ఆర్థిక మంత్రిత్వ శాఖ

హైదరాబాద్‌లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు

Posted On: 01 MAR 2021 4:49PM by PIB Hyderabad

 

ఆదాయపు పన్ను శాఖ 24.02.2021వ తేదీ హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రధాన  ఔషధ సంస్థ సమూహంలో సోదా కార్యకలాపాలను నిర్వహించింది. ఈ ఔష‌ధాల గ్రూపు సంస్థ ఇంటర్మీడియట్స్‌తో పాటు యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రీడియంట్  (ఏపీఐ), ఔషధ సూత్రీకరణల తయారీ వ్యాపార కార్య‌క‌లాపాల్లో నిమగ్నమై ఉంది. ఈ గ్రూపు తయారు చేసే ఉత్పత్తులలో అత్య‌ధిక‌ భాగం అమెరికా, ఐరాపాలోని వివిధ దేశాలకు ఎగుమతి చేయబడతాయి. మొత్తం 5 రాష్ట్రాల్లోని 20 ప్రదేశాలలో ఐటీ శాఖ సోదా ఆపరేషన్‌లు జరిగాయి. ఈ ఐటీ శాఖ సోదాల‌లో దాదాపు రూ.1.66 కోట్ల మేర న‌గ‌దును సీజ్ చేశారు. ఈ సోదాల‌లో డిజిటల్ మీడియా రూపంలో సాక్ష్యాలను పెన్ డ్రైవ్‌లు, కీల‌క పత్రాలను కనుగొని స్వాధీనం చేసుకున్నారు. అసెస్సీ గ్రూప్ నిర్వహించే ఎస్ఏపీ @ ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్ నుండి వివిధ దోష పూరిత డిజిటల్ ఆధారాలు సేకరించబడ్డాయి. ఈ సోదాల‌లో బూటకపు మరియు ఉనికిలో లేని సంస్థల నుండి ఔష‌ధ సంస్థ చేసిన కొనుగోళ్లకు సంబంధించిన విష‌యాలు, కొన్ని ఖర్చులను కృత్రిమంగా పెంచి చూప‌డం మరియు ఉప-ఉత్పత్తి అమ్మకాలకు సంబంధించిన రశీదులను త‌క్కువ చేసి చూప‌డం వంటి వాటిని ఐటీ విభాగం కనుగొంది. ఇంకా, భూముల కొనుగోలు కోసం డబ్బు చెల్లించినట్లు ఆధారాలు కూడా కనుగొనబడ్డాయి. వ్యక్తిగత ఖర్చుల‌ను కంపెనీ పుస్తకాలలో బుక్ చేయడం, ప్ర‌భుత్వం నిర్ధారించిన దానికంటే త‌క్కువ‌కు, ఎస్ఆర్ఓ విలువ కంటే కూడా దిగువ‌కు వ్య‌క్తిగ‌తంగా భూముల‌ను కొనుగోలు చేయ‌డం వంటి వివిధ ఇతర చట్టపరమైన ఉల్లంఘ‌న‌ల‌ను కూడా ఐటీ శాఖ సోదాల‌లో గుర్తించింది. ఈ శోధన కార్య‌కాల‌పాల‌లో లెక్క‌ల్లో చూప‌ని దాదాపు రూ.400 కోట్ల సొత్తుకు సంబంధించిన వివిధ సాక్ష్యాలు ల‌భించాయి. ఇందులో దాదాపు రూ.350 కోట్ల‌కు సంబంధించిన
లావాదేవీల్ని అసెస్సీ గ్రూపు అంగీక‌రించిన‌ట్టుగా స‌మాచారం. ఈ సోదాల‌కు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొన‌సాగుతోంది.
                               

****



(Release ID: 1701870) Visitor Counter : 89