ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల కార్యక్రమం తాజాసమాచారం -28వ రోజు


ఇప్పటిదాకా 77.66 లక్షలమందికి కోవిడ్ టీకాలు

28వ రోజు సాయంత్రం 6 వరకు 2,61,309 మందికి టీకాలు

గత 24 గంటలలో కొత్తగా నమోదు కాని మరణాలు

Posted On: 12 FEB 2021 8:40PM by PIB Hyderabad

ఇప్పటిదాకా కోవిడ్ టీకాలు వేయించుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు కలిసి మొత్తం సంఖ్య 77,66,319 కి చేరింది. వీరికోసం మొత్తం 1,63,587 టీకా శిబిరాలు నిర్వహించారు. వీరిలో 58,65,813 మంది (58.9%) ఆరోగ్య సిబ్బంది19,00,506 మంది (21.2%) కోవిడ్ యోధులు ఉన్నారు.

నిన్న 28వ రోజు నాడు సాయంత్రం 6 గంటలవరకు 2,61,309 మంది టీకాలు తీసుకున్నారు. తాత్కాలిక సమాచారం ప్రకారం వీరిలో 50,837 మంది ఆరోగ్య సిబ్బంది, 2,10,472 మంది కోవిడ్ యోధులు ఉన్నారు. అంతిమ సమాచారం రావాల్సి ఉంది.

28వ రోజు టీకాల కార్యక్రమంలో 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొన్నాయి.

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

టీకాల లబ్ధిదారులు

1

అండమాన్, నికోబార్ దీవులు

3454

2

ఆంధ్రప్రదేశ్

3,48,280

3

అరుణాచల్ ప్రదేశ్

14,902

4

అస్సాం

1,21,048

5

బీహార్

4,51,621

6

చండీగఢ్

8017

7

చత్తీస్ గఢ్

2,45,114

8

దాద్రా, నాగర్ హవేలి

2890

9

డామన్, డయ్యూ

1095

10

ఢిల్లీ

1,66,725

11

గోవా

12214

12

గుజరాత్

6,61,508

13

హర్యానా

1,94,124

14

హిమాచల్ ప్రదేశ్

72,191

15

జమ్మూ-కశ్మీర్

1,11,470

16

జార్ఖండ్

1,84,568

17

కర్నాటక

4,90,746

18

కేరళ

3,40,223

19

లద్దాఖ్

2854

20

లక్షదీవులు

920

21

మధ్యప్రదేశ్

5,09,168

22

మహారాష్ట్ర

6,33,519

23

మణిపూర్

18935

24

మేఘాలయ

12659

25

మిజోరం

11332

26

నాగాలాండ్

9,073

27

ఒడిశా

3,90,302

28

పుదుచ్చేరి

5514

29

పంజాబ్

1,01,298

30

రాజస్థాన్

5,92,412

31

సిక్కిం

8335

32

తమిళనాడు

2,11,762

33

తెలంగాణ

2,71,754

34

త్రిపుర

64,773

35

ఉత్తరప్రదేశ్

8,31,556

36

ఉత్తరాఖండ్

1,04,052

37

పశ్చిమ బెంగాల్

4,70,912

38

ఇతరములు

84,999

మొత్తం

77,66,319

 

పన్నెండు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రామ్తాలలో రిజిస్టర్ చేసుకున్న ఆరోగ్య సిబ్బందిలో 70శాతానికి పైగా టీకాలు వేయించుకున్నారు. అవి: బీహార్, త్రిపుర, మధ్యప్రదేశ్, ఒడిశామ్ ఉత్తరాఖండ్, చత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, లక్షదీవులు, మిజోరం, రాజస్థాన్, సిక్కిం.

 

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

శాతం

1.

బీహార్

80.2%

2.

త్రిపుర

78.8%

3.

మధ్యప్రదేశ్

75.8%

4.

ఒడిశా

75.7%

5.

ఉత్తరాఖండ్

74.6%

6.

చత్తీస్ గఢ్

72.7%

7.

హిమాచల్ ప్రదేశ్

72.2%

8.

కేరళ

71%

9.

లక్షదీవులు

70.7%

10.

మిజోరం

70.5%

11.

రాజస్థాన్

70.2%

12.

సిక్కిం

70.1%

 

మరో వైపు 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో నమోదు చేసుకున్న ఆరోగ్య సిబ్బందిలో 40% మాత్రమే టీకాలు వేయించుకున్నారు. అవి: ఢిల్లీ, మేఘాలయ, పంజాబ్, మణిపూర్, తమిళనాడు, చండీగఢ్, నాగాలాండ్, పుదుచ్చేరి.

అత్యధికమ్గా టీకాలు వేసిన 10 రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కర్నాటక, చత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా.

ఇప్పటిదాకా మొత్తం 33 మంది ఆస్పత్రిలో చేరారు. వీరు టీకాలు తీసుకున్నవారిలో 0.0004% మాత్రమే. ఇలా ఆస్పత్రిలో చేరిన 33 మందిలో 21 మందిని చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. 10 మంది చనిపోగా ఇద్దరు ఇంకా చికిత్సలో ఉన్నారు.

గత 24 గంటలలో ఒకరు కోవిడేతర వ్యాధికి పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు.

ఇప్పటివరకు మొత్తం 24 మరణాలు నమోదయ్యాయి. ఇవి మొత్తం టీకాలలో 0.0003% మాత్రమే. ఈ 24 మందిలో తొమ్మిది మంది ఆస్పత్రిలో చనిపోగా, 15 మంది ఆస్పత్రి వెలుపల చనిపోయారు.

గత 24 గంటలలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. టీకా అనంతర అనారోగ్యం ఏదీ టీకాతో సంబంధమున్నట్టు ఇప్పటిదాకా తేలలేదు.

ఆరోగ్య సిబ్బంది మొత్తం 2021 ఫిబ్రవరి 20 లోగా కనీస మొదటి విడత టీకా వేసుకునేట్టు చూడాలని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రభుత్వ కోరింది. మిగిన కొద్దిమంది ఉంటే 25 లోగా పూర్తిచేయాలని కూడా ఆదేశించింది. కోవిడ్ యోధులకు కూడా మార్చి 1 లోగా మొదటి విడత టీకాలు పూర్తిచేసి మార్చి 6 నాటికి మిగిలిపోయిన వాళ్లను కూడా పూర్తి చేయాలని సూచించింది.

****

 (Release ID: 1697678) Visitor Counter : 204