ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల కార్యక్రమం -31వ రోజు తాజాసమాచారం


85 లక్షల మందికి పైగా కోవిడ్-19 టీకాలు

31వరోజు సాయంత్రం 6 వరకు 2.3 లక్షలమందికి పైగా టీకాలు

73,557 ఆరోగ్యసిబ్బందికి నేడు రెండో డోస్ టీకాలు

Posted On: 15 FEB 2021 8:41PM by PIB Hyderabad

ఇప్పటివరకు కోవిడ్ టీకాలు తీసుకున్న ఆరోగ్య సిబ్బంది,. కోవిడ్ యోధుల మొత్తం సంఖ్య ఈ రోజుకు 85 లక్షలు దాటి 85,16,771 కు చేరింది. వీరికోసం మొత్తం 1,83,664 శిబిరాలు నిర్వహించినట్టు సాయంత్రం 6 గంటలవరకు అందిన తాత్కాలిక సమాచారం తెలియజేస్తోంది. వీరిలో 60,57,162 మంది మొదటి డోస్ తీసుకున్న ఆరోగ్య సిబ్బంది కాగా 98,118 మంది ఆరోగ్య సిబ్బంది రెండో విడత టీకాలు తీసుకున్నారు. వీరితోబాటు 23,61,491 మంది కోవిడ్ యోధులు మొదటి విడత టీకా తీసుకున్నారు. టీకాల కార్యక్రమం జనవరి 16న ప్రారంభం కాగా, కోవిడ్ యోధుల టీకాల కార్యక్రమం ఫిబ్రవరి2న మొదలైంది.

31వ రోజైన నేడు సాయంత్రం 6 గంటలవరకు 2,31,476 మంది టీకాలు వేయించుకున్నారు. వారిలో 1,57,919 మంది మొదటి డోస్ తీసుకున్నవారు కాగా 73,557 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకున్నారు. తుది నివేదిక ఈ రాత్రి పొద్దుపోయాక వస్తుంది. ఈరోజు 9,935 శిబిరాలు నిర్వహించారు.

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ రోజు టీకాల కార్యక్రమం సాగింది.

.

