రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ఆధునిక అభివృద్ధి ప్రక్రియలో అటవీ నివాసులు తమ సాంస్కృతిక వారసత్వం మరియు గుర్తింపు చెక్కు చెదరకుండా మన ప్రయత్నం ఉండాలి: రాష్ట్రపతి కోవింద్

ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రపతి; వనవాసి సమాగం లో పాల్గొని సొన్భద్ర చప్కి లో సేవా కుంజ్ ఆశ్రమ్ కొత్త భవనాన్ని ప్రారంభించారు

Posted On: 14 MAR 2021 5:17PM by PIB Hyderabad

సాంస్కృతిక వారసత్వం, గుర్తింపును చెక్కుచెదరకుండా అటవీ నివాసులు ఆధునిక అభివృద్ధి ప్రక్రియలో ఒక భాగమని ఆ దిశగా మన ప్రయత్నం ఉండాలని భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ అన్నారు. సేవా కుంజ్ ఆశ్రమంలో కొత్తగా నిర్మించిన భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రోజు (మార్చి 14, 2021) ఉత్తర ప్రదేశ్‌లోని చాప్కిలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా భగవాన్ బిర్సా ముండాను గుర్తుచేసుకున్న రాష్ట్రపతి, బ్రిటిష్ వారి దోపిడీ నుండి అటవీ సంపద మరియు సంస్కృతిని కాపాడటానికి బిర్సా ముండా అవిశ్రాంతంగా కష్టపడ్డారని అన్నారు. అతని జీవితం గిరిజన వర్గాలకు మాత్రమే కాకుండా పౌరులందరికీ కూడా ప్రేరణ మరియు ఆదర్శంగా నిలిచింది.

'సేవా కుంజ్ సంస్థ' కొత్తగా నిర్మించిన భవనాలను ప్రారంభించడం సంతోషంగా ఉందని రాష్ట్రపతి అన్నారు. పాఠశాల, హాస్టల్ భవనాల నిర్మాణాన్ని ఎన్‌టిపిసి చేపట్టిందని అయన గుర్తిస్తూ, ఈ సాంఘిక సంక్షేమ పనులలో భాగస్వామ్యమైన ఎన్‌టిపిసిని ఆయన ప్రశంసించారు. ఈ సంస్థ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కొత్తగా నిర్మించిన భవనాలు మరియు ఇతర సౌకర్యాలు దోహదపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

దేశ ఆత్మ, గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో నివసిస్తుందనే నమ్మకం తనకు ఉందని రాష్ట్రపతి అన్నారు. భారతదేశం మూలాలను ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే, సోన్భద్ర వంటి ప్రదేశంలో కొంత సమయం గడపాలి. గ్రామీణ / అటవీ నివాసితుల సంఘాల అభివృద్ధి లేకుండా దేశ సమగ్ర అభివృద్ధిని ఊహించలేమని ఆయన అన్నారు. నిజమైన కోణంలో, వారి అభివృద్ధి లేకుండా దేశ అభివృద్ధి అసంపూర్ణంగా ఉంది. అందువల్ల, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ మరియు అటవీ నివాసితుల సంఘాల సమగ్ర అభివృద్ధికి వివిధ పథకాలను అమలు చేస్తున్నాయి.

అటవీ నివాసులు తమ పూర్వీకుల నుండి పొందిన సహజ జ్ఞానం యొక్క సంప్రదాయాన్ని సజీవంగా ఉంచుతున్నారని మరియు దానిని ముందుకు తీసుకువెళుతున్నారని రాష్ట్రపతి ప్రశంసించారు. వ్యవసాయం నుండి కళ మరియు చేతిపనుల వరకు, ప్రకృతితో వారు కలిగి ఉన్న సామరస్యం అందరినీ ఆకట్టుకుంటుంది.

తూర్పు ఉత్తర ప్రదేశ్‌ను జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, మధ్యప్రదేశ్‌తో కలిపే సోన్‌భద్ర ప్రాంతం ఆధునిక అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా మారుతుందనే నమ్మకం ఉందని రాష్ట్రపతి అన్నారు. అటవీ నివాసులు వారి సాంస్కృతిక వారసత్వం మరియు గుర్తింపును చెక్కుచెదరకుండా ఆధునిక అభివృద్ధి ప్రక్రియలో అంతర్భాగంగా ఉంచడం మన ప్రయత్నంగా ఉండాలని ఆయన అన్నారు.

క్షీణిస్తున్న జానపద కళలను పునరుద్ధరించడానికి మరియు జానపద భాషలు మరియు పాటలను పరిరక్షించడానికి 'సేవా సమర్పణ్ సంస్థ' ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్రపతి సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

రాష్ట్రపతి ప్రసంగ పాఠం గురించి చుడండి:

Please see the President Speech

***


(Release ID: 1704743) Visitor Counter : 257