జల శక్తి మంత్రిత్వ శాఖ
అన్ని రాష్ట్రాల / కేంద్ర పాలిత ప్రాంతాల జల వనరులశాఖల మంత్రులతో జలజశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ జల్ జీవన్ మిషన్ పురోగతిని సమీక్షించారు
రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు జేజేఎంకు పెంచిన నిధుల సమర్థవంతమైన వినియోగం కోసం కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు.
షెకావత్ ఈ సందర్భంగా ‘తాగునీటి నాణ్యత పరీక్ష, పర్యవేక్షణ & నిఘా’ ముసాయిదాను విడుదల చేశారు. జేజేఎం కోసం వాటర్ క్వాలిటీ ఎంఐఎస్‌ను కూడా ప్రారంభించారు.
Posted On:
13 MAR 2021 5:48PM by PIB Hyderabad
కేంద్ర జల్ శక్తి మంత్రి, గజేంద్ర సింగ్ షెకావత్ అన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులతో/ గ్రామీణ నీటి సరఫరా విభాగాల ఇన్చార్జులతో నిర్వహించిన వెబినార్కు అధ్యక్షత వహించారు. జల్ జీవన్ మిషన్ (జీజీఎం) కింద సాధించిన పురోగతిని సమీక్షించారు. 2024 నాటికి ప్రతి గ్రామీణ గృహానికి పంపు నీటి కనెక్షన్ అందించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రధాన కార్యక్రమమే జేజేఎం. కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి రతన్ లాల్ కటారియా, డీడీడబ్ల్యూఎస్ కార్యదర్శి పంకజ్ కుమార్, అదనపు కార్యదర్శి , మిషన్ డైరెక్టర్ భరత్ లాల్ ఈ వర్చువల్ కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘హర్ ఘర్ జల్’ కేవలం ఒక సారి మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమం మాత్రమే కాదని, ఫ్రంట్‌లైన్ కార్మికుల సామర్థ్యాన్ని పెంపొందించడంలో, మహిళా సాధికారితను సాధించడంలోనూ, గ్రామాల్లో ఉపాధి కల్పించడంలో ఇది చాలా కీలకమని అన్నారు. అనంతరం ఆయన ‘తాగునీటి నాణ్యత పరీక్ష, పర్యవేక్షణ & నిఘా’ ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేశారు. జల్ జీవన్ మిషన్ నీటి నాణ్యత నిర్వహణ సమాచార వ్యవస్థ (డబ్ల్యూక్యూఎంఐఎస్) ను కూడా ప్రారంభించారు. డబ్ల్యూక్యూఎంఐఎస్ ఆన్‌లైన్ పోర్టల్ & మొబైల్ యాప్కు నీటి నాణ్యతకు సంబంధించిన పూర్తి ఆటోమేటెడ్ డేటా మేనేజ్మెంట్ ఉంటుంది.
(ఫ్రేమ్‌వర్క్ డాక్యుమెంటును చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి)
కేంద్ర బడ్జెట్ 2021-22లో జల్ జీవన్ మిషన్ కోసం కేటాయింపులు పెరిగాయి. 2020-21లో రూ .11,500 కోట్లు ఇవ్వగా, 2021-22లో రూ .50,011 కోట్లకు పెరిగింది. రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకుదాదాపు ఐదు రెట్లు పెరిగిన జల్ జీవన్ మిషన్ నిధులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి షెకావత్ కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు. జేజేఎంకు ఇది మూడో సంవత్సరం. ఇది కీలకమైన ఏడాది కూడా. దీర్ఘకాలిక ప్రాతిపదికన ప్రతి ఇంటికి నీటి సరఫరా కోసం సరైన కార్యకలాపాల అమలు, తగిన నిర్వహణ కోసం వ్యవస్థలను తయారు చేసుకోవడానికి , ప్రక్రియలను వ్యూహాత్మకంగా రూపొందించడానికి ఇది అనువైన సమయమని మంత్రి అన్నారు. వెబ్‌నార్ తర్వాత మీడియాను ఉద్దేశించి షెకావత్ మాట్లాడుతూ, 2019 ఆగస్టు 15 న ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాని నరేంద్ర మోడీ జల్ జీవన్ మిషన్‌ను ప్రకటించినప్పటి నుండి, దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం గణనీయమైన పురోగతి సాధించిందని చెప్పారు. 3.77 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు పంపు నీటి కనెక్షన్లు అందించామని తెలిపారు. మొత్తంగా, 7 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలు (36.5%) ఇప్పుడు స్వచ్ఛమైన నీటిని పొందుతున్నాయి. అంటే దేశంలో 1/3 గ్రామీణ కుటుంబాలు కుళాయిల ద్వారా తాగునీటిని పొందుతున్నాయి. 52 జిల్లాలు, 670 బ్లాక్‌లు, 42,100 పంచాయతీలు, 81,123 గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి కుళాయి నీరు అందుతోందని షెకావత్ తెలిపారు. 2020-21లో కరోనా సవాళ్లు ఎదురైనప్పటికీ, మిషన్ను సమర్థవంతంగా , సమర్థవంతంగా అమలు చేయడానికి క్షేత్రస్థాయిలో ప్రణాళికను సక్రమంగా అమలు చేశామని అన్నారు. కరోనా అనంతరం దేశం మొత్తం సాధారణ స్థితికి రావడానికి ప్రయత్నిస్తున్నదని చెప్పారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ‘గ్రామీణ ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీటిని అందించడానికి’ నిరంతర ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. జల్ శక్తి శాఖ సహా మంత్రి రతన్ లాల్ కటారియా మాట్లాడుతూ తన సొంత రాష్ట్రం హర్యానాలోని తన గ్రామంలోని మహిళల ఇళ్లకు సమీపంలో తాగునీరు అందుబాటులో లేక ఎన్నో ఇబ్బందులుపడ్డ సందర్భాలను గుర్తుచేసుకున్నారు. గ్రామీణ మహిళలు & బాలల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువస్తున్న ఈ మిషన్‌లో పాల్గొనడం గర్వంగా ఉందని కటారియా అన్నారు.
జల్ జీవన్ మిషన్ కోసం 2020-21 బడ్జెట్లో రూ .11,500 కోట్లు ఇవ్వగా, 2021-22లో రూ .50,011 కోట్లకు పెరిగింది. బడ్జెట్ ప్రకటన వచ్చిన వెంటనే, 2021-22లో జేజేఎం అమలును వేగవంతం చేసే మార్గాలను అన్వేషించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రైవేటు రంగం, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు మొదలైన వారితో ఉన్నత స్థాయి సంప్రదింపులు జరిపారు. నేటి వెబ్‌నార్ 2021 ఫిబ్రవరి 16 న జరిగిన వర్చువల్ కాన్ఫరెన్స్ అనంతర కార్యక్రమం. జల్ జీవన్ మిషన్ ప్రోగ్రాం అమలుస్థాయిని పెంచడానికి , వేగాన్ని అంచనా వేయడానికి ప్రధానమంత్రి చర్యలు తీసుకున్నారు.
***
(Release ID: 1704724)
Visitor Counter : 173