పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

బరేలీకి ప్రారంభమైన మొదటి విమాన సర్వీసు

కొత్త విమాన కార్యకలాపాలు ఢిల్లీని బరేలీతో నేరుగా అనుసంధానం చేస్తాయి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొత్తం మహిళా సిబ్బంది నేతృత్వంలో మొదటి సర్వీసు

5 హెలిపోర్ట్‌లు మరియు 2 వాటర్ ఏరోడ్రోమ్‌లతో సహా 325 మార్గాలు మరియు 56 విమానాశ్రయాలు ఉడాన్ కింద పనిచేస్తున్నాయి

Posted On: 08 MAR 2021 1:40PM by PIB Hyderabad

శ్రీ హర్దీప్ సింగ్ పూరి, ఎంవోఎస్‌, ఐ / సి, సివిల్ ఏవియేషన్ ఈ రోజు ఢిల్లీ నుండి కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన త్రిశూల్ మిలిటరీ ఎయిర్‌బేస్, ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ విమానాశ్రయానికి కొత్త విమాన సర్వీస్‌ను ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ- బరేలీ ప్రారంభ విమాన సర్వీస్‌లో మహిళా సిబ్బందిని మాత్రమే  ఉపయోగించారు. ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో ఎంవోఎస్‌, ఐ/సి కార్మిక, ఉపాధి మరియు పార్లమెంటు సభ్యుడు శ్రీ సంతోష్ గంగ్వర్ పాల్గొన్నారు. మోకా కార్యదర్శి శ్రీ ప్రదీప్ సింగ్ ఖరోలా మరియు ఎయిర్ ఇండియా సిఎండి శ్రీ రాజీవ్ బన్సాల్ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (మోకా) జాయింట్ సెక్రటరీ శ్రీమతి ఉషా పాధీ పాల్గొన్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (మోకా) & విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) లోని ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో హాజరయ్యారు.

భారత ప్రభుత్వ ప్రాంతీయ కనెక్టివిటీ పథకం - ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్ (ఆర్‌సిఎస్-ఉడాన్) కింద వాణిజ్య విమాన కార్యకలాపాల కోసం బరేలీ విమానాశ్రయం అప్‌గ్రేడ్ చేయబడింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉడాన్ పథకం కింద 56 వ విమానాశ్రయం ప్రారంభమైనట్లు సూచిస్తుంది. లక్నో, వారణాసి, గోరఖ్‌పూర్‌, కాన్పూర్, హిండన్, ఆగ్రా మరియు ప్రయాగ్‌రాజ్‌ తరువాత ఉత్తర ప్రదేశ్‌లోని 8 వ విమానాశ్రయంగా ఇది గుర్తింపు పొందింది. ఇప్పుడు ప్రజలు ఢిల్లీ నుండి బరేలీకి విమాన ప్రయాణం ద్వారా కేవలం 60 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. గతంలో 6 గంటలకు పైగా రహదారి ప్రయాణం లేదా 4 గంటలకు పైగా రైలు ప్రయాణాన్ని ప్రయాణికు ఎంచుకోవలసి వచ్చేది.

భారత వైమానిక దళానికి చెందిన బరేలీలోని త్రిశూల్ మిలిటరీ ఎయిర్‌బేస్ మధ్యంతర పౌర విమానయాన కార్యకలాపాల నిర్మాణం కోసం ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించారు. భారత ప్రభుత్వం మధ్యంతర పౌర విమానయాన కార్యకలాపాల అభివృద్ధికి ఉడాన్ పథకం కింద 88 కోట్లు కేటాయించింది. రూ.65 కోట్ల వ్యయంతో ఈ అప్‌గ్రేడేషన్‌ను ఏఏఐ చేపట్టింది.

గతేడాది ఉడాన్ -4 బిడ్డింగ్ ప్రక్రియలో అలయన్స్ ఎయిర్‌కు ఢిల్లీ- బరేలీ మార్గం లభించింది. ఈ మార్గంలో 70 సీట్ల సీటింగ్ సామర్థ్యం కలిగిన ఎటిఆర్ 72 600 విమానాలను విమానయాన సంస్థ నడుపుతోంది.

ప్రస్తుతం 5 హెలిపోర్టులు మరియు 2 వాటర్ ఏరోడ్రోమ్‌లతో సహా 325 మార్గాలు మరియు 56 విమానాశ్రయాలు ఉడాన్ పథకం కింద పనిచేస్తున్నాయి. సామాన్య ప్రజలకు ఛార్జీలు అందుబాటులో ఉండటానికి, ఉడాన్ పథకం కింద కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు విమానాశ్రయ నిర్వాహకుల నుండి ఎంపిక చేయని విమానయాన సంస్థలకు ఉడాన్ పథకం కింద ఆర్ధిక ప్రోత్సాహకాలు అందించబడుతున్నాయి.

ఈ వైమానిక అనుసంధానం నాథ్‌నగ్రి కోసం బరేలీని సందర్శించే లక్షలాది మంది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది (ఈ ప్రాంతంలోని నాలుగు మూలల్లో ఉన్న నాలుగు శివాలయాలకు ప్రసిద్ధి చెందింది - ధోపేశ్వర్ నాథ్, మద్దినాథ్, అలఖానాథ్ మరియు త్రివతినాథ్), అలా హజ్రత్, షా షరాఫత్ మియాన్ మరియు ఖంకాహే నియాజియా, జారి నగరి మరియు చారిత్రాత్మకంగా ముఖ్యమైన ప్రదేశాలు సంజస్య (ఇక్కడ బుద్ధుడు తుషిత నుండి భూమికి వచ్చారు). ఈ నగరం ఫర్నిచర్ తయారీ మరియు పత్తి, తృణధాన్యాలు మరియు చక్కెర వ్యాపార కేంద్రం. ఈ ఎయిర్ కనెక్టివిటీ బరేలీ మరియు మొత్తం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది. ఈ ప్రాంతం యొక్క వైమానిక అనుసంధానం పెంచడంతో పాటు, విమాన కార్యకలాపాలు వాణిజ్యం, పర్యాటకం మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థకు అదనపు ప్రయోజనాలను అందిస్తాయి.

విమాన షెడ్యూల్ క్రింద పేర్కొనబడింది:

ఫ్లైట్ నం

వెళ్లే సమయం 

వచ్చే సమయం

ఫ్లైట్ 9I701

08:55

10:00

ఫ్లైట్ 9I702

10:25

11:25

 

****

 

 


(Release ID: 1703198) Visitor Counter : 177