రైల్వే మంత్రిత్వ శాఖ

తొలి ఎసి త్రీటైర్ ఎకాన‌మీ క్లాస్ కోచ్ ను ఆవిష్క‌రించిన భార‌తీయ రైల్వేలు కోచ్‌ల ట్ర‌య‌ల్ విజ‌య‌వంతంగా పూర్తి

ఈ కోచ్ ల‌న్నీ కూడా 83 బెర్త్ ల సామ‌ర్ధ్యాన్ని క‌లిగి ఉంటాయి

అవ‌స‌ర‌మైన అనుమ‌తులు వ‌చ్చిన త‌ర్వాత ఎల్‌హెచ్‌బి కోచ్‌ల‌తో న‌డిచే (రాజ‌ధాని, శ‌తాబ్ది, దురంతో వంటి ప్ర‌త్యేక ర‌కం రైళ్ళు మిన‌హా) అన్ని మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో ఎల్‌హెచ్‌బి ఎకాన‌మీ క్లాస్ కోచ్‌ల‌ను ప్ర‌వేశ‌పెడ‌తారు

Posted On: 20 MAR 2021 2:06PM by PIB Hyderabad

 భారత రైల్వే ప్రొడక్షన్ యూనిట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తాలా ఇటీవల ఇండియన్ రైల్వే (ఐఆర్) తొలి  లింకే హాఫ్మన్ బుష్ (ఎల్ హెచ్ బి) ఎసి త్రీ-టైర్ ఎకానమీ క్లాస్ కోచ్ న‌మూనాను విడుదల చేసింది. దీనికి సంబంధించిన ట్ర‌య‌ల్ విజ‌య‌వంతంగా పూర్తి అయింది. 
ఇది ఎల్ హెచ్ బి ఎసి త్రీ టైర్ కోచ్ నూత‌న భిన్నర‌కం. దీనిలో ఉన్న ప్ర‌త్యేక‌త‌ల‌ను దిగువ‌న ఇవ్వ‌డం జ‌రిగింది ః- 
 ప్యాసెంజ‌ర్ డెక్‌పై న‌డ‌వ‌న‌వ‌స‌రం లేకుండా విద్యుత్ ప్యానెళ్ళు ఉంచ‌డం ద్వారా ప్యాసెంజ‌ర్ల ఉప‌యోగం కోసం అద‌న‌పు చోటు క‌ల్పించ‌డం
సుమారు 83 బెర్త్ ల మేర‌కు ప్యాసెంజ‌ర్ సామ‌ర్ధ్యం పెంపు 
దివ్యాంగుల‌కు చ‌క్రాల కుర్చీలను అందుబాటులో ఉంచ‌డంతో పాటు వారికి ప్ర‌త్యేక కంపార్ట్ మెంటు, వారికి ప్ర‌త్యేక ద్వారంతో పాటుగా సుగ‌మ్య భార‌త్ అభియాన్ నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి చ‌క్రాల కుర్చీ అందుబాటుతో దివ్యాంగుల‌కు అనుకూల‌మైన టాయిలెట్ల ఏర్పాటు.
అన్ని బెర్తుల‌కు వెంట్ ను ఏర్పాటు చేయ‌డం ద్వారా ఎసి సౌక‌ర్యం .
ప్ర‌యాణీకుల‌కు మ‌రింత సౌక‌ర్యాన్ని ఇవ్వ‌డం కోసం, త‌క్కువ బ‌రువు, అధిక నిర్వ‌హ‌ణ‌కు అవ‌కాశం ఉన్న సీట్లు, బెర్తుల నిర్మాణ న‌మూనా
ప్ర‌యాణీకుల‌కు మెరుగైన సౌక‌ర్యాన్ని అందించేందుకు నిలువు, అడ్డం బెర్తుల‌కు మ‌డ‌వ‌గ‌ల స్నాక్ టేబుళ్ళ ఏర్పాటు, దెబ్బ‌లు త‌గిలే అవ‌కాశం లేని చోటు, మంచి నీటి బాటిళ్ళు, మొబైల్ ఫోన్లు, ప‌త్రిక‌లు పెట్టుకోవ‌డానికి హోల్డ‌ర్లు.
ప్ర‌తి బెర్తుకు చ‌దువుకోవ‌డానికి రీడింగ్ లైట్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు
మ‌ధ్య‌, పై బెర్తుల‌ను ఎక్కేందుకు మెరుగు ప‌రిచిన, స‌మ‌ర్ద‌వంత‌మైన‌ నిచ్చెన న‌మూనా.
మ‌ధ్య‌, పై బెర్తుల‌పై కూర్చున్న‌ప్పుడు త‌ల పైన త‌గ‌ల‌కుండా అద‌న‌పు స్థ‌లం..
భార‌తీయ‌, ప‌శ్చిమ లావెట‌రీల మెరుగైన న‌మూనా
స‌మ‌ర్థ‌వంత‌మైన‌, అంద‌మైన ద్వారం
ప్ర‌కాశించే సీటు గుర్తులు
ప్రకాశించే బెర్త్ సంఖ్యలతో, రాత్రి దీపాలతో సమగ్రమైన ప్రకాశవంతమైన బెర్త్ సూచికలు.
సామాగ్రికి సంబంధించి ప్ర‌పంచ స్థాయి బెంచ్ మార్కు  EN45545-2 HL3కు అనుగుణంగా మెరుగైన అగ్ని మాప‌క ప్రమాణాలు 
అవ‌స‌ర‌మైన అనుమ‌తులు వ‌చ్చిన త‌ర్వాత ఎల్‌హెచ్‌బి కోచ్‌ల‌తో న‌డిచే (రాజ‌ధాని, శ‌తాబ్ది, దురంతో వంటి ప్ర‌త్యేక ర‌కం రైళ్ళు మిన‌హా) అన్ని మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో  ఎల్‌హెచ్‌బి ఎకాన‌మీ క్లాస్ కోచ్‌ల‌ను ప్ర‌వేశ‌పెడ‌తారు. ‌‌

***



(Release ID: 1706358) Visitor Counter : 138