ప్రధాన మంత్రి కార్యాలయం

అస‌మ్ లో ముఖ్య‌మైన చ‌మురు & గ్యాస్ ప్రాజెక్టు లను, ఇంజినీరింగ్ క‌ళాశాల లను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 22 FEB 2021 2:07PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమ‌వారం నాడు అసమ్ లో ఇండియ‌న్ ఆయిల్ కు చెందిన బొంగాయీగాఁవ్ రిఫైన‌రీ లో ఇండ్ మాక్స్ యూనిట్ ను, డిబ్రూగఢ్ లోని మధుబన్ లో ఆయిల్ ఇండియా లిమిటెడ్ కు చెందిన సెంక‌డ‌రీ ట్యాంక్ ఫార్మ్ ను దేశానికి అంకితం చేశారు.  అలాగే, ధేమాజీ తిన్‌సుకియా లోని మ‌కుమ్ ప‌రిధి లో గ‌ల హేబ్ డా గ్రామం లో ఒక గ్యాస్ కంప్రెశర్ స్టేశన్ ను కూడా ఆయ‌న దేశానికి అంకితం చేశారు.  అస‌మ్ లోనే ధీమాజీ ఇంజినీరింగ్ క‌ళాశాల ను ఆయ‌న ప్రారంభించడం తో పాటు సువాల్ కుచీ ఇంజినీరింగ్ క‌ళాశాల కు  శంకుస్థాప‌న కూడా చేశారు.

ఈ కార్య‌క్ర‌మం లో అస‌మ్ గ‌వ‌ర్న‌ర్ ప్రొఫెస‌ర్ జగదీశ్ ముఖీ, అసమ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, పెట్రోలియం & సహజ వాయువు శాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర ఫూడ్ ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ‌ల‌ శాఖ సహాయ మంత్రి రామేశ్వ‌ర్ తేలీ లు కూడా పాల్గొన్నారు.
   
ఈ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌జ‌ల ను ఉద్దేశించి మాట్లాడుతూ, దేశ ఈశాన్య ప్రాంతం భార‌త‌దేశాన నూత‌న వృద్ధి చోద‌క శ‌క్తి లా మారుతుంద‌ని, అసమ్ ప్ర‌జ‌ల ను దృష్టి లో పెట్టుకొని మ‌రింత‌గా పాటుప‌డేందుకు త‌న‌లో ప్రేర‌ణ క‌లిగింద‌న్నారు.  బ్ర‌హ్మ‌పుత్ర ప్రాంతంలో నార్త్ బ్యాంక్ ఎనిమిది ద‌శాబ్దాల క్రితం  జోయీమోతీ చిత్రం ద్వారా అస్సామీ సినిమా కు ఏ విధంగా అయితే అంకురార్ప‌ణ చేసిందీ ఆయ‌న గుర్తు కు తెచ్చారు.  ఈ ప్రాంతం అస‌మ్ సంస్కృతి కి గ‌ర్వ‌కార‌ణంగా నిల‌చిన ఎంతో మంది ప్ర‌ముఖుల కు నిల‌యంగా ఉంద‌న్నారు.  అస‌మ్ లోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ల‌సి ప‌ని చేస్తున్నాయ‌ని, దీనికి ముఖ్యాధారం గా రాష్ట్రం లో నెల‌కొన్న మౌలిక స‌దుపాయాలు ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు.

ప్ర‌తిప‌క్షాల ను ప్ర‌ధాన‌ మంత్రి విమ‌ర్శిస్తూ, నార్త్ బ్యాంక్ లో గొప్ప అవ‌కాశాలు ఉన్న‌ప్ప‌టికీ ఇదివ‌ర‌క‌టి ప్ర‌భుత్వాలు ఈ ప్రాంతం పట్ల స‌వ‌తి త‌ల్లి వలె ప్ర‌వ‌ర్త‌ించాయని, సంధానం, ఆసుప‌త్రులు, విద్య సంస్థ‌లు, ప‌రిశ్ర‌మ‌ల తాలూకు అవసరాలకు ప్రాధాన్య క్ర‌మాన్ని నిర్దేశించ‌లేదు అన్నారు.  ప్ర‌భుత్వం ‘సబ్‌ కా సాథ్‌, స‌బ్‌ కా వికాస్‌, స‌బ్‌ కా విశ్వాస్’ సిద్ధాంతం తో ప‌ని చేస్తోంద‌ని, ఇలాంటి వివ‌క్ష‌ణ‌ ను అధిగ‌మించ‌డం జ‌రింద‌న్నారు.   ప్ర‌భుత్వం ప్రారంభించినటువంటి మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌ ను గురించి ఆయ‌న ఒక్కటొక్కటిగా  ప్ర‌స్తావించారు.  

