భారత ఎన్నికల సంఘం

అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బంగాల్‌ శాసనసభ ఎన్నికలు - జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలకు ప్రసారాల సమయం కేటాయింపు

Posted On: 09 MAR 2021 4:17PM by PIB Hyderabad

ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేని రాజకీయ ప్రచారాలను ప్రోత్సహించేందుకు, ప్రసార భారతి సంస్థను సంప్రదించిన భారత ఎన్నికల సంఘం, ప్రసారాల కోసం రాజకీయ పార్టీలకు కేటాయించిన సమయాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించింది. అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బంగాల్‌లో శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
జాతీయ రాజకీయ పార్టీలకు, ఈ ఐదు రాష్ట్రాల్లోని గుర్తింపు పొందిన ప్రాంతీయ రాజకీయ పార్టీలకు దూరదర్శన్‌, ఆల్‌ ఇండియా రేడియోలో ప్రసారాల కోసం కేటాయించిన సమయం రెట్టింపు అవుతుంది. 

    అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బంగాల్‌లో జాతీయ, గుర్తింపు పొందిన ప్రాంతీయ రాజకీయ పార్టీలకు దూరదర్శన్‌, ఆల్‌ ఇండియా రేడియోలో కేటాయించిన ప్రసార సమయాల రెట్టింపునకు సంబంధించి, భారత ఎన్నికల సంఘం కమిషనర్‌ వెలవరించిన ఆదేశాన్ని (437/TA-LA/1/2021/Communication‌) జత పరచడమైనది.
 
జత పరిచిన ఆదేశం ప్రతి కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.


(Release ID: 1703592) Visitor Counter : 150