ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
4.2 కోట్ల కోవిడ్ టీకాలతో సరికొత్త మైలురాయి దాటిన భారత్
గత 24 గంటల్లోనే 27 లక్షలకు పైగా కోవిడ్ టీకాలు
మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ లో పెరుగుతున్న కేసులు
Posted On:
20 MAR 2021 11:40AM by PIB Hyderabad
కోవిడ్ మీద పోరులో భారత్ మరో కీలకమైన స్థాయి దాటింది. మొత్తం టీకాల సంఖ్య 4 కోట్ల 20 లక్షలు దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారాన్ని బట్టి 6,86,469 శిబిరాల ద్వారా 4,20,63,392 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో
77,06,839 డోసులు మొదటి విడత ఆరోగ్య సిబ్బందికి, 48,04,285 డోసులు రెండో విడత ఆరోగ్య సిబ్బందికి, 79,57,606 డోసులు మొదటి విడత కోవిడ్ యోధులకు, 24,17,077 డోసులు రెండో విడత కోవిడ్ యోధులకు ఇవ్వగా 32,23,612 మంది లబ్ధిదారులు 45 ఏళ్ళు పైబడి వివిధ దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారు, 1,59,53,973 మంది 60 ఏళ్ళు పైబడ్డవారు ఉన్నారు.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45 - 60 ఏళ్ళ మధ్య దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
77,06,839
|
48,04,285
|
79,57,606
|
24,17,077
|
32,23,612
|
1,59,53,973
|
4,20,63,392
|
టీకాల కార్యక్రమం మొదలైన 63వ రోజైన మార్చి 19 నాడు 27,23,575 టీకా డోసుల పంపిణీ జరిగింది. మొత్తం 24,15,800 మందికి 38,989 శిబిరాలద్వారా మొదటి డోస్ టీకాలివ్వగా 3,07,775 మంది ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు రెండో విడత టీకాలందుకున్నారు.
Date: 19th March,2021
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45 - 60 ఏళ్ళ మధ్య దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
71,651
|
89,112
|
1,24,328
|
2,18,663
|
4,43,614
|
17,76,207
|
24,15,800
|
3,07,775
|
2021 మార్చి 18 నాటికి దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 3కోట్ల 93 లక్షల 40 వేలు. దీనివల్ల భారతదేశం టీకాలలో అమెరికా తరుయ్వాత రెండో స్థానంలో నిలిచింది.
క్రింద చూపిన రాష్ట్రాలు రెండో డోస్ లో 68% వాటా దక్కించుకున్నాయి.
గత 24 గంటలలో ఇచ్చిన 27.23 లక్షల టీకా డోసులలో 80 శాతం వాటా ఈ క్రిందపేర్కొన్న 10 రాష్ట్రాలదే
కోవిడ్ తాజా పరిస్థితి చూస్తే మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కేసుల పెరుగుదల కనబడుతోంది.
గత 24 గంటలలో 40,953 కొత్త కేసులు రాగా అందులో 83.7% ఆరు రాష్ట్రాలలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా
25,681 కేసులు, అ తరువాత పంజాబ్ లో 2,470, కేరళలో 1,984 కేసులు వచ్చాయి.
రోజు వారీ కేసుల పెరుగుదల మొత్తం ఎనిమిది రాష్ట్రాలలో కనబడుతోంది. అవి: మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్నాటక, హర్యానా. కేరళలో కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.
దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కేసులు ఈ రోజుకు 2,88,394 కు చేరుకోగా, ఇవి మొత్తం కేసుల్లో 2.50%. గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారు నికరంగా 17,112 మంది తగ్గారు. చికిత్సలో ఉన్నవారిలో 76.22% మంది మహారాష్ట్ర, కేరళ, పంజాబ్ వారే.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 1,11,07,332 కాగా, జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 96.12%. గత 24 గంటలలో 23,653 మంది కోలుకోగా 188 మంది మరణించారు. ఈ మరణాలలో 81.38% వాటా ఐదు రాష్ట్రాలది కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 70 మంది, ఆ తరువాత పంజాబ్ లో 38 మంది, కేరళలో 17 మంది చనిపోయారు.
గత 24 గంటలలో పదిహేను రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: అస్సాం, ఉత్తరాఖండ్, ఒడిశా, పుదుచ్చేరి, లక్షదీవులు, సిక్కిం, లద్దాఖ్, మణిపూర్, డాద్రా-నాగర్ హవేలి, డామన్-డయ్యూ, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్.
***
(Release ID: 1706247)
Visitor Counter : 177