శ‌క్తి, విద్య‌, మౌలిక‌ రంగాలలో ఈ ప్రాంతం లో3,000 కోట్ల రూపాయ‌ల‌ కు పైగా విలువైన  ప్రాజెక్టుల నుఈ రోజు న‌ ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న అన్నారు.  ఈ ప్రాంతానికి ఉన్న శ‌క్తి కేంద్రం, విద్య కేంద్రం అనేటటువంటి గుర్తింపు ను ఈ ప్రాజెక్టు లు బ‌లోపేతం చేస్తాయ‌ని, అంతేకాకుండా అస‌మ్ కు ఒక సంకేతం గా కూడా నిలుస్తాయ‌ని ఆయ‌న అన్నారు.

భార‌త‌దేశం తన శక్తి, ని, తన సామర్థ్యాలను పెంచుకోవడానికని స్వ‌యంసమృద్ధి దిశ గా నిరంతరం పయనిస్తూనే ఉండవలసిన అవసరం ఎంతయినా ఉందని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.  గ‌త కొన్నేళ్ళుగా భార‌త‌దేశం చ‌మురు శుద్ధి సామ‌ర్ధ్యం, ప్ర‌త్యేకించి బొంగాయీగాఁవ్ రిఫైన‌రీ సామ‌ర్ధ్యం గొప్ప‌ గా పెరిగింద‌ని ఆయ‌న అన్నారు.

ఈ రోజు న ప్రారంభించిన గ్యాస్ యూనిట్ ప్లాంటు ఎల్‌ పిజి ఉత్ప‌త్తి సామ‌ర్ధ్యాన్ని పెంచుతుంద‌ని, ఇది అస‌మ్ ప్ర‌జ‌ల‌, ఈశాన్య ప్రాంత ప్ర‌జ‌ల జీవ‌నాన్ని స‌ర‌ళ‌త‌రంగా మార్చగలద‌న్నారు.  ఇది ఈ ప్రాంతం లో యువ‌త కు ఉద్యోగ అవ‌కాశాల ను కూడా పెంచుతుంద‌న్నారు.

పేద సోద‌రీమ‌ణులు, పుత్రిక‌లు వారి వంటిళ్ళ లో క‌ట్టెల‌ ను కాల్చినందువ‌ల్ల వ‌చ్చే పొగ తాలూకు ఇబ్బందుల బారి నుంచి వారిని ర‌క్షించ‌డం కోసం ఉజ్జ్వ‌ల ప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చింద‌ని ఆయ‌న అన్నారు.  ప్ర‌స్తుతం అస‌మ్ లో గ్యాస్ సంధానం దాదాపు 100 శాతానికి చేరుకొంద‌న్నారు.  ఒక కోటి మంది పేద సోద‌రీమ‌ణుల కు ఉచితంగా ఉజ్జ్వ‌ల ఎల్‌ పిజి క‌నెక్ష‌న్ ను అందించేందుకు కేంద్ర బ‌డ్జెటు లో ఈ సారి ఒక ప్ర‌తిపాద‌న‌ ను తీసుకు రావ‌డం జ‌రిగింద‌న్నారు.

