ప్రధాన మంత్రి కార్యాలయం
కొవిడ్-19 స్థితి పై ముఖ్యమంత్రుల తో సమావేశమైన ప్రధాన మంత్రి
టీకా ఇచ్చే కేంద్రాల సంఖ్య ను పెంచి, ఆర్‌టి-పిసిఆర్ పరీక్షలను అధికం చేయండి: ప్రధాన మంత్రి
వ్యాక్సిన్ డోసులు నష్టం కాకుండా చూడాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు
మైక్రో కన్ టేన్‌మెంట్ జోన్ లు, ‘టెస్ట్, ట్రాక్ ఎండ్ ట్రీట్’ లు ముఖ్యమని సూచించారు.
Posted On:
17 MAR 2021 3:32PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోవిడ్-19 స్థితి ని గురించి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు.
కోవిడ్ పై యుద్ధం చేయడం లో ప్రధాన మంత్రి అందిస్తున్న నాయకత్వాన్ని ముఖ్యమంత్రులు కొనియాడారు. దేశవ్యాప్తం గా టీకా ఇప్పించే కార్యక్రమం సాఫీ గా అమలవుతున్నందుకు ప్రధాన మంత్రి కి వారు ధన్యవాదాలు తెలిపారు. టీకామందును ఇప్పించే కార్యక్రమాన్ని మరింత విస్తరించడం కోసం వారు తమ తమ సూచన లను, సలహాల ను కూడా అందించారు.
కొన్ని రాష్ట్రాల లో కేసుల సంఖ్య ఇటీవల పెరుగుతూ ఉన్న నేపథ్యం లో, కోవిడ్ పరంగా సాధారణ ప్రజానీకం అనుసరించవలసిన చర్యల విషయం లో ఎదురువుతున్న సవాలు కూడా చర్చకు వచ్చింది. మరింత అధిక నిఘా ను అమలుపరుస్తూ, స్థితి ని పర్యవేక్షించాలని ముఖ్యమంత్రులు అంగీకరించారు.
వైరస్ వ్యాప్తి ని అడ్డుకోవాలంటే ముఖ్యమంత్రులు ప్రత్యేక శ్రద్ధ ను తీసుకోవలసిన జిల్లాల ను గురించి దేశీయ వ్యవహారాల శాఖ మంత్రి సమావేశం లో ప్రస్తావించారు. దేశం లో ప్రస్తుతం కోవిడ్ స్థితి ఎలా ఉన్నదీ, టీకామందు ను ఇప్పించడానికి ఎటువంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నదీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి నివేదించారు.
https://youtu.be/aK79AxBzGas
ప్రధాన మంత్రి ముఖ్యమంత్రుల ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశం లో 96 శాతాని కి పైగా కేసులు నయమయ్యాయని, ప్రపంచం లో కెల్లా మరణాల రేటులు అతి తక్కువ సంఖ్య లో నమోదు అవుతున్న దేశాలలో ఒక దేశం గా భారతదేశం ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్ర లో, మధ్య ప్రదేశ్ లో పాజిటివ్ గా లెక్క తేలుతున్న కేసులు అధికం అవుతుండటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గడచిన కొన్ని వారాల లో దేశం లో 70 జిల్లాల లో 150 శాతాని కి పైగా పెరుగుదల నమోదైంది. కరోనా తాలూకు ‘‘రెండో శిఖరం ’’ రూపుదాల్చడాన్ని వెంటనే ఆపవలసిందంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. పెచ్చుపెరుగుతున్న మహమ్మారిని గనుక మనం ఇప్పుడు ఆపలేకపోయినట్లయితే, అప్పుడు దేశ వ్యాప్తం గా ఈ వ్యాధి ప్రబలుతుంది అంటూ ఆయన హెచ్చరిక ను చేశారు.
కరోనా తాలూకు ఈ ‘‘రెండో శిఖరం’’ రూపుదాల్చకుండా ఆపడానికి గాను తక్షణ చర్యలను, నిర్ణయాత్మకమైనటువంటి చర్యల ను తీసుకోవలసిన అవసరం ఎంతయినా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. మాస్కుల ఉపయోగం పట్ల స్థానిక పరిపాలన లో గంభీరత్వం సన్నగిలుతోందని చెప్తూ, ప్రాంతీయ స్థాయి లో పరిపాలన పరమైన సమస్యల ను శీఘ్రంగా పరిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. కరోనా కు వ్యతిరేకం గా చేసిన సమరం లో మన కార్యసాధన ల నుంచి జనించిన విశ్వాసం కాస్తా నిర్లక్ష్యం గా మారకూడదు అంటూ ఆయన జాగ్రత్త చెప్పారు. ప్రజలను భయం కమ్ముకొనే స్థితి కి తావు ఇవ్వకూడదు, అదే కాలం లో ముప్పు బారి నుంచి వారిని తప్పించాలి కూడాను అని ఆయన సూచించారు. మన ప్రయత్నాలలో మన గత కాలం అనుభవాల ను ఉపయోగించుకొంటూ వ్యూహాత్మకం గా వ్యవహరించవలసిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.
