భారత ఎన్నికల సంఘం
పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్ధించిన మద్రాసు హైకోర్టు
Posted On:
18 MAR 2021 12:51PM by PIB Hyderabad
80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, కోవిడ్-19 బాధిత / అనుమానితులు మరియు అత్యవసర విధులను నిర్వర్తిస్తూ స్వయంగా ఓటు వేయలేని వ్యక్తులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశాన్ని కల్పిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని మద్రాసు హైకోర్టు సమర్ధించింది. ప్రజా ప్రాతినిధ్యం చట్టం సెక్షన్ 60 (సి) కింద స్వయంగా వెళ్లి ఓటు ఓటు వేయలేని స్థితిలో వున్న 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, కోవిడ్-19 బాధిత / అనుమానితులు మరియు అత్యవసర విధులను నిర్వర్తిస్తున్న వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్(2020 లో రిట్ పిటిషన్ నెంబర్ . 20027)ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ కొట్టివేసింది.
హైకోర్టు తన తీర్పులో ఇలా వ్యాఖ్యానించింది.
“56. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించని పక్షంలో తమ ఓటు హక్కును వినియోగించుకోలేక ప్రజాస్వామ్య వ్యవస్థకు దూరంగా వుండవలసి వచ్చే కొన్ని వర్గాలకు చెందిన వారికి ప్రక్రియలో పాత్ర కల్పించడానికి మాత్రమే ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని తీసుకున్నదని అంగీకరించవలసి ఉంటుంది. ఎస్. రఘుబీర్ సింగ్ గిల్ కేసులో ఇచ్చిన తీర్పును ఇక్కడ ప్రస్తావించవలసి ఉంటుంది. ఎన్నికలు స్వేచ్ఛగా సాగే అంశాన్ని బలోపేతం చేయడానికి పోస్టల్ బ్యాలెట్ ఉపయోగపడుతుంది. పోస్టల్ బ్యాలెట్ గోప్యత మరియు ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించే అంశంలో రాజీ పడకుండా వ్యవస్థకు పరిపూర్ణతను తీసుకునిరావడానికి మానవతా దృక్పధంతో తీసుకున్న నిర్ణయాలను సమర్ధించవలసి ఉంటుంది' అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.
1961 నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అవకాశం కల్పించిన వ్యక్తుల విషయంలో ఎలాంటి వివాదం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
“60. 1961 నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అనుమతించబడిన వ్యక్తుల వర్గీకరణలో ఎటువంటి వివాదం కనిపించడం లేదు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వ్యక్తిగతంగా వెళ్లే అవకాశం లేని ఆమె/అతనికి మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించినట్టు వుంది. ఈ ప్రాతిపదికపై మాత్రమే నిర్ణయాన్ని తీసుకుని ఉంటే 2019 మరియు 2020 సవరణల ద్వారా గుర్తించబడిన తరగతులకు సంబంధించి ఎటువంటి వివక్ష లేదని భావించవలసి ఉంటుంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే తమ ప్రాథమిక హక్కునువినియోగించుకోవడానికి ఈ అవకాశాన్ని కల్పించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది' అని హైకోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది.
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని హైకోర్టు పేర్కొంది.
“62. ఎన్నికల కమిషన్‌కు మార్గదర్శకాలను జారీ చేయడానికి అధికార పరిధి లేదన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తిరస్కరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ద్వారా కమిషన్‌కు అధికారాలు సంక్రమించినందున ఈ వాదనను విస్మరించాలి. ఇంతేకాకుండా పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు లేదా ఆ చట్టాల కింద జారీ అయిన ఉత్తర్వులు అమలులో లేనప్పుడు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉందంటూ సుప్రీంకోర్టు ఎ. సి. జోస్ కేసులో సుప్రీంకోర్టు గుర్తించింది. ఆర్టికల్ 324 ప్రకారం పర్యవేక్షణ, నియంత్రణ మరియు నిర్వహణకు సంబంధించి ప్రత్యేక చర్యలు అవసరమని పేర్కొనక పోవడంతో కమిషన్ కు ఈ అధికారం ఉందని భావించవలసి ఉంటుంది. ఇంతేకాకుండా ఎన్నికల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసే అధికారం ఎన్నికల కమిషన్ కు ఉందని ఈ తీర్పులో సుప్రీంకోర్టు గుర్తించింది' అని హైకోర్టు తీర్పులో పేర్కొన్నారు.
2019 జార్ఖండ్ ఎన్నికల నుంచి కమిషన్ కొన్ని వర్గాలకు ఐచ్ఛిక పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ప్రారంభించింది. 2020లో జరిగిన బీహార్ సాధారణ ఎన్నికలలోపోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని మరికొన్ని తరగతులకు విస్తారించారు. ఈ సౌకర్యాన్ని 52,000 మందికి పైగా ఓటర్లు ఉపయోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియ మరింత విస్తృతంగా సాగాలన్న లక్ష్యంతో తాజాగా జరుగుతున్న ఎన్నికలు మరియు ఉప ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ అంశంపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విడుదల చేసింది. ' ఏ ఒక్క ఓటరు తన హక్కును కోల్పోకూడదు' అన్న నినాదంతో సంఘం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
80 సంవత్సరాల వయస్సు పైబడినవారు లేదా పిడబ్ల్యుడి ఓటర్లు మరియు కదలడానికి సమస్య ఉన్నవారు మరియు అంగవైకల్యం వల్ల పోలింగ్ కేంద్రానికి రాలేనివారికి ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును కల్పించాలన్న స్పూర్తితో ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. దీనివల్ల ఈ తరగతుల కిందకి వచ్చే అనేక మందికి ప్రయోజనం కలుగుతుంది. పిడబ్ల్యుడి ఓటర్లకు, సీనియర్ సిటిజన్లకు పోలింగ్ కేంద్రాలకు రావడానికి కమిషన్ ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది.
***
(Release ID: 1705818)
Visitor Counter : 167