ఆర్థిక మంత్రిత్వ శాఖ

జీఎస్‌టీ పరిహారంలో భాగంగా రాష్ట్రాలకు ఆర్థిక సాయం

Posted On: 09 MAR 2021 1:12PM by PIB Hyderabad

రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్‌టీ పరిహారంలో లోటును భర్తీ చేసేందుకు, గతేడాది అక్టోబర్‌లో, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రుణ సదుపాయాన్ని కల్పించింది. రూ.1.1 లక్షల కోట్ల అంచనా లోటును భర్తీ చేసేందుకు దీనిని ఏర్పాటు చేసింది. 

    కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు సమర్పించారు.

    ప్రత్యేక రుణ సదుపాయం ద్వారా రాష్ట్రాలు, యూటీల తరపున కేంద్రం 03.02.2021 వరకు రూ.84 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకున్నట్లు మంత్రి వివరించారు. దీనిని విడతలవారీగా ఆయా రాష్ట్రాలు, యూటీలకు అందించినట్లు పేర్కొన్నారు. జీఎస్‌టీ పరిహార నిధిలో నిధుల కొరతతో పరిహారం విడుదల చేయకపోవడం వల్ల ఏర్పడిన ఆర్థిక వనరుల ఇబ్బందులను తీర్చేందుకు ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించిందని రాజ్యసభకు వెల్లడించారు.

    ప్రత్యేక రుణ సదుపాయంతోపాటు, ఆప్షన్‌-1 ఎంచుకున్న రాష్ట్రాలు అదనపు ఆర్థిక వనరులు సమీకరించుకునేలా, వాటి స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో అర శాతం మించకుండా అదనపు రుణాలు తీసుకోవడానికి కూడా కేంద్రం అనుమతి ఇచ్చినట్లు శ్రీ ఠాకూర్‌ పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు ఆప్షన్‌-1నే ఎంచుకున్నాయి. ఈ నిబంధన కింద రూ.1,06,830 కోట్ల అప్పులు (జీఎస్‌డీపీలో అర శాతం) తీసుకునేందుకు 28 రాష్ట్రాలకు ఇప్పటికే అనుమతులు అందాయి.

    జీఎస్‌టీ పరిహార లోటు భర్తీలో భాగంగా, 2020-21లో, కేంద్రం నుంచి విడతల వారీగా రుణాలు పొందిన రాష్ట్రాల వివరాలు, అదనపు రుణం కోసం 03.02.2021 వరకు అనుమతులు పొందిన రాష్ట్రాల వివరాలు క్రింది పట్టికలో ఉన్నాయి.

***



(Release ID: 1703522) Visitor Counter : 93


Read this release in: English , Urdu , Bengali , Punjabi