ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్నాటక, తమిళనాడులో పెరుగుతూనే ఉన్న కోవిడ్ కేసులు


ఈ ఉదయం 7 గంటలవరకు కోటీ 94 లక్షలకు పైగా టీకా డోసుల పంపిణీ

గత 24 గంటల్లో దాదాపు 15 లక్షల కోవిడ్ టీకాలు

Posted On: 06 MAR 2021 11:14AM by PIB Hyderabad

మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్నాటక, తమిళనాడులో రోజువారీ కొత్త  కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  గత 24 గంటల్లో 18,327 కొత్త కేసులు రాగా అందులో  82% ఈ రాష్ట్రాలవే. మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో 10,216 కేసులు రాగా కేరళలో 2,776, పంజాబ్ లో 808 కొత్త కేసులు నమోదయ్యాయి.

WhatsApp Image 2021-03-06 at 11.08.23 AM.jpeg

కేసుల సంఖ్య పెరగటం ఎనిమిది రాష్ట్రాలలో కనబడుతోంది. 

 

భారతదేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 1,80,304 కి చేరింది. అది మొత్తం పాజిటివ్ కేసులలో1.61%. మరోవైపు 21 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 1000 మంది లోపు చికిత్సలో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో ముగ్గురే చికిత్సలో ఉన్నారు.

రాష్ట్రాలవారీగా గత 24 గంటలలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులలో మార్పును ఈ క్రింది చిత్రపటంలో చూడవచ్చు. కేరళ, చత్తీస్ గఢ్, తమిళనాడు లో చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుదలబాటలో సాగుతోంది. మరోవైపు అదే సమయంలో మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానాలో వీరి సంఖ్య పెరుగుతోంది. .

రెండో డోస్ కోవిడ్ టీకాల కార్యక్రమం ఫిబ్రవరి13న మొదలు కాగా, మొదటి డోస్ తీసుకొని 28 రోజులు పూర్తయినవారు ఈ రెండో డోస్ కు అర్హత సాధించారు. కోవిడ్ యోధులకు టీకాలివ్వటం ఫిబ్రవరి2న మొదలైంది. రెండో దశ టీకాలు ఇవ్వటం మార్చి 1న మొదలైంది. ఇది 60 ఏళ్ళు పైబడ్డవారికి, 45 ఏళ్ళు పైబడి దీర్ఘకాలవ్యాధులతో బాధపడేవారికి వర్తిస్తుంది.

3,57,478 శిబిరాల ద్వారా మొత్తం 1,94,97,704 మందికి టీకాలు ఇచ్చినట్టు ఈ ఉదయం 7 గంటలవరకు అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వీరిలో 69,15,661 మంది మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, 33,56,830 మంది రెండో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, 63,55,989 మంది మొదటి డోస్ అందుకున్న కోవిడ్ యోధులు, 1,44,191 మంది రెండో డోస్ అందుకున్న కోవిడ్ యోధులు 3,46,758 మంది 45 ఏళ్ళు పైబడ్డ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు,   23,78,275 మంది 60 ఏళ్ళు పైబడ్డవారు ఉన్నారు. 

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్ళు పైబడ్డవారు

 

మొత్తం

మొదటి డోస్

రెండో డోస్

మొదటి డోస్

రెండో డోస్

మొదటి డోస్

మొదటి డోస్

69,15,661

33,56,830

63,55,989

1,44,191

3,46,758

23,78,275

1,94,97,704

 

టీకాల కార్యక్రమం మొదలైన 49వ రోజైన మార్చి 5న మొత్తం14,92,201 టీకా డోసులిచ్చారు. అందులో  11,99,848 మంది లబ్ధిదారులకు 18,333 శిబిరాల ద్వారా మొదటి డోస్ ( ఆరోగ్యసిబ్బంది, కోవిడ్ యోధులు)  అందుకున్నవారు,  2,92,353 మంది రెండో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు ఉన్నారు.   

తేదీ: మార్చి 1, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

మొదటిడోస్

రెండో డోస్

మొదటిడోస్

రెండో డోస్

మొదటి డోస్

మొదటి డోస్

మొదటి డోస్

రెండో డోస్

62,578

2,15,459

2,65,058

76,894

1,10,857

7,61,355

11,99,848

2,92,353

 

గత 24 గంటలలో 108 మంది కోవిడ్ వల్ల మృతిచెందారు. వీరిలో 85.2% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. మహారాష్ట్రలో గత 24 గంటలలో అత్యధికంగా 53 మంది చనిపోగా కేరళలో 16 మంది, పంజాబ్ లో 11 మంది మరణించారు.

గత 24 గంటలలో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు.ఇవి గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్,  గోవా, లక్షదీవులు, పుదుచ్చేరి,  అస్సాం, సిక్కిం, మణిపూర్, లద్దాఖ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, చండీగఢ్, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి.

****



(Release ID: 1702873) Visitor Counter : 237