శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్‌లో ఉపయోగించడం కోసం అగోనిస్ట్ అణువు సమన్వయంలో సిఎస్ఐఆర్-ఐఐసిటి పాత్ర.
Posted On:
26 FEB 2021 11:38AM by PIB Hyderabad
అగోనిస్ట్ అనేది ఒక జీవ ప్రతిచర్యను ప్రేరేపించడానికి ఒక రిసెప్టర్‌ను బంధించి, ప్రేరేపించగల అణువు. అగోనిస్ట్‌లచే మధ్యవర్తిత్వం వహించే కార్యాచరణ యాంటగోనిస్ట్‌లకు వ్యతిరేకంగా ఉంటుంది. అది అగోనిస్ట్ చేత ప్రేరేపించబడిన జీవ ప్రతిస్పందనను నిరోధిస్తుంది. కావలసిన జీవ ప్రతిస్పందనను ప్రేరేపించడానికి అవసరమైన అగోనిస్ట్ స్థాయిని పొటెన్సీగా సూచిస్తారు.
కోవిడ్ -19 మహమ్మారి ఆరోగ్య సంరక్షణ రంగంలో మున్నెన్నడూ లేనంతటి మార్పులను తీసుకువచ్చింది. దీనితో సిఎస్ైఆర్‌కు చెందిన ఎన్నోపరిశోధన శాలలలు పరిశ్రమ భాగస్వామ్యంతో రీపర్పస్‌డ్ ఔషధాలకు సంబంధించి ఎన్నో పరిశోధనలు సాగించడంతోపాటు క్లినికల్ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. సిఎస్ఐఆర్ కూడా ఫెలూదా, డ్రై స్వాబ్, స ఆర్స్ - సిఒవి-2 స్ర్రీనింగ్‌కు డైరక్ట్ ఆర్‌టి-పిసిఆర్ పద్ధతి వంటి వాటిని ప్రవేశపెట్టేందుకు తమవంతు పాత్ర పోషించాయి.
మన దేశంలో ,కోవిడ్ -19 నివారణకు కోవాక్సిన్ వాక్సిన్ తయారీలో భారత్ బయొటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బిబిఐఎల్) అగ్రభాగాన నిలిచింది. ఈ వాక్సిన్‌ను ఆల్‌జెల్-ఐఎండిజి ఫార్ములేతో రూపొందించబడినది.బిబిఐఎల్ రూపొందించిన ఈ వాక్సిన్ అత్యంత పరిశుద్ధమైన,హోల్ విరియాన్, ఇన్‌యాక్టివేటెడ్ సార్స్ -సిఒవి2. ఈ వాక్సిన్‌ను యాల్‌జెల్ -ఐఎండిజి ఫార్ములేటెడ్. ఇందులో కెమిసార్‌బెడ్ టిఎల్ార్ 7బై 8 ఉంది.అలాగే ఇమ్యూన్ స్పందనకు సంబంధించి న ఏర్పాటు కూడా ఉంది. వాక్సిన్ రూపకల్పనలో టిఎల్ార్ 7 బై 8 ఆగోనిస్ట్ మాలిక్యూల్ పోషించే కీలక పాత్రను దృష్టిలో ఉ ంచుకుని సిఎస్ఐఆర్ పరిశోధన శాల అయిన హైదరాబాద్‌కు చెందిన ఐఐసిటి- ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీని బిబిఐఎల్ సంప్రదించింది. అగోనిస్ట్ అణువుకు సింథటిక్ మాలిక్యూల్‌ను దేశీయి రసాయనాలతో చవకధరకు రూపొందించాల్సిందిగా కోరింది. అదికూడా అత్యంత పరిశుద్ధతతో ఉండాలని కోరింది. ఈ అగోనిస్ట్ అణువు బిబిఐఎల్ అడ్జువాంట్ ఉత్పత్తిని పెద్దఎత్తున పెంచేందుకు దోహదపడింది.
ఈ ప్రాజెక్టుకు ఐఐసిటి డైరక్టర్ డాక్టర్ చంద్రశేఖర్, సీనియర్ శాస్త్రవేత్త చంద్రశేఖర్ నాయకత్వం వహించి నాలుగునెలల్లో రికార్డు సమయంలో పూర్తిచేశారు. సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త , ప్రోఫెసర్ (ఎసి సిఎస్ఐఆర్) డాక్టర్ మోహన కృష్ణ ముదియం, సిఎస్ఐఆర్-ఐఐసిటి బృందం ఇందులో కీలకపాత్ర పోషించారు. వీరు టిఆఎల్ార్7 బై 8 అగోనిస్ట్ మాలిక్యూల్, దాని మెథడ్ వాలిడేషన్ ప్రొసీజర్లను ఎన్.ఎ.బి.ఎల్ అక్రిడెటెడ్ ల్యాబ్‌ల ద్వారా పరీక్షింపచేయడంలో కీలక పాత్ర పోషించారు.
సిఎస్ఐఆర్-ఐఐసిటిలు కొత్త అగోనిస్ట్ అభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసిస్తూ భారత్ బయోటెక్ ఛైర్మెన్, మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా, సిఎస్ఐఆర్ -ఐఐసిటి అగోనిస్ట్ మాలిక్యూల్ కోసం అభివృద్ధిచేసిన టెక్నాలజీ కోవాక్సిన్ అడ్జువెంట్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించింది. సిఎస్ఐఆర్ డిజి డాక్టర్ శేఖర్ మందే, సెక్రటరీ , సిఎస్ఐఆర్ ,లు సిఎస్ఐఆర్-ఐఐసిటిలు చవక ధరలో వాక్సిన్ అందుబాటులోకి వచ్చే ప్రక్రియను అభివృద్ధిచేసినందుకు అభినందించారు. అలాగే రికార్డు సమయంలో అగోనిస్ట్ మాలిక్యూల్‌ను అభివృద్ది చేసినందుకు అభినందిస్తూ, ఆత్మనిర్భర్ భారత్‌కు సిఎస్ ఐ ఆర్ మరింత కట్టుబడి ఉందనడానికి ఇది నిదర్శనమన్నారు.
***
(Release ID: 1701494)
Visitor Counter : 105