్తదానం చేసే వారిపైనే ఈ వ్యవస్థ ఆధారపడి ఉంది. మరెన్నో కానుకలకంటే రక్తదానం ఎంతో విలువైనది. జీవితంలోనే ఇది విశిష్టమైన కానుక. ” అని మంత్రి అన్నారు.

   చాలా మంది ప్రజలు ముఖ్యమైన పలు సందర్భాల్లో ఎన్నో పుణ్య క్షేత్రాలను సందర్శిస్తూ ఉంటారని, ఇలాంటి పుణ్యక్షేత్రాల, పుణ్యతీర్ధాల సందర్శనకున్న పవిత్రత రక్తదానానికి కూడా ఉంటుందని కేంద్రమంత్రి అన్నారు. “క్రమం తప్పకుండా రక్తకదానం చేయడం ద్వారా స్థూలకాయం తత్సంధమైన పలు వ్యాధులను నివారించుకోవచ్చు.” అని ఆయన అన్నారు. పిల్లలకు తలసేమియా పరీక్షను పెళ్లికి ముందస్తుగా జరిపించుకోవడం చాలా అవసరమని, జన్మకుండలి, జాతకాలు, జన్మనక్షత్రాల కలియక కంటే, రక్తకుండలుల కలయికను పరీక్షించుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. నిన్న లోక్ సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తున్నపుడు కూడా ఆయన ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.

  సురక్షితమైన రక్తానికి ఉన్న గిరాకీకి, రక్తం లభ్యతకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని ఆయన చెప్పారు. స్వచ్ఛంద రక్తదానం అనే అంశంపై సాధారణ ప్రజలకు తగిన అవగాహనను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. “క్రమంతప్పకుండా రక్తదానం చేయడంవల్ల సమకూరే ప్రయోజనాలను గురించి సమాజానికి అవగాహన కలిగించేలా విద్యాబోధనా కార్యక్రమం ఉండాలి. విద్యాసంస్థలు, పారిశ్రామిక సంస్థలు, సామాజిక, సాంస్కృతిక సంస్థలు, మతసంస్థలు, ప్రభుత్వసంస్థలు వంటివి లక్ష్యంగా ఇలాంటి విద్యాబోధనా కార్యక్రమం ఉండాలి. స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని పెంచేలా అందుకు ప్రజలకు తగిన అవగాహన కల్పించేలా సామాజిక మాధ్యమాలను పటిష్టంగా వినియోగించువాలి.” అని కేంద్రమంత్రి అన్నారు.

 

*****



(Release ID: 1706483) Visitor Counter : 140


Read this release in: English , Urdu , Hindi , Marathi