సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
కొత్త మైలురాయిని చేరిన ఖాదీ ఈ-మార్కెట్ పోర్టల్;
స్వదేశీ నినాదానికి ఇది గొప్ప ఊపు
Posted On:
27 FEB 2021 2:41PM by PIB Hyderabad
ఆన్ లైన్ మార్కెటింగ్ రంగంలోకి చొచ్చుకుపోతున్న ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ (కె.వి.ఐ.సి.) క్రమంగా అద్భుతమైన ప్రజాదరణను చూరగొంటోంది. ఆన్ లైన్ లో ప్రవేశపెట్టిన ఖాదీ పరిశ్రమల ఈ-పోర్టల్ (www.khadiindia.gov.in),.. ప్రారంభమైన తొలి 8 నెలల్లోనే స్థూలంగా కోటీ 12లక్షల రూపాయలమేర టర్నోవర్ సాధంచడం ఈ పోర్టల్ సాధించిన ప్రజాదరణకు సాక్ష్యంగా చెప్పవచ్చు.
గత ఏడాది జూలై 7వ తేదీన ప్రారంభమైన ఈ ఖాదీ పోర్టల్.ను ఇప్పటివరకూ, 65వేలమంది ఖాతాదారులు సందర్శించగా, వారిలో పదివేలమంది కొనుగోలు ఆర్టర్లను ఈ పోర్టల్ బట్వాడా చేసింది. ఈ పోర్టల్ ద్వారా కె.వి.ఐ.సి. ఇప్పటివరకూ లక్షకు పైగా వస్తువులను, సరకులను బట్వాడా చేసింది. ఇదే కాలంలో ఒక్కొక్క ఖాతాదారు ఆన్ లైన్ ద్వారా చేసిన సగటు కొనుగోలు విలువ రూ. 11,000గా నమోదైంది. ఖాదీ ఉత్పాదనలకు ఎప్పటికప్పడు ప్రజాదరణ పెరుగుతున్నదనడాని ఇది నిదర్శనంగా నిలుస్తోంది. అలాగే, అన్ని విభాగాల కొనుగోలుదార్ల అభిరుచులకు అనుగుణమైన ఖాదీ ఉత్పత్తుల సరఫరాకు కూడా ఇది సూచనగా చెప్పవచ్చు.
ఖాదీ ఈ-పోర్టల్: ముఖ్యాంశాలు (26-02-2021నాటికి అందిన లెక్కల ప్రకారం)
ఖాదీ
ఈ–పోర్టల్ ప్రారంభం
|
|
8 నెలల్లో స్థూలంగా ఆన్ లైన్ అమ్మకాలు
|
కోటీ 12లక్షల రూపాయలు
|
8 నెలల్లో ఆర్డర్ల సంఖ్య
|
10,100
|
ఈ పోర్టల్ సందర్శకుల సంఖ్య
|
65,000
|
సగటును ఒక్కో ఖాతాదారుకు జరిగిన ఉత్పాదనల అమ్మకం విలువ
|
రూ. 11,000
|
ఆర్డర్ల ద్వారా పంపించిన మొత్తం సరకుల పరిమాణం
|
1,00,600
|
ఒక్కో ఆర్డర్.కు సగటు పరిమాణం
|
10
|
ఆన్ లైన్ జాబితాలో ఉత్పాదనల సంఖ్య
|
800
|
అత్యధికంగా చెప్పదగిన విక్రయం విలువ
|
లక్షా 25వేల రూపాయలు
|
ఎక్కువగా ఆర్డర్స్ అందుకున్న రాష్ట్రాలు
|
మహారాష్ట్ర (1,785) ఢిల్లీ (1,584)
ఉత్తరప్రదేశ్(1,281)
|
ఆన్ లైన్ ద్వారా ఎక్కువగా అమ్ముడుపోయిన సరకులు, ఉత్పాదనలు
|
ఖాదీ మాస్కులు, తేనె, మూళికా సబ్బులు, కిరణా సరకులు, సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, అగరబత్తీలు.
|
ఈ కామర్స్ రంగంలో ఖాదీ ఉత్పాదనల వాణిజ్యం విజయంవంతం కావడం అభినందనీయమని కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్యతరహా సంస్థలు (ఎం.ఎస్.ఎం.ఇ.), రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. విభిన్నమైన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పాదనలను మరింత ఎక్కువ మంది ప్రజలకు చేరవేయడానికి విస్తృతమైన మార్కెటింగ్ వేదికను ఈ కామర్స్ అందించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఖాదీ ఉత్పాదనల ఈ మార్కెటింగ్ ప్రక్రియ, ఖాదీ గ్రామీణ పరిశ్రమలో పెనుమార్పులకు రుజువుగా నిలిచిందని, ఈ రంగంలో రూ. 200కోట్ల మేర వార్షిక టర్నోవర్ సాధించేందుకు కృషి జరగాల్సి ఉందని ఆయన అన్నారు.
