ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని కలిసిన - అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ జేమ్స్ ఆస్టిన్-III

Posted On: 19 MAR 2021 8:08PM by PIB Hyderabad
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న, అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ జేమ్స్ ఆస్టిన్ III, ఈ ఉదయం, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని కలిశారు.

కార్యదర్శి ఆస్టిన్, ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బిడెన్ తరఫున ప్రధానమంత్రి మోదీ కి శుభాకాంక్షలు తెలియజేశారు. 

ప్రజాస్వామ్యం, బహుత్వ వాదం, నియమాల ఆధారిత క్రమం పట్ల నిబద్ధతతో కూడిన భాగస్వామ్య విలువలతో మమేకమై, ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఆహ్లాదకరమైన, సన్నిహిత సంబంధాన్ని ప్రధానమంత్రి, ఈ సందర్భంగా స్వాగతించారు.

ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం తన దృష్టిని వివరించిన ప్రధానమంత్రి, భారత-అమెరికా సంబంధాలలో ద్వైపాక్షిక రక్షణ సహకారం నిర్వహిస్తున్న ముఖ్యమైన పాత్రను నొక్కి చెప్పారు.  అధ్యక్షుడు బైడెన్ ‌కు తన శుభాకాంక్షలు తెలియజేయాలని ప్రధానమంత్రి, కార్యదర్శి ఆస్టిన్ ‌ను కోరారు. 

కార్యదర్శి ఆస్టిన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను బలోపేతం చేయడానికి అమెరికా ప్రభుత్వ నిరంతర నిబద్ధతను పునరుద్ఘాటించారు.  ఇండో-పసిఫిక్ ప్రాంతంలోనూ, వెలుపల,  శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలన్న అమెరికా బలమైన కోరికను ఆయన వ్యక్తం చేశారు.

*****



(Release ID: 1706224) Visitor Counter : 195