అతి చిన్నవైన కట్టడి చర్య ల మండలాల (మైక్రో కంటేన్ మెంట్ జోన్స్) ను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని గురించి ప్రధాన మంత్రి తన ప్రసంగం లో ప్రస్తావించారు. గత ఏడాది కాలం నుంచి మనం ఇదే పద్ధతి ని అనుసరిస్తూ వచ్చిన విధంగానే పరీక్ష చేసి, జాడ కనుగొని, చికిత్స ను అందించే [ టెస్ట్, ట్రాక్ ఎండ్ ట్రీట్] పద్ధతి పట్ల గంభీరం గా నడుచుకోవాలి అని ఆయన గుర్తు కు తెచ్చారు. ప్రతి ఒక్క బాధితుని తో సన్నిహితం గా మెలగిన వారి ని అతి తక్కువ కాలం లో వెదకడం ఎంతో ముఖ్యం; ఆర్‌టి-పిసిఆర్ టెస్ట్ రేటు ను 70 శాతానికి ఎగువ న ఉంచాలి అని ఆయన చెప్పారు. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల కు అధికం గా మొగ్గు చూపుతున్న కేరళ, ఒడిశా, ఛత్తీస్ గఢ్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల లో మరిన్ని ఆర్‌టి-పిసిఆర్ టెస్టుల ను చేయించాలి అని ఆయన మరీ మరీ చెప్పారు.
చిన్న నగరాల లో ‘‘రిఫరల్ సిస్టమ్’’, ‘‘ఎమ్‌బ్యులెన్స్ నెట్‌వర్క్’’ ల విషయం లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పరీక్షలను పెంచాలని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇలా ఎందుకు చేయాలి అంటే ప్రస్తుతం దేశం అంతటా ప్రయాణాల కు అనుమతించడం జరిగింది, ఈ నేపథ్యం లో ప్రయాణాలు చేస్తున్న వారి సంఖ్య కూడా అధికం అయింది అని ఆయన చెప్పారు. సమాచారాన్ని వెల్లడి చేసుకోవడానికి వారి మధ్య ఒక కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. అదే విధం గా, విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు ఎవరెవరితో భేటీ అయ్యారు అని నిఘా పెట్టడానికి ఎస్ఒపి ని అనుసరించవలసిన తీరు ను సైతం పటిష్ట పరచాలి అని ఆయన అన్నారు.
కరోనా వైరస్ తన రూపు ను ఏ విధంగా మార్చుకొంటున్నదీ, తద్వారా ఏయే ప్రభావాలు చోటుచేసుకొంటున్నదీ మనం గుర్తించవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. దేశం లో వ్యాక్సినేశన్ క్రమం గా జోరు పుంజుకోవడాన్ని, ఒక్క రోజు లోనే 30 లక్షల కు పైగా వ్యాక్సినేశన్ లు నమోదు కావడాన్ని ఆయన ప్రశంసించారు. అయితే, అదే కాలం లో టీకామందు తాలూకు డోసు లు వ్యర్థం అయ్యే సమస్య ను గురించి చాలా గంభీరం గా పట్టించుకోవాలంటూ ఆయన హెచ్చరిక చేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లలో వ్యాక్సీన్ వేస్ట్ దాదాపు గా 10 శాతం మేరకు ఉందని ఆయన ప్రస్తావించారు. వ్యాక్సీన్ నష్టాన్ని తగ్గించడానికి గాను స్థానికం గా ప్రణాళిక పరంగా, పరిపాలన పరంగా లోటుపాటుల ను వెనువెంటనే సరిదిద్దాలని ఆయన కోరారు.
పైన ప్రస్తావించిన చర్యల తో సహా ఈ సంక్రమణ తాలూకు వ్యాప్తి ని అడ్డుకోవడానికి మాస్కుల ను ధరించడం, ఒక మనిషి కి మరొక మనిషి కి మధ్య తగినంత ఎడం పాటించడం, స్వచ్ఛత పరంగా తీసుకోదగిన శ్రద్ధ ను తీసుకోవడం వగైరా మౌలికమైన చర్యల ను తీసుకోవాలని ప్రధాన మంత్రి సూచించారు. అటువంటి చర్యల విషయం లో ఎలాంటి సడలింపు ఉండకూడదని ఆయన కోరారు. ప్రజల లో చైతన్యాన్ని పెంచవలసి ఉందని ఆయన అన్నారు. టీకామందు ను వేయించే కేంద్రాల సంఖ్య ను అధికం చేయాలని, టీకామందు కు నిర్దేశించిన గడువు తేదీ ముగిసిపోయే అంశం పట్ల జాగరూకత తో ఉండాలని ఆయన సూచించారు. ‘‘మందులు వేసుకోవడంతో పాటు కఠినమైన నియమాల పాలన కూడా ముఖ్యం’’ అని ప్రధాన మంత్రి చెప్పారు.
****
(Release ID: 1705557)
Visitor Counter : 284
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam