ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడులో పెరుగుతున్న కోవిడ్ కేసులు

కోవిడ్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు కేంద్రం అండ

Posted On: 08 MAR 2021 10:59AM by PIB Hyderabad

మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడులో కోవిడ్ కేసులు బాగా పెరుగుతున్నాయి. గత 24 గంటలలో కొత్తగా 18,599 కోవిడ్ కేసులు నమోదు కాగా అందులో  86.25% కేసులు ఈ ఆరు రాష్ట్రాలకు చెందినవే కావటం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా  ఒక రోజులో  11,141 కేసులు రాగా కేరళలో 2,100, పంజాబ్ లో 1,043 నమోదయ్యాయి.

 

రోజువారీ కోవిడ్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాల విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.రోగ్య కార్యదర్శి కూడా వారం వారం సమీక్షాసమావేశాలు నిర్వహిస్తున్నారు. అవసరమైన చోట తగిన సహాయాన్ని అందిస్తున్నారు. ఇటీవలే మహారాష్ట, పంజాబ్ రాష్టాలకు కేంద్రం ఉన్నతస్థాయి బృందాలను పంపి అక్కడి రాష్ట ప్రభుత్వానికి అండగా నిలబడి కరోనా వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

 

అంతకుముందే మహారాష్ట, కేరళ, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్నాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్మూ-కశ్మీర్ కు కేంద్రం వైద్య బృందాలను పంపింది. కోవిడ్ మీద పోరాటంలో రాష్టాలకు ఈ బృందాలు సహకరించాయి.  

ఈ బృందాలు ఆయా రాష్ట్రాల వైద్య ఆరోగ్య అధికారులతో మాట్లాడి ప్రత్యక్షంగా పరిస్థితి తెలుసుకోవటానికి, నియంత్రణ వ్యూహంలో పాలుపంచుకోవటానికి కృషి చేసి రాష్ట్రాలకు సహకరిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రాలకు ఎదురయ్యే అవరోధాలను తొలగించటానికి కూడా ఈ బృందాలు కృషి చేశాయి. రోజువారీ కొత్త కేసులు ఎనిమిది రాష్ట్రాలలో పెరుగుతున్నాయి.

 

భారతదేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు 1,88,747 కాగా, ఇవి మొత్తం పాజిటివ్ కేసులలో 1.68%. దేశవ్యాప్తంగా జరిపిన మొత్తం కోవిడ్ పరీక్షలు 22 కోట్లు దాటి 22,19,68,271 కు చేరాయి. ఇందులో దేశవ్యాప్త పాజిటివ్ శాతం ప్రస్తుతం 5.06%. ఈ ర్

జాతీయ సగటు అయిన 2.29% కంటే ఎక్కువగా 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 11.13% శాతం పాజిటివ్ నమోదైంది.

 

ఈరోజు ఉదయం 7 గంటలవరకు 3,76,633 శిబిరాల ద్వారా 2,09,89,010 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో

69,85,911 మొదటి డోస్ ఆరోగ్య సిబ్బంది, 35,47,548 రెండో డోస్ ఆరోగ్య సిబ్బంది, 66,09,537 కోవిడ్ యోధుల మొదటి డోస్, 2,13,559 కోవిడ్ యోధుల రెండో డోస్, 4,80,661 మంది 45 ఏళ్ళు పైబడ్డ దీర్ఘకాల వ్యాధి గ్రస్తుల మొదటి డోస్, 31,51,794 మంది 60 ఏళ్ళు పైబడ్డవారి మొదటి డోస్ కలిసి ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 - 60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్ళు పైబడ్డవారు

 

మొత్తం

మొదటి డోస్

రెండో డోస్

మొదటి డోస్

రెండో డోస్

మొదటి డోస్

మొదటి డోస్

69,85,911

35,47,548

66,09,537

2,13,559

4,80,661

31,51,794

2,09,89,010

 

గత 24 గంటలలో 97 మంది కోవిడ్ తో మరణించగా అందులో 87.63% మంది ఏడు రాష్టాలవారే. మహారాష్ట్రలో అత్యధికంగా 38 మంది చనిపోగా పంజాబ్ లో 17 మంది, కేరళలో 13 మంది మరణించారు.

18 రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలలో గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, చండీగఢ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, మణిపూర్, మేఘాలయ,మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర. 

***


(Release ID: 1703162) Visitor Counter : 197