ఈ-పోర్టల్ ను కె.వి.ఐ.సి. సొంతంగానే రూపొందించుకుంది. ఈ పోర్టల్ రూపకల్పనకు ఒక్కరూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇతర ఆన్ లైన్ పోర్టల్స్ తో పోల్చుకుంటే, కె.వి.ఐ.సి. ఈ-పోర్టల్ ఎంతో విభిన్నమైనది. ఈ పోర్టల్ కు సంబంధించి మౌలిక సదుపాయాల పరంగా అన్ని రకాల మద్దతును కె.వి.ఐ.సి.నే అందించింది. ఆన్ లైన్ లో ప్రదర్శించే ఉత్పాదనల ఫొటో షూట్, వాటి వర్గీకరణ, సరకుల ఆన్ లైన్ జాబితా నిర్వహణ, సరకుల ప్యాకేజీ, ఖాతాదారుల ముంగిటికి సరకుల రవాణా వంటి అంశాలన్నింటినీ కె.వి.ఐ.సి. స్వయంగా చూసుకుంది. దీనితో ఖాదీ ఉత్పత్తిదారులు, సంస్థలు, ఖాదీ ఉత్పాదలను తయారు చేసే ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం (పి.ఎం.ఇ.జి.పి.) యూనిట్లు వంటి వాటిపై ఎలాంటి ఆర్థికభారం పడకుండా చూసుకునేందుకు ఇది దోహదపడింది.
ఖాదీ ఈ-పోర్టల్ నిర్వహణకు సంబంధించిన అన్ని ఖర్చులనూ కె.వి.ఐ.సి.నే స్వయంగా భరించిందని కె.వి.ఐ.సి. చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా చెప్పారు. ఇతర ఈ-కామర్స్ వెబ్.సైట్ల విషయంలో ఉత్పాదనల కేటలాగు తయారీ, ప్యాకేజింగ్, ఖాతాదారులకు పంపించడం వంటి అంశాలన్నింటికీ ఆయా విక్రయ సంస్థలే బాధ్యత వహిస్తుండగా, ఈ విషయంలో కె.వి.ఐ.సి. మాత్రం విభిన్నమైన విధానాన్ని అనుసరించిందన్నారు. ఖాదీ పారిశ్రామిక సంస్థలు, పి.ఎం.ఇ.జి.పి. సంస్థలపై మౌలిక సదుపాయాల కల్పన రూపంలో కూడా ఎలాంటి ఆర్థిక భారం పడకూడదన్న పద్ధతిని కె.వి.ఐ.సి. అనుసరించిందని, దీనితో చాలా మొత్తంలో డబ్బు ఆదా అయిందని సక్సేనా చెప్పారు. స్వదేశీ నినాదానికి ఖాదీ ఈ-పోర్టల్ పెద్ద ఊపునిచ్చిందని, దీనితో ఖాదీ ఉత్పత్తి దారులు, కళాకారులు తమ ఉత్పత్తులను విక్రయించుకోవడానికి అదనపు వేదిక అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ఖాదీపట్ల ప్రజలు తమ అభిమానాన్ని చాటుకొనేందుకు, ఆత్మనిర్భర భారత్ నినాదాన్ని సాకారం చేసుకునేందుకు ఇది దోహదపడిందని ఆయన అన్నారు.
కోవిడ్-19 వ్యాప్తితో తలెత్తిన లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో, కేవలం ఖాదీ మాస్కుల అమ్మకంతో మొదలైన ఈ వాణిజ్యం దాదాపు 800రకాల ఉత్పాదనలతో పూర్తి స్థాయి ఈ-మార్కెట్ వేదికగా రూపాంతరం చెందింది. చేతిలో అల్లిన, చేతితో నేసిన మేలిరకం ముస్లిన్, పట్టు, డెనిమ్, నూలు, విచార్ వస్త్ర వంటి ఉత్పాదనలు, ట్రెండ్ గా మారిన మోదీ కుర్తా, జాకెట్లు, ఖాదీ గుర్తుతో కూడిన చేతి గడియారాలు, విభిన్నరకాల తేనెలు, హెర్బల్ టీ, గ్రీన్ టీ, మూలికా మందులు, సబ్బులు, అప్పలాలు, గానుగపట్టిన ఆవనూనె, ఆవు పేడ/గోమూత్రం సబ్బులు, వివిధ రకాల మూలికా సౌందర్య ఉత్పాదనలు, తదితర ఉత్పత్తులను ఇప్పుడు ఈ-పోర్టల్ వాణిజ్యం పరిధిలోకి వచ్చాయి.
ఖాదీ వస్త్రంతో తయారీన విభిన్నమైన పాదరక్షలు, సృజనాత్మకమైన ఖాదీ ప్రాకృతిక రంగులు, వారసత్వంగా వచ్చిన మోంగ్పా చేతి తయారీ కాగితం వంటివి కూడా ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. అన్ని వర్గాల కొనుగోలుదార్ల ఎంపికను, కొనుగోలు శక్తిని దృష్టిలో ఉంచుకుని ఈ ఆన్ లైన్ ఉత్పాదనల ధరను 50 రూపాయలనుంచి 500రూపాయలవరకూ నిర్ణయించారు.
ఈ ఉత్పాదనలకు సంబంధించి, దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాలనుంచి కె.వి.ఐ.సి.కి ఆన్ లైన్ ద్వారా కొనుగోలు ఆర్డర్లు లభిస్తూనే ఉన్నాయి. ఎక్కడో సుదూరాన ఉన్న అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, తదితర రాష్ట్రాలతో సహా దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి కె.వి.ఐ.సి.కి కొనుగోలు ఆర్డర్లు అందుతున్నాయి.
****
(Release ID: 1701432)
Visitor Counter : 248