రైల్వే మంత్రిత్వ శాఖ

పశ్చిమ బెంగాల్‌లో పలు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన శ్రీ పియూష్ గోయల్

"సోనార్ బంగ్లా" మిషన్ సాధన కోసం రైల్వేశాఖ కూడా భారీ చొరవను తీసుకుంది - శ్రీ పియూష్ గోయల్

Posted On: 21 FEB 2021 4:47PM by PIB Hyderabad

కేంద్ర రైల్వే, వాణిజ్య, పరిశ్రమ, వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రి శ్రీ పియూష్ గోయల్ నేడు వివిధ ప్రదేశాలలో ఉన్న ఇతర ప్రముఖుల సమక్షంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఉత్తర బెంగాల్ ప్రాంతంలో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ప్రయాణీకుల సౌకర్యాలకు సంబంధించిన పనులను జాతికి అంకితం చేశారు. కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి గౌరవనీయ శ్రీమతి దేబశ్రీ చౌదరితో పాటు వివిధ ప్రదేశాల నుండి ఇతర ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ పియూష్ గోయల్ మాట్లాడుతూ "దేశానికి రైల్వే అసాధారణ రీతిలో సేవలు అందిస్తోంది. సోనార్ బంగ్లా  మిషన్ సాకారానికి రైల్వేశాఖ కూడా భారీ చొరవ తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో రానున్న 3 సంవత్సరాలలో రైల్వేలు పూర్తిగా విద్యుదీకరించబడతాయి. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులన్నీ త్వరగా పూర్తవుతాయి." అన్నారు. ఉత్తర బెంగాల్ సహజంగా అందంగా ఉందని ఆయన చెప్పారు. ఈ ప్రాంతం అభివృద్ధి ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతం యొక్క సమగ్ర అభివృద్ధికి భారత రైల్వే కట్టుబడి ఉంది" అని తెలిపారు.

భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ను 100% విద్యుదీకరణ చేసేందుకు జరుగుతున్న  పనుల్లో భాగంగా  జల్పైగురి నుండి న్యూ కూచ్‌బెహార్ వరకు ఏర్పాటు చేసిన 126 రూట్ కిలోమీటర్ ఈ రోజు జాతికి అంకితం చేయబడింది. ఈశాన్య రాష్ట్రాల వైపు రైళ్ల రాకపోకలకు ఈ విభాగం చాలా ముఖ్యమైనది. విద్యుదీకరణ ద్వారా ఈ ప్రాంతంలో స్థిరమైన పురోగతి సాధించడంతో సరుకు రవాణా చేసే  రైళ్లు, మరియు ప్రయాణీకుల రైళ్లను ఎక్కువ సంఖ్యలో తక్కువ కార్బన్ - ఉద్గారాలతో పర్యావరణ అనుకూల పద్ధతిలో నడపవచ్చు. ఈ ప్రాజెక్టు ధర సుమారు రూ. 287 కోట్లు. అలాగే శిలాజ ఇంధనాల వినియోగంలో భారీ పొదుపుకు దారి తీస్తుంది. మొత్తం ఎన్‌.ఎఫ్‌ రైల్వే విద్యుదీకరణకు  2018 బడ్జెట్‌లో నిధులు కేటాయించబడ్డాయి. దీనిని 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ప్రాంతం యొక్క భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న హల్దిబారి స్టేషన్ నిర్మించబడింది. ఈ కొత్త స్టేషన్‌లో 26 కోచ్ సామర్థ్యం మరియు 2 గూడ్స్ లైన్‌తో 3 ప్యాసింజర్ ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. హల్దిబారి వద్ద స్టేషన్‌లో కొత్త భవన నిర్మాణంతో పాటు రైల్వే లైన్లు, రన్నింగ్ రూములు, సిగ్నలింగ్ వ్యవస్థ వంటి పనులను సుమారు రూ. 82.72 కోట్లు వ్యయం చేశారు. ఈ విభాగంలో రైలు కార్యకలాపాల భద్రతను పెంచడానికి హల్దిబారి మరియు జల్పాయిగురి స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ కూడా ఏర్పాటు చేయబడింది.

17.12.2020 పిఎం స్థాయి వర్చువల్ ద్వైపాక్షిక సదస్సు సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ గౌరవ ప్రధానమంత్రి షేక్ హసీనా భారతదేశంలోని హల్దిబారి మరియు బంగ్లాదేశ్ లోని చిలహతి మధ్య రైల్వే సంబంధాన్ని ప్రారంభించారు.

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినజపూర్ జిల్లాలో గంగరంపూర్ ఒక ముఖ్యమైన పట్టణం. రూ. 09.09 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఇక్కడి స్టేషన్‌ను క్రాసింగ్ స్టేషన్‌గా ఏర్పాటు చేసి  హై లెవల్ ప్లాట్‌ఫాం, ఆధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌తో నిర్మించారు. తద్వారా స్థానిక ప్రజల దీర్ఘకాల డిమాండ్‌ నెరవేరింది.

ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు మరియు సౌకర్యాన్ని అందించే లక్ష్యంతో, కార్యాచరణ అవసరాలను తీర్చడానికి అలీపూర్దుర్ జెఎన్ స్టేషన్ తిరిగి అభివృద్ధి చేయబడింది. స్థానిక సంస్కృతికి అనుగుణంగా తీర్చిదిద్దిన కొత్త స్టేషన్ భవనం రూ. 8.11 కోట్ల వ్యయంతో నిర్మించబడింది.

భారతీయ రైల్వే ప్రయాణికుల ప్రయోజనం కోసం అన్ని ముఖ్యమైన స్టేషన్లలో కొత్త లిఫ్టులు మరియు ఎస్కలేటర్లను అందిస్తోంది. అలీపూర్దుర్ జెఎన్ స్టేషన్ వద్ద ప్రయాణీకుల ఉపయోగం కోసం సుమారు రూ. 80.8 లక్షల వ్యయంతో రెండు కొత్త లిఫ్టుల ప్రయాణీకులకు ముఖ్యంగా సీనియర్ సిటిజన్ ఉపయోగం కోసం నిర్మించారు. అలాగే దివ్యాంగులు ప్లాట్‌ఫాం - 1, 2 & 3 నుండి ఇతర ప్లాట్‌ఫామ్‌లకు వెళ్లడానికి ఇవి చాలా సహాయకారిగా ఉంటాయి.

ఉత్తర బెంగాల్‌లోని డూయర్స్ విభాగంలోని  మదరిహాట్ స్టేషన్ ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశం. 1.13 కోట్ల రూపాయల వ్యయంతో ప్లాట్‌ఫామ్‌ నంబర్ 1 & 2 మధ్య కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం వలన స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్‌ 2 వద్ద ఆగే బోర్డింగ్ / డి-బోర్డింగ్ రైళ్లను చేరేందుకు ప్రయాణీకులకు సురక్షితమైన మార్గం లభిస్తుంది.

భారత రైల్వే దేశవ్యాప్తంగా అన్ని ముఖ్యమైన స్టేషన్లలో హై మాస్ట్ జెండాలను ఏర్పాటు చేస్తోంది. న్యూ కూచ్‌బహర్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన అటువంటి ఎత్తైన జాతీయ జెండా కూడా జాతికి అంకితం చేయబడింది.

 

***


(Release ID: 1699829) Visitor Counter : 151