వ్యవసాయ మంత్రిత్వ శాఖ
'ఒక జిల్లా.. ఒకే వ్యవసాయోత్పత్తిపై దృష్టి సారింపు' కోసం ఉత్పత్తులను ఖరారు చేసిన వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ
- ఓడీఓఎఫ్‌పీ అమలు రైతులకు ప్రయోజనం చేకూర్చి వ్యవసాయ ఎగుమతుల్ని పెంచుతుంది
Posted On:
27 FEB 2021 1:10PM by PIB Hyderabad
కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖతో సంప్రదించి 'ఒక జిల్లా.. ఒకే వ్యవసాయోత్పత్తిపై దృష్టి సారింపు' (ఓడీఓఎఫ్‌పీ) విధానం కోసం ఉత్పత్తులను ఖరారు చేసింది.
దేశ వ్యాప్తంగా 728 జిల్లాలకు సంబంధించి వ్యవసాయ, ఉద్యాన, పశువులు, పౌల్ట్రీ, పాలు, మత్స్య, ఆక్వాకల్చర్, సముద్ర రంగాలకు సంబంధించిన ఉత్పత్తుల్ని ఇందులో గుర్తించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) సంస్థల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఈ ఉత్పత్తుల జాబితా ఖరారు చేయబడింది. ఈ ఉత్పత్తులను క్లస్టర్ విధానంలో భారత ప్రభుత్వ పథకాల కలయిక ద్వారా, ఉత్పత్తుల విలువను పెంచడానికి, రైతు ఆదాయాన్ని పెంచే తుది లక్ష్యంతో ప్రోత్సహించబడతాయి. ప్రమోటర్ మరియు సూక్ష్మ సంస్థలకు ప్రోత్సాహకాలను అందించే కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీఎం-ఎఫ్ఎంఈ పథకం కింద.. ఈ గుర్తించబడిన ఉత్పత్తులకు మద్దతు ఉంటుంది. అనేక ఉత్పత్తుల ఎంపికలో వనరుల కలయిక మరియు ఇతర డిపార్ట్‌మెంట్‌ల విధానం కూడా సమీకృతమై ఉంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాలైన ఎంఐడీహెచ్, ఎన్ఎఫ్ఎస్ఎం, ఆర్‌కేవీవై, పీకేవీవైల నుంచి మద్దతునిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఓడీఓఎఫ్‌పీలు అమలు చేయడం వల్ల అన్నదాతలకు తగు ప్రయోజనం చేకూరుతుంది. వ్యవసాయోత్పత్తుల విలువ పెరుగుదల అంచనాల్ని గ్రహించడానికి, తరువాత సాగు ఎగుమతులను పెంచడానికి తోడ్పడుతుంది.
జిల్లాలకు ఎంపిక చేసిన ఉత్పత్తులు;
1. వరి - 40 జిల్లాలు
2. గోధుమలు - 5 జిల్లాలు
3. ముతక, పోషక ధాన్యాలు - 25 జిల్లాలు
4. పప్పుధాన్యాలు - 16 జిల్లాలు
5. వాణిజ్య పంటలు - 22 జిల్లాలు
6. నూనె గింజలు - 41 జిల్లాలు
7. కూరగాయలు - 107 జిల్లాలు
8. మసాల, సుగంధ ద్రవ్యాలు - 105 జిల్లాలు
9. తోటల పెంపకం - 28 జిల్లాలు
10. పండ్ల పెంపకం - 226 జిల్లాలు
11. పూల పెంపకం - 2 జిల్లాలు
12. తేనె సేకరణ - 9 జిల్లాలు
13. పశుసంవర్ధక / పాల ఉత్పత్తులు - 40 జిల్లాలు
14. చేపల పెంపకం/ మెరైన్ ఫిషరీస్ - 29 జిల్లాలు
15. ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు - 33 జిల్లాలు
******
(Release ID: 1701456)
Visitor Counter : 291