వ్యవసాయ మంత్రిత్వ శాఖ
కేంద్ర ప్రభుత్వ రంగ పథకం, "10,000 రైతు ఉత్పత్తి సంస్థల (ఎఫ్.పి.ఓ) ఏర్పాటు మరియు అభివృద్ధి", మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న - కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఎఫ్.పి.ఓ.లు, సి.బి.ఓ.ల వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించిన - కేంద్ర సహాయ మంత్రులు శ్రీ పురుషోత్తం రూపాలా మరియు శ్రీ కైలాష్ చౌదరి
ఎఫ్.పి.ఓ.లు వ్యవసాయాన్ని మరింత ఆచరణీయంగా చేస్తాయి: శ్రీ రూపాల
Posted On:
01 MAR 2021 7:24PM by PIB Hyderabad
'10,000 రైతు ఉత్పత్తి సంస్థల (ఎఫ్‌పిఓ) ఏర్పాటు మరియు అభివృద్ధి' అనే కేంద్ర రంగ పథకం వార్షికోత్సవం సందర్భంగా, ఎఫ్.పి.ఓ. ల కు చెందిన సి.ఈ.ఓ. లు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అకౌంటెంట్ల కోసం రూపొందించిన వృత్తి శిక్షణా కార్యక్రమాన్ని, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రులు శ్రీ పురుషోత్తం రూపాలా, శ్రీ కైలాష్ చౌదరి ప్రారంభించారు. 6865 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో అమలౌతున్న ఈ పథకాన్ని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్ లో 2020 ఫిబ్రవరి, 29వ తేదీన ప్రారంభించారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను శ్రీ రూపాల కొత్త ఎఫ్.పి.ఓ. లకు అందజేశారు.
ఈ పథకంలో బాగా నిర్వచించబడిన శిక్షణా నిర్మాణాలు ఉన్నాయి. సామర్ద్యాభివృధి మరియు ఎఫ్.పి.ఓ. ల శిక్షణ కోసం, లక్నో లోని బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (బి.ఐ.ఆర్.డి) మరియు గురుగ్రామ్ లోని లక్ష్మణారావు ఇనామ్‌దార్ నేషనల్ అకాడమీ ఫర్ కో-ఆపరేటివ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (లినాక్) వంటి సంస్థలను, ప్రధాన శిక్షణా సంస్థలుగా ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా, ఎఫ్.పి.ఓ.లను మరింత బలోపేతం చేయడానికి శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధి ప్రణాళికలను అభివృద్ధి చేయడం జరిగింది.
ఈ సందర్భంగా, శ్రీ రూపాలా మాట్లాడుతూ, భూమిని సమగ్రపరచడం ద్వారా ఎఫ్.పి.ఓ. లు వ్యవసాయాన్ని మరింత ఎక్కువగా వినియోగంలోకి మారుస్తాయని అన్నారు. ఎఫ్.పి.ఓ. ల ఏర్పాటు కేవలం ఒక పథకం మాత్రమే కాదనీ, నవీన భారతదేశంలో భారతీయ వ్యవసాయానికి, ఒక నూతన కోణాన్నిఇచ్చే ప్రణాళిక వంటిదని, ఆయన అభివర్ణించారు. ఈ పథకం విప్లవాత్మకమైనదనీ, ఇది రైతుల జీవితాల్లో, పరివర్తన తెస్తుందనీ, శ్రీ చౌదరి వ్యాఖ్యానించారు. ఎ.ఫ్.పి.ఓ. ల ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలపై ప్రాంతీయ భాషల్లో ఒక చిన్న పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు.
ప్రతి బ్లాక్‌లో సంస్థాగత మౌలిక సదుపాయాలకు ఉత్ప్రేరకంగా పనిచేసే, ఒక ఎఫ్.పి.ఓ. ఉండాలని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ అగర్వాల్ సూచించారు.
ప్రస్తుత సంవత్సరంలో ఎఫ్.పి.ఓ.ల ఏర్పాటుకు 2200 కి పైగా ఎఫ్.పి.ఓ. లు ఉత్పత్తి క్లస్టర్లు కేటాయించబడ్డాయి, వీటిలో 100 ఎఫ్.పి.ఓ. లను, సేంద్రీయ ఉత్పత్తుల కోసం ప్రత్యేకించారు. విలువ గొలుసు అభివృద్ధితో, నూనె గింజల కోసం 100 ఎఫ్.పి.ఓ.లు మరియు నిర్దిష్ట వస్తువులకు 50 ఎఫ్.పి.ఓ. లు ఏర్పాటుకానున్నాయి. ఎఫ్.పి.ఓ. ల ఏర్పాటు, అభివృద్ధి కోసం, ఎస్.ఎఫ్.ఏ.సి., నాబార్డ్, ఎన్.సి.డి.సి. తో పాటు, అదనంగా, మరో ఆరు అమలు సంస్థలను కూడా ఆమోదించడం జరిగింది.
