మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

భవిష్యత్ యువతదే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిషాంక్'

నాడు పోస్టు చేయడమైనది: 25 FEB 2021 3:57PM by PIB Hyderabad

21వ శతాబ్ద అవసరాలకు అనుగుణంగా విద్యారంగంలో మార్పులు తీసుకుని రావాలన్న లక్ష్యంతో నూతన విద్యా విధానానికి రూపకల్పన చేశామని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ  రమేష్ పోఖ్రియాల్ 'నిషాంక్' అన్నారు. ఉన్నత లక్ష్యాలతో కేంద్రం రూపొందించిన నూతన విద్యావిధానం అమలులో ప్రైవేట్ రంగం కీలక పాత్రపోషిస్తుందని మంత్రి తెలిపారు. ఈ రోజు ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన 16వ ఉన్నత విద్యాసదస్సులో మంత్రి ప్రారంభ ఉపన్యాసం చేశారు. భారత్ వాణిజ్య మండళ్లు పరిశ్రమ సమాఖ్య ( ఫిక్కీ) సదస్సును వర్చ్యువల్ విధానంలో ' ఉన్నత విద్య@ 2030  స్థితిస్థాపకత, వినూత్నత, సుస్థిరత, సంస్థాగత (ఆర్ఐఎస్ఈ)' అనే అంశంపై సదస్సును నిర్వహిస్తున్నారు. 

సదస్సులో మాట్లాడిన మంత్రి అందరికి సమానంగా అందుబాటులో పారదర్శకంగా ఉండాలన్న నాలుగు లక్ష్యాలతో నూతన విద్యావిధానం 2021కి రూపకల్పన చేశామని వివరించారు.' భారతదేశాన్ని  జ్ఞానభాండాగారంగా రూపొందాచాలన్నది మా లక్ష్యం. విజ్ఞాన రంగంలో భారతదేశం తిరుగులేని సూపర్ పవర్ గా ఆవిర్భవించడానికి దోహదపడేవిధంగా విద్యావిధానానికి రూపకల్పన చేశాం' అని మంత్రి వివరించారు. 

21వ శతాబ్దంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం రానున్న 20-30 సంవత్సరాలలో భారత యువశక్తి సహకారంతో అభివృద్ధి సాధించడానికి పథకాలను రూపొందించిందని ఆయన వివరించారు. 21వ శతాబ్దంలో భారతదేశం పరిశోధన అభివృద్ధి రంగాలలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటుందని మంత్రి అన్నారు. వ్యయ అంశాలు మాత్రమే కాకుండా దేశంలో అపారంగా లభిస్తున్న మానవవనరులు దేశాన్ని అగ్రస్థానంలో నిలుపుతాయని మంత్రి అన్నారు. 

ఉన్నత విద్యపై సదస్సును నిర్వహించిన ఫిక్కీని శ్రీ రమేష్ పోఖ్రియాల్ అభినందించారు. సదస్సులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో విద్యారంగంతో సంబంధంవున్నవారు, విద్యావంతులు, విధానరూపకర్తలు, పరిశ్రమలు, విద్యార్థులు ఒకే వేదిక మీద తమ అనుభవాలను పంచుకోవడానికి అవకాశం కలుగుతుందని మంత్రి అన్నారు. 

సదస్సులో ' భారతదేశంలో ఉన్నతవిద్య: విజన్ 2040' పై ఫిక్కీ రూపొందించిన నివేదికను విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్య 4.0ని ప్రస్తావిస్తూ ఉన్నత విద్యారంగంలో వస్తున్న మార్పులను, ప్రపంచదేశాలతో అమలు జరుగుతున్న విధానాలను పొందుపరిచారు. 

 

కార్యక్రమంలో  నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్ మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఛాన్సలర్ డాక్టర్ ఆర్ ఎ మషెల్కర్, ఫిక్కీ ఉన్నత విద్యా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ విద్యా యరవ్‌దేకర్, ఫిక్కీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ మరియు ఫిక్కీ సెక్రటరీ జనరల్ దిలీప్ చెనోయ్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 1700820) సందర్శకుల సూచీ సంఖ్య : : 232
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Punjabi