గ్యాస్ క‌నెక్ష‌న్‌, విద్యుత్తు క‌నెక్ష‌న్‌, ఎరువులు అందుబాటు లో లేనందువ‌ల్ల ఎక్కువ‌గా క‌ష్ట‌న‌ష్టాల పాల‌య్యేది పేద ప్ర‌జ‌లేన‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాత ఏడు ద‌శాబ్దాలు గ‌డ‌చిపోయిన‌ప్ప‌టికీ విద్యుత్తు సౌక‌ర్యానికి నోచుకోని 18,000 ప‌ల్లెల లో ఎక్కువ భాగం పల్లెలు అస‌మ్‌, ఈశాన్య ప్రాంతాలలోనే ఉన్నాయని, దీనిని స‌రిదిద్ద‌డం కోసం ప్ర‌భుత్వం కృషి చేసింద‌ని ఆయ‌న అన్నారు.

ఈ ప్రాంతం లోని ఎరువుల ప‌రిశ్ర‌మ‌లు అనేకం గ్యాస్ ల‌భించ‌క అయితే మూత‌ప‌డ‌ట‌మో లేదా ఖాయిలా గా ప్ర‌క‌టించ‌బ‌డ‌ట‌మో జ‌రిగింద‌ని, దీని ద్వారా పేద‌లు, ఆప‌న్నులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి బాధితులు అయ్యార‌ని ఆయ‌న అన్నారు.

భార‌త‌దేశం లోని తూర్పు ప్రాంతాల‌ ను ప్ర‌ధాన మంత్రి ఊర్జా గంగా యోజ‌న లో భాగం గా ప్ర‌పంచంలోకెల్లా అతిపెద్ద‌దైన‌టువంటి గ్యాస్ గొట్ట‌పు మార్గ నెట్ వ‌ర్క్ ల‌లో ఒక నెట్ వ‌ర్క్ తో క‌ల‌ప‌డం జ‌రుగుతోంద‌ని శ్రీ మోదీ వివ‌రించారు.

ఆత్మనిర్భ‌ర్ భార‌త్ కు ఉత్తేజాన్నిఇవ్వ‌డం లో మ‌న ప్ర‌తిభావంతులైన‌ శాస్త్రవేత్త‌లు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు ఒక ప్ర‌ముఖ పాత్ర ను పోషిస్తారు అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  స్టార్ట్-అప్స్‌ ద్వారా దేశ యువ‌త ఇక్క‌డి స‌మ‌స్య‌ల ను ప‌రిష్క‌రించేట‌టువంటి ఒక వాతావ‌ర‌ణాన్ని  నెల‌కొల్ప‌డానికి గ‌త కొన్నేళ్ళుగా మేం కృషి చేస్తున్నాం అని ఆయ‌న అన్నారు.  భార‌త‌దేశం ఇంజినీర్ల‌ ను ప్రస్తుతం యావ‌త్తు ప్ర‌పంచం గుర్తిస్తోందని ఆయ‌న అన్నారు.  అస‌మ్ యువ‌తీయువ‌కులు గొప్ప సామ‌ర్ధ్యం క‌లిగిన‌ వారు, వారి లోని ఈ సామ‌ర్ధ్యాన్ని మ‌రింత‌గా పెంచేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కృషి చేస్తోంది.  అస‌మ్ ప్ర‌భుత్వ ప్ర‌యాస‌ ల ఫ‌లితం గా ప్ర‌స్తుతం రాష్ట్రం లో 20కి పైగా ఇంజినీరింగ్ క‌ళాశాల‌ లు ఏర్పాట‌య్యాయి.  ఈ రోజున ధేమాజీ ఇంజినీరింగ్ క‌ళాశాల ప్రారంభ కార్య‌క్ర‌మం, సువాల్ కుచీ ఇంజినీరింగ్ క‌ళాశాల‌ కు శంకుస్థాప‌న జ‌ర‌గ‌డం తో ఈ స్థానం మ‌రింత పటిష్టం అయింది అని ఆయ‌న అన్నారు.  మ‌రో మూడు ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల తాలూకు ప‌నులు కొన‌సాగుతున్నాయ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.  అస‌మ్ ప్ర‌భుత్వం నూత‌న విద్య విధానాన్ని సాధ్య‌మైనంత త్వ‌ర‌లో అమ‌లు లోకి తీసుకు వ‌చ్చేందుకు కృషి చేస్తోంద‌ని ఆయ‌న అన్నారు.  దీనివ‌ల్ల అస‌మ్ ప్ర‌జ‌ల కు, ప్ర‌త్యేకించి తేయాకు తోట‌ల శ్రామికుల పిల్ల‌ల‌ కు, షెడ్యూల్డు తెగ‌ల వారికి ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంద‌ని, ఇక్క‌డ విద్య‌ ను స్థానిక భాష‌ లో బోధించ‌డమే దీనికి దారితీయనుంద‌న్నారు.  