అమలు చేసే ఏజెన్సీలు (ఐ.ఏ. లు) ప్రతి ఎఫ్.పి.ఓ. కి ఐదు సంవత్సరాల కాలానికి సమగ్రంగా, నమోదు చేయడానికి మరియు వృత్తిపరమైన హ్యాండ్ హోల్డింగ్ మద్దతును అందించడానికి క్లస్టర్-బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ (సి.బి.బి.ఓ.ల) ని నిమగ్నం చేస్తున్నాయి. ప్రతి ఎఫ్.పి.ఓ. అభివృద్ధికి సంబంధించిన అన్ని సమస్యలకు పూర్తి పరిష్కారాలను అందించడానికి వీలుగా ఈ సి.బి.బి.ఓ.లు వేదికగా ఉంటాయి. కేంద్రపాలిత ప్రాంతమైన కశ్మీర్ తో పాటు, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు మరియు ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లలో ఇప్పటికే ఎఫ్.పి.ఓల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా, ఈ ప్రక్రియ పురోగతిలో ఉంది. నమోదైన ఎఫ్.పి.ఓ.లు ఆపిల్, బాదం, తేనె, టీ, వేరుశనగ, పత్తి, సోయాబీన్, అవిసె గింజలు, చెరకు, కూరగాయలు మొదలైన వాటి కోసం పనిచేస్తున్నాయి.
ఎఫ్.పి.ఓ.లకు 3 సంవత్సరాల కాలానికి, ఒక్కొక్క ఎఫ్.పి.ఒ.కు 18 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. వీటితో పాటు, ఎఫ్.పి.ఓ. సభ్యులుగా ఉన్న ఒక్కొక్క రైతుకు 2,000 రూపాయలచొప్పున, ఒక్కొక్క ఎఫ్.పి.ఓ. కి 15 లక్షల రూపాయలు మించకుండా, మాచింగ్ గ్రాంటు చెల్లించడానికి వీలు కల్పించారు. అదేవిధంగా, ఎఫ్.పి.ఓ.లకు సంస్థాగత ఋణాలు అందుబాటులో నిర్ధారించడానికి అర్హతగల రుణ సంస్థ నుండి ఒక్కొక్క ఎఫ్.పి.ఒ.కు రెండు కోట్ల రూపాయల వరకు ప్రాజెక్టు ఋణం తో క్రెడిట్ హామీ సౌకర్యం కల్పించడం జరుగుతుంది.
జాతీయ స్థాయిలో, జాతీయ ప్రాజెక్టు నిర్వహణ సంస్థ (ఎన్.పి.ఎం.ఎ) మొత్తం ప్రాజెక్టు మార్గదర్శకత్వం, సమన్వయం, ఎఫ్.పి.ఓ. లకు సంబంధించిన సమాచార సంకలనం, ఎం.ఐ.ఎస్. నిర్వహణ మరియు పర్యవేక్షణ ప్రయోజనం కోసం నిమగ్నమై ఉంది.
ఉత్పత్తి సమూహాలలో ఎఫ్.పి.ఓ.లను అభివృద్ధి చేయాలి. ఆర్ధికవ్యవస్థను అభివృద్ధి చేయడానికి మరియు సభ్యులకు మార్కెట్ సౌకర్యాల అందుబాటును మెరుగుపరచడానికి, వ్యవసాయ మరియు ఉద్యానవన ఉత్పత్తులను అధికంగా ఉత్పత్తి చేయాలి. “ఒక జిల్లా, ఒక ఉత్పత్తి” క్లస్టర్ విధానం ప్రత్యేకతను, మెరుగైన ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్, ఎగుమతిని ప్రోత్సహిస్తుంది. మరింత వ్యవసాయ విలువను పెంచే సంస్థలు, ఎఫ్.పి.ఓ. లను ఏర్పాటు చేస్తున్నాయి మరియు సభ్యుల ఉత్పత్తికి 60 శాతం మార్కెట్ అనుసంధానాలను సులభతరం చేస్తున్నాయి.
10,000 ఎఫ్.పి.ఓ. ల ఏర్పాటు పథకం, రైతులు తమ తమ వ్యవసాయ క్షేత్రాల ముఖద్వారం వద్దే తమ వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాన్ని ప్రోత్సహిస్తుంది, తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుంది. ఇది సరఫరా నిడివిని తగ్గిస్తుంది, తదనుగుణంగా మార్కెటింగ్ వ్యయం తగ్గుతుంది, ఫలితంగా రైతులకు మంచి ఆదాయం వస్తుంది. ఇది గ్రామీణ యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలను కల్పిస్తూ, వ్యవసాయ క్షేత్రాల ద్వారం దగ్గరే, మార్కెటింగ్ మరియు అదనపు విలువ వ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాలలో అధిక పెట్టుబడులను వేగవంతం చేస్తుంది.
*****
(Release ID: 1701872)
Visitor Counter : 223