మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కేంద్ర బడ్జెట్ 2021-2022: పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కేటాయింపుల ముఖ్యాంశాలు
2021-2022లో 56 లక్షల మంది పాఠశాల ఉపాధ్యాయులకు నిష్టా ద్వారా శిక్షణ
Posted On:
12 FEB 2021 4:32PM by PIB Hyderabad
కేంద్ర బడ్జెట్ 2021-2022 ప్రకటన ప్రకారం, ఈ సంవత్సరం కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి ఉన్నప్పటికీ 30 లక్షలకు పైగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు డిజిటల్ శిక్షణ పొందారు.
విద్యశాఖ మొత్తం స్వరూపాన్ని కవర్ చేస్తూ ఈ శిక్షణనివ్వడం జరిగింది. దీనిని మరింతగా ముందుకు తీసుకుపోతూ 2021-22లో 56 లక్షల మంది పాఠశాల ఉపాధ్యాయులకు నిష్టా ద్వారా శిక్షణను ఇవ్వనున్నారు. నిష్టా (నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్) కార్యక్రమం ఎలిమెంటరీ స్థాయిలో అభ్యాస ఫలితాల్ని మెరుగుపరచడం లక్ష్యంగా రూపొందించిన ఒక సమగ్ర ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమం. దీనిని కేంద్ర పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం ఆగస్టు 21, 2019 న ప్రారంభించింది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి సమయంలో నిష్ట యొక్క మొత్తం 18 మోడ్యూల్స్ ఆన్‌లైన్ విధానంలోకి మార్చబడ్డాయి, 10 ప్రాంతీయ భాషలలోకీ అనువదించబడ్డాయి. 27 రాష్ట్రాలు మరియు ఎంఓఈ, ఎంఓడీ కింద పని చేస్తున్న 7 (సీబీఎస్ఈ, కేవీఎస్, ఎన్‌వీఎస్, ఏఈఈఎస్, సైనిక్ పాఠశాలలు, సీటీఎస్ఏ, సీఐసీఎస్ఈ) సంస్థలు 10 భాషలలో (అస్సామి, బెంగాలీ, బోడో, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ , ఓడియా, తెలుగు మరియు ఉర్దూ) సుమారు 24 లక్షల మంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు నిష్టా శిక్షణను అందిస్తున్నాయి. ఈ మాడ్యూళ్ళను ఉపాధ్యాయులు ఏప్రిల్ 2021 నాటికి పూర్తి చేయనున్నారు. ప్రాథమిక సంవత్సరాలకు సంబంధించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక ఆన్‌లైన్ నిష్టా శిక్షణ కార్యక్రమాన్ని ఆగస్టు, 2021 నుండి విస్తరించనున్నారు. సెకండరీ / సీనియర్ సెకండరీ స్థాయి ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌లో శిక్షణ కార్యక్రమం జూలై, 2021లో మొదలువుతుంది. శిక్షణ ముగిసిన తర్వాత కూడా ఉపాధ్యాయులకు తగిన విధంగా తోడ్పాటు అందిచేందుకు వీలుగా మార్గదర్శకుల్ని (కీ రిసోర్స్ పర్సన్స్ మరియు స్టేట్ రిసోర్స్ పర్సన్స్) కూడా సిద్ధం చేస్తున్నారు.
***
(Release ID: 1697494)
Visitor Counter : 162