ఆర్థిక మంత్రిత్వ శాఖ
మౌలికసదుపాయాల భవిష్యత్ మార్గసూచికి సంబంధించి బడ్జెట్ అనంతర కార్యాచరణపై జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్.
Posted On:
26 FEB 2021 3:35PM by PIB Hyderabad
కేంద్ర ఆర్ధిక , కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈరోజు నీతి ఆయోగ్ సిఇఒ, 22 మౌలిక సదుపాయాల మంత్రిత్వశాఖలు, విభాగాల కార్యదర్శులతో , ఎన్.ఐ.పిల అమలుతోపాటు మౌలిక సదుపాయాల భవిష్యత్ మార్గ సూచికి సంబధించిన కార్యాచరణ అంశాలపై వర్చువల్ సమావేశంలో చర్చించారు.కోవిడ్ అనంతరం ఆర్థిక వ్యవస్థ సత్వరం పుంజుకునేందుకు జాతీయ మౌలికసదుపాయాల పైప్‌లైన్ (ఎన్ఐపి), మౌలిక సదుపాయాల రంగాల ప్రాధాన్యత గురించి జరిగిన మూడవ సమీక్షా సమావేశం ఇది.
ప్రపంచవ్యాప్తంగా దేశాలు కోవిడ్ -19 మహమ్మారి కారణంగా సవాళ్లను ఎదుర్కొంటున్న దశలో ఎన్.ఐ.పి చెప్పుకోదగిన పురోగతిని సాధించడంపై ఈ సమావేశంలో చర్చించారు.
6,835 ప్రాజెక్టులను ఎన్.ఐ.పి ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు పైప్‌లైన్‌ను సుమారు 7,600 ప్రాజెక్టులకు విస్తరించారు. 2021 ఆర్ధిక సంవత్సరం రెండు , మూడు త్రైమాసికాలలో వివిధ మంత్రిత్వశాఖలకు సంబంధించిన మౌలికసదుపాయాల ప్రాజెక్టులలో ఇది పురోగతిని కనబరచింది. ఇది 2020 ఆర్థికసంవత్సరంతో పోల్చినపుడు2021 ఆర్ధిక సంవత్సరంలో పలు మంత్రిత్వశాఖలకు సంబంధించిన మౌలికసదుపాయాల వ్యయం గణనీయంగా పెరుగుదలకు దోహదపడింది.2021 ఆర్ధిక సంవత్సరం మూడోత్రైమాసిక పూర్తి అయ్యేనాటికి భారత ప్రభుత్వ మౌలికసదుపాయాల మంత్రిత్వశాఖల కింద 216 ప్రాజెక్టులకు సంబంధించి రూ 74,067 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగింది. సుమారు 6 లక్షల కోట్ల రూపాయల విలువగల సుమారు 678 ప్రాజెక్టులు ప్రాజెక్టు ఫార్ములేషన్, అమలు విషయంలో 2021 ఆర్ధిక సంవత్సరంలో దిగువ స్థాయి నుంచి ఎగువ స్థాయికి చేరుకున్నాయి. అయినప్పటికీ వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాలు ఎన్.ఐ.పి లక్ష్యాలను సాధించడానికి మరింత గట్టి కృషి కొనసాగించాల్సి ఉంది.
నీతి ఆయోగ్ సిఇఒ అసెట్ మానిటైజేషన్‌పై ప్రెజెంటేషన్ ఇచ్చారు. అలాగే కీలక మౌలికసదుపాయాల ఆస్తులకుసంబంధించి వివిధ మానిటైజేషన్ నమూనాలను ఈసందర్భంగా చర్చించారు. అలాగే అసెట్ మానిటైజేషన్‌కు సంబంధించి లక్ష్యాలను ఖరారు చేయడం గురించి మాట్లాడారు. ఎన్.ఐ.పిపై వివిధ మంత్రిత్వశాఖలు ,విభాగాల పనితీరును సమీక్షిస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, కోవిడ్ అనంతర పరిస్థితులలో ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి ఎన్.ఐ.పి కీలక పాత్ర పోషించనున్నట్టు స్పష్టం చేశారు.ఎన్.ఐ.పి లక్ష్యాలకు మించి ఫలితాలు సాధించేందుకు వివిధ మంత్రిత్వశాఖలు , విభాగాలు పనిచేయాల్సిందిగా ఆమె కోరారు.
ఎన్.ఐ.పి అనేది కేవలం కేంద్ర ప్రభుత్వ బడ్జెటరీ వ్యవయం మాత్రమే కాదు. ఇందులో రాష్ట్రాలు, ప్రైవేటు రంగం వ్యయం కూడా ఇమిడి ఉంది. ఇందులో అదనపు బడ్జెట్ వనరులనుంచి ఖర్చుకూడా ఇమిడి ఉంది. అందువల్ల మంత్రిత్వశాఖలు, విభాగాలు వినూత్న స్ట్రక్చరింగ్, ఫైనాన్సింగ్ ద్వారా ప్రాజెక్టు ఫండింగ్ పొందేందుకు చురుకుగా కృషిచేయాలి. అలాగే ప్రైవేటు రంగం మౌలికసదుపాయాల పై పెద్ద ఎత్తున ఖర్చు చేసేందుకు మద్దతు నివ్వాలి. వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాలుతగిన ప్రాజెక్టుల కోసం పిపిపి పద్ధతికి అన్వేషించాలి. అలాగే పిపిపి పద్ధతిలో చేయడానికి వీలులేని మౌలికసదుపాయాల ప్రాజెక్టులపై ప్రభుత్వ నిధులను వినియోగింప చేయాలి. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఎంసిఎలను అప్‌డేట్ చేయాలని, వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ నీతిఆయోగ్‌కు సూచించారు.
ఎన్.ఐ.పి అమలు, ఎన్ఐపి పోర్టల్‌లొ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం,ఎన్.ఐ.పి ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడం వంటి విషయాలలో వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల కార్యదర్శులు పూర్తి స్థాయిలో, వ్యక్తిగత శ్రద్ధ చూపాల్సిందిగా ఆమె వారిని కోరారు.
***
(Release ID: 1701222)
Visitor Counter : 207