భారత ఎన్నికల సంఘం
కర్నాటకలో శాసనసభ్యులు ఎన్నుకునే శాసనమండలి సభ్యుని ఉపఎన్నిక
Posted On:
18 FEB 2021 2:36PM by PIB Hyderabad
కర్నాటక శాసనమండలికి శాసనసభ్యులు ఎన్నుకునే విభాగం నుంచి ఒక ఖాళీ ఏర్పడినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
సభ్యుని పేరు
|
ఎన్నిక స్వభావం
|
ఖాళీ కి కారణం
|
కాల వ్యవధి
|
ఎస్. ఎల్. ధర్మెగౌడ
|
ఎమ్మెల్యేల ద్వారా
|
28.12.2020న మరణం
|
17.06.2024
|
2. శాసన సభ్యుల ద్వారా ఎన్నిక జరిగే కర్నాటక శాసనమండలి స్థానానికి పైన ఏర్పడిన ఖాళీ భర్తీకి గాను ఉప ఎన్నిక జరపాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ దిగువ పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ఎన్నిక జరుగుతుంది:
సంఖ్య
|
కార్యక్రమాలు
|
తేదీలు
|
1.
|
నోటిఫికేషన్ జారీ
|
2021 ఫిబ్రవరి 25 ( గురువారం)
|
2.
|
నామినేషన్ల దాఖలుకు ఆఖరితేదీ
|
2021 మార్చి 4 ( గురువారం)
|
3.
|
నామినేషన్ల పరిశీలన
|
2021 మార్చి 5 ( శుక్రవారం)
|
4.
|
నామినేషన్ల ఉపసంహరణకు గడువు
|
2021 మార్చి 8 ( సోమవారం)
|
5.
|
పోలింగ్ తేదీ
|
2021 మార్చి 15 ( సోమవారం)
|
6.
|
పోలింగ్ గంటలు
|
ఉదయం 9 గ . – సాయంత్రం 4 గం.
|
7.
|
వోట్ల లెక్కింపు
|
2021 మార్చి 15 (సోమవారం) సాయంత్రం 5 గం
|
8.
|
ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సిన తేదీ
|
2021 మార్చి18 (గురువారం)
|
3. మొత్తం ఎన్నిక ప్రక్రియ కాలంలో అందరూ పాటించాల్సిన స్థూల నియమాలు:
I. ఎన్నికలకు సంబంధించిన ప్రతి కార్యకలాపంలోనూ ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి.
II. ఎన్నికల కోసం వినియోగించే గది/హాలు/ప్రాంగణం దగ్గర:
(ఎ) అందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేపట్టాలి
(బి) అన్ని చోట్లా శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి
III. రాష్ట్రప్రభుత్వం, కేంద్ర హోం మంత్రిత్వశాఖ జారీచేసిన కోవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా భౌతిక దూరం పాటించాలి
4. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేసే సమయంలో కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించేలా చూడటానికి ఒక సీనియర్ అధికారి కి బాధ్యతలు అప్పగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించటమైనది.
…
(Release ID: 1699050)
Visitor Counter : 108