తేయాకు, చేనేత‌ లు, ప‌ర్య‌ట‌న.. ఈ మూడు అంశాల‌ కు గాను అస‌మ్ ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచింది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  అస‌మ్ ప్ర‌జ‌ల బ‌లం, స‌త్తా ల‌తో ఆత్మ‌నిర్భ‌ర‌త మ‌రింత అధికం అవుతుంద‌న్నారు.  స్వ‌యం స‌మృద్ధ అస‌మ్ తాలూకు దార్శ‌నిక‌త ను టీ ఉత్ప‌త్తి బ‌లోపేతం చేస్తుంది.  అటువంటి స్థితి లో, యువతీయువ‌కులు వారి పాఠ‌శాల, కళాశాల ద‌శల లోనే ఈ ప్రావీణ్యాల ను సంపాదించుకొన్నారంటే గనక అది గొప్ప లబ్ధి ని చేకూర్చుతుంది అని ఆయ‌న అన్నారు.  ఆదివాసీ ప్రాంతాల లో కొత్త‌ గా ఏక‌ల‌వ్య ఆద‌ర్శ పాఠ‌శాల‌ లను వంద‌ల సంఖ్య‌ లో ప్రారంభించ‌డానికి ఈ సంవ‌త్స‌రం బ‌డ్జెటు లో ఒక ప్ర‌తిపాద‌న ను చేర్చ‌డం జ‌రిగింద‌ని, ఇది అస‌మ్ కు సైతం ల‌బ్ధి ని చేకూర్చుతుంద‌న్నారు.

అస‌మ్ రైతుల ఆదాయాన్ని, వారి సామ‌ర్ధ్యాన్ని పెంచ‌డానికి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ల‌సి ప‌ని చేస్తున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  చేప‌ల పెంప‌కం రంగం లో రైతుల కోసం 20,000 కోట్ల రూపాయ‌ల తో ఒక ప్ర‌ధాన‌మైన ప‌థ‌కాన్ని రూపొందించ‌డం జ‌రిగింద‌ని, ఇది కూడా అస‌మ్ ప్ర‌జ‌ల కు లాభ‌దాయ‌కం గా ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు.  అస‌మ్ లోని రైతుల ఫ‌ల‌సాయాన్ని అంత‌ర్జాతీయ బ‌జారు కు చేరేట‌ట్లు చూడాల‌న్న‌దే ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నం అని ఆయ‌న వివ‌రించారు.  నార్త్ బ్యాంక్ లోని తేయాకు తోట‌ లు కూడా అస‌మ్ ఆర్థిక వ్య‌వ‌స్థ లో ఒక ప్ర‌ముఖ పాత్ర ను పోషిస్తాయ‌ని ఆయ‌న అన్నారు.

చిన్న తేయాకు రైతుల కు భూమిని కౌలు కు ఇచ్చేందుకు ఒక ప్ర‌చార ఉద్య‌మాన్ని ప్రారంభించినందుకు గాను అస‌మ్ ప్ర‌భుత్వాన్ని ఆయ‌న అభినందించారు.  ఇక అసమ్ ప్రజల ప్రస్తుత అవసరమల్లా అభివృద్ధి మ‌రియు ప్ర‌గ‌తి అనేట‌టువంటి జోడు ఇంజిన్ ల ను బ‌ల‌ప‌ర‌చ‌డమే అని ఆయ‌న అన్నారు.
 


 

***


(Release ID: 1699936) Visitor Counter : 201