మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్ర బడ్జెట్ 2021-2022: పాఠశాల విద్య మరియు అక్షరాస్యత శాఖ‌కు సంబంధించిన‌ ముఖ్యాంశాలు


దేశవ్యాప్తంగా భారతీయ సంకేత భాష ప్రామాణీకరణను ప్ర‌క‌టించిన‌ కేంద్ర బడ్జెట్-2021

Posted On: 12 FEB 2021 4:31PM by PIB Hyderabad

వినికిడి లోపం క‌లిగిన పిల్లల కోసం ప్రభుత్వం దేశవ్యాప్తంగా భారతీయ సంకేత భాష యొక్క ప్రామాణీకరణ దిశ‌గా పని చేయ‌నుంది. ఇలాంటి వారి ఉప‌యోగార్థం జాతీయ మరియు రాష్ట్ర పాఠ్య ప్రణాళికల‌ను కూడా అభివృద్ధి చేయ‌నుంది. జాతీయ విద్యా విధానం-2020 లో భాగంగా 2021-22 బడ్జెట్‌లో చొరవ తీసుకొని వినికిడి లోపం క‌లిగిన పిల్లల ఉప‌యోగార్థంగా ఈ అంశం ప్రకటించారు. ఈ ప్రకటనకు అనుగుణంగా, పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం, విద్యా మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఈ క్రింద పేర్కొన్న ప‌లు కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌నుంది.

  • యుడీఎల్ మార్గదర్శకాల మేర‌కు పుస్తకాల్ని ఈ-బుక్స్‌గా మార్చ‌నున్నారు.
  • సంకేత భాషా వీడియోలూ అభివృద్ధి చేయబడతాయి.
  • సంకేత భాష కోసం నిఘంటువు/ పదకోశం అభివృద్ధి చేయబడుతుంది.

దీక్ష మ‌రియు పీఎం ఈ-విద్య ద్వారా వీటిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. దీనికి సంబంధించి సీఐఈటీ, ఎన్‌సీఈఆర్‌టీ మరియు ఐఎస్ఎల్ఆర్‌టీసీల మ‌ధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల‌ ఆధారిత వీడియోలను మ‌న‌ భారతీయ సంకేత భాషలో అభివృద్ధి చేయడానికి ఐఎస్ఎల్ఆర్‌టీసీ చాలా సన్నిహిత సహకారంతో పనిచేయ‌నుంది. ఐఎస్ఎల్ ప్రామాణీకరణ ప‌ని సమాజ స‌మ్మ‌ళిత‌త‌‌కు సహకరించడంతో పాటుగా భారతదేశం అంతటా ఆచరణలో ఉన్న వివిధ సంకేత భాష యొక్క అనేక మాండలికాలలో కొంత సమైక్యతను తీసుకురావడానికి అవకాశం క‌ల్పిస్తుంది. వినికిడి లోపంతో బాధపడుతున్న పిల్లల అభ్యాసానికి కూడా ఈ చ‌ర్య‌ ప్రోత్సహిస్తుంది. తద్వారా వారి సామర్థ్యాన్ని వెలువ‌రించేలా సమాన అవకాశాల్ని అందిస్తుంది. పిల్లలందరూ ఒకరితో ఒకరు సులభంగా సంభాషించుకొనేందుకు..  ఒకరినొకరు బాగా తెలుసుకొనేందుకు కూడా ఇది దోహ‌దం చేయ‌నుంది. పాఠశాల సంవత్సరాల్లో అభివృద్ధి చెందలేక పోయిన కాలంలో విష‌య సంగ్ర‌హ‌ణ పొంద‌లేక‌పోయిన వాటిని గురించి తెలుసుకొనేలా ప్రోత్సహించడానికి ఇది సహాయపడుతుంది.

 

***


(Release ID: 1697513) Visitor Counter : 153


Read this release in: English , Urdu , Marathi , Hindi