క్రమ సంఖ్య

 రాష్ట్రం/

కేంద్రపాలిత ప్రాంతం

టీకా లబ్ధిదారులు

1వ డోస్

2వ డోస్

మొత్తం డోస్ లు

1

అండమాన్, నికోబార్ దీవులు

3,847

182

4,029

2

ఆంధ్రప్రదేశ్

3,58,944

10,638

3,69,582

3

అరుణాచల్ ప్రదేశ్

16,141

1,250

17,391

4

అస్సాం

1,28,032

3,165

1,31,197

5

బీహార్

4,93,212

1,727

4,94,939

6

చండీగఢ్

9,212

144

9,356

7

చత్తీస్ గఢ్

2,71,525

3,325

2,74,850

8

దాద్రా, నాగర్ హవేలి

2,922

41

2,963

9

డామన్, డయ్యూ

1,121

30

1,151

10

ఢిల్లీ

1,91,005

2,318

1,93,323

11

గోవా

13,166

517

13,683

12

గుజరాత్

6,88,960

8,080

6,97,040

13

హర్యానా

1,97,800

2,792

2,00,592

14

హిమాచల్ ప్రదేశ్

81,482

475

81,957

15

జమ్మూ-కశ్మీర్

1,45,600

1,849

1,47,449

16

జార్ఖండ్

2,16,081

3,928

2,20,009

17

కర్నాటక

5,00,112

10,838

5,10,950

18

కేరళ

3,63,902

3,570

3,67,472

19

లద్దాఖ్

2,904

77

2,981

20

లక్షదీవులు

1,776

0

1,776

21

మధ్యప్రదేశ్

5,67,219

0

5,67,219

22

మహారాష్ట్ర

6,94,667

2,028

6,96,695

23

మణిపూర్

24,844

277

25,121

24

మేఘాలయ

14,230

164

14,394

25

మిజోరం

12,240

227

12,467

26

నాగాలాండ్

11,006

308

11,314

27

ఒడిశా

4,13,408

4,139

4,17,547

28

పుదుచ్చేరి

6,320

193

6,513

29

పంజాబ్

1,06,453

1,008

1,07,461

30

రాజస్థాన్

6,11,335

1,046

6,12,381

31

సిక్కిం

8,543

0

8,543

32

తమిళనాడు

2,55,038

3,244

2,58,282

33

తెలంగాణ

2,79,010

7,178

2,86,188

34

త్రిపుర

73,375

1,485

74,860

35

ఉత్తరప్రదేశ్

8,96,254

15,014

9,11,268

36

ఉత్తరాఖండ్

1,14,059

1,200

1,15,259

37

పశ్చిమబెంగాల్

5,26,890

5,231

5,32,121

38

ఇతరములు

1,16,018

430

1,16,448

                   మొత్తం

84,18,653

98,118

85,16,771

 

నమోదు చేసుకున్న ఆరోగ్య సిబ్బందిలో 70% పైగా తీకాలు వేసుకున్నవారున్న రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు 14 కాగా అవి: బీహార్, లక్షదీవులు, త్రిపుర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, చత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, మిజోరం, సిక్కిం

 

క్రమసంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

పూర్తయిన శాతం

 1.

లక్షదీవులు

81%

2.

బీహార్

81.6%

3.

త్రిపుర

79.5%

 4.

ఒడిశా

78.1%

5.

మధ్యప్రదేశ్

75.8%

6.

ఉత్తరాఖండ్

75.2%

7.

హిమాచల్ ప్రదేశ్

74.5%

8.

చత్తీస్ గఢ్

74.9%

9.

ఉత్తరప్రదేశ్

72%

10.

జార్ఖండ్

72%

11.

కేరళ

71.3%

12.

రాజస్థాన్

70.9%

13.

మిజోరం

71.6%

14.

సిక్కిం

70.1%

 

మరోవైపు 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 40% కంటే తక్కువమంది ఆరోగ్య సిబ్బంది టీకాలు వేయించుకున్నారు. ఆ రాష్ట్రాలు: తమిళనాడు, పంజాబ్, చందీగఢ్, నాగాలాండ్, పుదుచ్చేరి. అత్యధికంగా తీకాలు వేయించుకున్న 10 రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, పశ్చిమబెంగాల్, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్ గఢ్, జార్ఖండ్, తమిళనాడు, మధ్యప్రదేశ్.

టీకా అనంతర ప్రభావం కనబడి ఇప్పటివరకు మొత్తం 35 మంది ఆస్పత్రిలో చేరారు. మొత్తం టీకాల సంఖ్యలో వీరి వాటా 0.0004% మాత్రమే.ఈ 35 మందిలో 21 మందిని చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసారు. 11 మంది చనిపోయారు. ముగ్గురు ఇంకా చికిత్సలో ఉన్నారు. గత 24 గంటలలో ఒక వ్యక్తి హైబీపీ కారణంగా కంటి సంబంధమైన వ్యాధితో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉన్న బాంబే ఆస్పత్రిలో చేరారు. ఇప్పటివరకు మొత్తం 28 మరణాలు నమోదయ్యాయి. ఇవి టీకాల సంఖ్యలో 0.0003% మాత్రమే. వీళ్లలో 11 మంది ఆస్పత్రిలో మరణించగా మిగిలిన 17 మంది ఆస్పత్రి బైట చనిపోయారు. కోవిడ్ టీకాకు సంబంధించిన మరణం ఒక్కటి కూడా నమోదు కాలేదు.

గత 24 గంటలలో ఒక మరణం నమొదైంది. ఉత్తరప్రదేశ్ లోని దేవరియాకు చెందిన 53 ఏళ్ల పురుషుడు చనిపోయినట్టు సమాచారం అందింది. టీకావేసుకున్న రెండో రోజు అకస్మాత్తుగా ఊపిరి పీల్చటంలో ఇబ్బంది పడి, ఆస్పత్రికి చేర్చేలోపే చాతీనొప్పితో చనిపోయినట్టు తేలింది. పోస్ట్ మార్టమ్ నివేదిక అందాల్సి ఉంది.

****

 


(Release ID: 1698287) Visitor Counter : 211