రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

రూ.13,700 కోట్ల విలువైన ప్రతిపాదనలకు డీఏసీ ఆమోదం

Posted On: 23 FEB 2021 5:03PM by PIB Hyderabad

 

ర‌క్ష‌ణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) వివిధ ర‌కాల ఆయుధాలు/ ప‌్లాట్‌ఫార‌మ్‌లు/ పరికరాలు/ మూలధన సముపార్జన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ల‌కు అవ‌స‌ర‌మైన వ్యవస్థల‌కు అవ‌స‌ర‌మైన వివిధ ర‌కాల ఆయుధాలు/ ప‌్లాట్‌ఫార‌మ్‌లు/ పరికరాలు/ మూలధన సముపార్జన త‌దిత‌ర‌ ప్రతిపాదనలకు డీఏసీ ఫిబ్రవరి 23, 2021న న్యూ ఢిల్లీలో ఆమోదం తెలిపింది. మొత్తంగా రూ.13,700 కోట్ల రూపాయల చొప్పున మూడు అంగీకార అవసరాల‌కు (ఏఓఎన్‌లు) అనుమ‌తులు ఇవ్వబడ్డాయి. అన్ని ఏఓఎన్‌లు డిఫెన్స్ అక్విజిషన్ అంటే.. కొనడం [ఇండియన్- ఐడీడీఎమ్ (స్వదేశీ రూపకల్పన మ‌రియు అభివృద్ధి, తయారీ)] అత్యధిక ప్రాధాన్యత గల విభాగంలో ఉన్నాయి.
ఈ సముపార్జన ప్రతిపాదనలన్నీ మ‌న దేశీయంగా రూపకల్పన చేసి, అభివృద్ధి చేయబడతాయి, తయారు చేయబడతాయి. వీటిలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) రూపొందించిన మ‌రియు అభివృద్ధి చేసిన ఇంటర్-అలియా ప్లాట్‌ఫాంలు మరియు వ్యవస్థలు ఉన్నాయి. ప్రభుత్వం యొక్క ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను స‌కాలంలో చేరువ‌య్యేందుకు గాను రక్షణ సేకరణ ప్రక్రియ, మ‌రియు వేగంగా నిర్ణయం తీసుకోవడానికి గాను మూలధన సముపార్జన కోసం తీసుకున్న సమయాన్ని తగ్గించడానికి ఒక క్రమ పద్ధతిలో పనిచేసే దిశ‌గా ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డ‌మైంది. మూలధన సముపార్జన కోసం తీసుకున్న సమయాన్ని తగ్గించే దిశ‌గా క్రమ పద్ధతిలో పనిచేయ‌డానికి, డీ అండ్ డీ కేసులు మినహా అన్ని మూలధన సముపార్జన ఒప్పందాలు (అప్పగించిన మరియు నాన్-డెలిగేటెడ్) రెండేళ్లలో ముగిసేలా డీఏసీ ఆమోదం తెలిపింది. మంత్రిత్వ శాఖ, సేవలు మరియు ఇత‌ర‌ వాటాదారులతో సంప్రదించి, దానిని సాధించడానికి వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికను తీసుకువస్తుంది.
                               

***



(Release ID: 1700349) Visitor Counter : 259