జల శక్తి మంత్రిత్వ శాఖ
ఒడిశాలో నీటి నాణ్యత పరీక్షల్లో ముందున్న మహిళలు
క్షేత్ర స్థాయి పరికరాలను అందించి నీటి నాణ్యతను మహిళలు పరీక్షించేలా చూస్తున్న జల్ జీవన్ మిషన్
Posted On:
08 MAR 2021 3:24PM by PIB Hyderabad
ప్రజల ఆరోగ్యం మరియు శ్రేయస్సులో కీలక పాత్ర పోషించే నీటి నాణ్యతను తెలుసుకోవడం చాలా ముఖ్యం. జల్ జీవన్ మిషన్ ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. దీనికోసం మహిళలకు పరికరాలను అందిస్తూ వారితో నీటి నాణ్యతను తెలుసుకోవడానికి పరీక్షలను నిర్వహిస్తున్నారు. నీటి నాణ్యత పర్యవేక్షణ మరియు నిఘాలకు సంబందించిన అంశంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు ఇవి సంబంధిత శాఖకు చెందిన అంశాలుగా ఉండేవి. ఇప్పుడు ఇవి ప్రజల హక్కుగా మారాయి. నూతన పరిణామం నీటి సరఫరాలో సమాజ భాద్యతగా కాకుండా సమాజ భాగస్వామ్యంగా మారింది. నీటి నాణ్యతను ప్రజారోగ్య ఇంజినీర్లు మాత్రమే నిర్ధారించగలరన్న ప్రచారానికి ఇది తెరదించింది. సరైన మార్గనిర్దేశం చేస్తే ప్రజలు కూడా ఈ భాద్యతను నిర్వర్తించగలరని రుజువయ్యింది.
స్వయం సహాయక బృందాల సభ్యులకు శిక్షణ ఇచ్చి వారి నైపుణ్యాలను మెరుగుపరచిన ఒడిశా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య శాఖ 2020 నవంబర్ ఒకటవ తేదీ నుంచి 30వ తేదీవరకు నెలరోజుల పాటు చేతి పంపులు, గొట్టపుబావులు, బావులు, నీటి సరఫరా ప్రాంతాలలో నాలుగు లక్షల నీటి నమూనాలను పరీక్షించింది. నమూనాలను సేకరించిన స్వయం సహాయక బృందాల సభ్యులు ప్రజల సమక్షంలో వాటిని పరీక్షించి, మంచి నీరు కలుషితం అయినట్టు వెల్లడైతే వారిని అప్రమత్తం చేయడం జరిగింది. రసాయనాలు లేదా బ్యాక్టీరియా వల్ల కలుషితం అయినట్టు గుర్తించిన జలాలను నిర్ధారణ కోసం జిల్లా లేదా సబ్ డివిజన్ స్థాయిలో వున్న పరిశోధనాశాలలకు పంపడం జరిగింది.
స్థానికులకు నీటి నాణ్యతను పరీక్షించడంలో శిక్షణ ఇవ్వడం వల్ల మారుమూల ప్రాంతాలైన మల్కన్ గిరి, నవరంగపూర్, సుందర్ ఘర్ లాంటి ప్రాంతాలలో నివసిస్తున్న నిరక్షరాస్యులు కూడా నీటి నాణ్యత నిర్ధారణ పరికరాలను ఉపయోగించగలుగుతున్నారు. కోవిడ్-19 సమయంలో నీటి వనరులను పరీక్షించడం సవాలుగా తీసుకున్న శాఖ స్వయం ఉపాధి పొందుతున్న 12వేల మంది మెకానిక్కులు, మహిళా స్వయం సహాయక బృందాలకు చెందిన 11 వేలమంది మహిళలను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి వారికి 7,000 కిట్లను అందించి సైనికులుగా రంగంలోకి దింపింది.పరిశోధనా కేంద్రాల్లో 105 మంది సిబ్బందిని, బ్లాకు స్థాయిలో 314 మంది జూనియర్ ఇంజినీర్లను ఒడిశా ప్రభుత్వం నియమించింది. మెకానిక్కులు, మహిళా స్వయం సహాయక బృందాలను వీరు పర్యవేక్షిస్తారు.
నూతన వ్యవస్థ వల్ల ఈ బృందాలు మూడు లక్షలకు పైగా జల వనరుల నాణ్యతను విజయవంతంగా పరీక్షించాయి. ఏదాదిలో రెండు సార్లు బ్యాక్టీరియా, ఒకసారి రసాయన పరీక్షలను నిర్వహించడానికి శాఖ నైపుణ్యం కలిగిన 11 వేల మహిళలతో కూడిన బృందాలను శాఖ కలిగివుంది. జల్ జీవన్ మిషన్ అమలు చేసిన ఈ చర్యతో అనేక మంది మహిళలను ముందుకు వచ్చి తాగునీటి రంగంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
***
(Release ID: 1703223)
Visitor Counter : 141