ప్రధాన మంత్రి కార్యాలయం
రక్షణ రంగం లో బడ్జెటు కు సంబంధించిన అంశాల ను ప్రభావవంతమైన విధంగా అమలు చేయడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
భారతదేశ రక్షణ రంగం పారదర్శకత తోను, రాబోయే మార్పుల పట్ల ముందస్తు అవగాహన తోను, వ్యాపార నిర్వహణ పరంగా సౌలభ్యం కలిగిస్తూను ముందుకు సాగుతోంది: ప్రధాన మంత్రి
రక్షణ రంగం లో తయారీ సామర్ధ్యాన్ని పెంచేందుకు శ్రద్ధ వహించడం జరుగుతోంది: శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
22 FEB 2021 1:36PM by PIB Hyderabad
రక్షణ రంగం లో బడ్జెటు కు సంబంధించిన అంశాల ను ప్రభావ వంతమైన విధం గా అమలు లోకి తీసుకు రావడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశ రక్షణ రంగాన్ని స్వయం సమృద్ధం గా తీర్చిదిద్దే ముఖ్యమైన అంశం పై శ్రద్ధ వహిస్తున్న కారణం గా ఈ వెబినార్ గొప్ప ప్రాముఖ్యాన్ని సంతరించుకొంది అని ప్రధాన మంత్రి తన ప్రసంగం లో పేర్కొన్నారు.
స్వాతంత్య్రం కన్నా ముందు వందల కొద్దీ ఆయుధ కర్మాగారాలు ఉండేవి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రెండు ప్రపంచ యుద్ధాల కాలం లో భారతదేశం నుంచి ఆయుధాలు పెద్ద ఎత్తు న ఎగుమతి అయ్యాయన్నారు. అయితే, అనేక కారణాల రీత్యా, స్వాతంత్య్రం అనంతర కాలం లో ఈ వ్యవస్థ ను ఎంతగా అయితే పటిష్టపరచాలో అంతగా పటిష్ట పరచడం జరగలేదని ఆయన అన్నారు.
తేజస్ యుద్ధ విమానాన్ని అభివృద్ధి పరచడం లో మన శాస్త్రవేత్తల, ఇంజినీర్ ల శక్తియుక్తుల పైన తన ప్రభుత్వం భరోసా ను ఉంచిందని, ఇవాళ తేజస్ పూర్తి సామర్థ్యం తో గగన తలాన ఎంతో చక్కగా తన విధుల ను నిర్వర్తిస్తున్నదని ప్రధాన మంత్రి అన్నారు. తేజస్ కోసం కొన్ని వారాల కిందట 48,000 కోట్ల రూపాయల విలువైన ఆర్డరు దక్కింది అని ఆయన వెల్లడించారు.
ఈ రంగం లో పారదర్శకత్వం, రాబోయే పరిణామాల ను గురించిన ఒక ముందస్తు అంచనా, వ్యాపార నిర్వహణ లో సౌలభ్యం లతో ముందంజ వేయాలన్నదే 2014 నుంచి ప్రభుత్వం ఉద్దేశ్యం గా ఉండింది అని ఆయన అన్నారు. లైసెన్సు పద్ధతి కి స్వస్తి చెప్పడం, నియంత్రణ ను తొలగించడం, ఎగుమతుల ను ప్రోత్సహించడం, విదేశీ పెట్టుబడుల కు సరళతర నియమాల ను తీసుకు రావడం వంటి చర్యల ను ప్రభుత్వం చేపట్టింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
మన స్థానిక పరిశ్రమల సహాయం తో దేశీయం గా తయారు చేయడానికి అవకాశం ఉన్న రక్షణ సంబంధిత 100 ప్రధానమైన వస్తువుల తో ఒక జాబితా ను భారతదేశం తయారు చేసిందని కూడా ప్రధాన మంత్రి చెప్పారు. ఆ అవసరాల ను తీర్చడం కోసం మన పరిశ్రమలు ఒక ప్రణాళిక ను రూపొందించేందుకు వీలుగా ఒక నిర్ణీత కాల వ్యవధి ని నిర్దేశించడమైందని ఆయన అన్నారు.
ప్రభుత్వ భాష లో దీనిని నకారాత్మక జాబితా గా పిలుస్తున్నారని, కానీ ఆత్మనిర్భరత (స్వయంసమృద్ధి సాధన) తాలూకు భాష లో ఇది ఒక సకారాత్మకమైన జాబితా లో ఉందని ఆయన అన్నారు. దేశం తాలూకు ఉత్పత్తి సామర్ధ్యం ఈ సానుకూల జాబితా ద్వారా పెరగనుందని ఆయన చెప్పారు. ఈ సానుకూల జాబితా భారతదేశం లో ఉద్యోగ కల్పన కు తోడ్పడుతుందన్నారు. ఈ సానుకూల జాబితా మన రక్షణ రంగ అవసరాల కోసం విదేశాల మీద భారతదేశం ఆధారపడి ఉండటాన్ని తగ్గిస్తుందన్నారు. ఈ సానుకూల జాబితా భారతదేశం లో దేశవాళీ ఉత్పత్తుల విక్రయాలకు పూచీకత్తు ను ఇస్తుందని ఆయన అన్నారు.
రక్షణ రంగ కేపిటల్ బడ్జెటు లో ఒక భాగాన్ని దేశీయ సేకరణ కోసం ప్రత్యేకించడం జరిగిందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రైవేటు రంగం ముందడుగు వేసి, రక్షణ రంగ సామగ్రి ని రూపొందించాలని, ఆ సామగ్రి ని తయారు చేసే బాధ్యత ను భుజానికి ఎత్తుకోవాలని, అదే జరిగితే ప్రపంచ రంగస్థలం మీద భారతదేశ పతాకాన్ని సమున్నతం గా ఆవిష్కరించవచ్చన్నారు.
మధ్య, చిన్న తరహా వ్యాపార సంస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ) లు యావత్తు తయారీ రంగానికి ఒక వెన్నెముక లాగా పని చేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం చోటు చేసుకొన్న సంస్కరణలు ఎమ్ఎస్ఎమ్ఇ లకు మరింత స్వేచ్ఛ ను ఇస్తున్నాయని, ఎమ్ఎస్ఎమ్ఇ లు విస్తరించడానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయని ఆయన చెప్పారు.
ప్రస్తుతం దేశం లో నిర్మాణ దశ లో ఉన్న డిఫెన్స్ కారిడార్ లు కూడాను స్థానికంగా తయారీ కి, ఇక్కడి నవ పారిశ్రామికవేత్తల కు సహాయకారి గా ఉంటాయి అని ప్రధాన మంత్రి అన్నారు. అంటే, రక్షణ రంగం లో మనం రెండు మోర్చాలు .. ఒకటి జవాను , రెండోది యువత.. వీటి సాధికారిత రూపం లో చూడాలి అని ఆయన చెప్పారు.
***
(Release ID: 1699909)
Visitor Counter : 163
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam