ఆర్థిక మంత్రిత్వ శాఖ
బెంగళూరులో సోదాలు నిర్వహించిన - ఆదాయపు పన్ను శాఖ
Posted On:
11 FEB 2021 5:55PM by PIB Hyderabad
బెంగళూరు కేంద్రంగా ఉన్న ఒక భారీ మద్యం తయారీ బృందానికి చెందిన భారతదేశంలోని 26 వేర్వేరు ప్రదేశాలలో, ఆదాయపు పన్ను శాఖ, 2021 ఫిబ్రవరి, 2వ తేదీన, సోదాలు చేసి, ఆస్తులు స్వాధీనం చేసుకుంది. ఈ బృందానికి భారీగా భూములు ఉన్నాయి. ఈ భూములను బెంగళూరులో స్థావరంగా ఉన్న ఒక భవన నిర్మాణ దారునితో కలిసి, నివాస మరియు వాణిజ్య సముదాయాలుగా అభివృద్ధి చేస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక ప్రధాన బిల్డర్ తో ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో, 692.82 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని, మరుగున పరచడానికి సంబంధించిన సాక్ష్యాలు, ఈ సోదాల్లో, వెలుగులోకి వచ్చాయి. అలాగే, బృందంలోని కంపెనీలు, 86 కోట్ల రూపాయల మేర ఖర్చులను, మోసపూరితంగా, లెక్కలో చూపాయి. వారి మద్యం వ్యాపారానికి సంబంధించి, కేరళ స్థావరంగా ఉన్న ఒకానొక మద్యం తయారీ కర్మాగారం నుండి 74 కోట్ల రూపాయల మేర, లెక్కలో చూపని అమ్మకాలను కనుగొన్నారు. ఈ బృందంలోని మిగిలిన కంపెనీలు కూడా, 17 కోట్ల రూపాయల మేర నకిలీ ఖర్చులను లెక్కల్లో చూపారు. ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 69 సి నిబంధనలను ఆకర్షించే విధంగా, ఈ బృందానికి చెందిన డైరెక్టర్లు కూడా, 9 కోట్ల రూపాయల మేర వివరించలేని ఖర్చు చేశారు.
చాలా సంవత్సరాలుగా వారి ఉద్యోగులు మరియు సహచరుల పేర్లతో బినామి ఆస్తులలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఈ విధంగా, మొత్తం 150 కోట్ల రూపాయల మేర 35 అనుమానాస్పద బినామి ఆస్తులు వారి బంధువులు మరియు సహచరుల పేర్లతో ఉన్నట్లు గుర్తించారు. గ్రూప్ కంపెనీ డైరెక్టర్ పేరు మీద విదేశీ ఆస్తులు కూడా ఉన్నట్లు ఆధారాలు లభించాయి.
సోదాలు, స్వాధీనం కోసం నిర్వహించిన చర్యల ఫలితంగా, మొత్తం మీద, 878.82 కోట్ల రూపాయల మేర, వెల్లడించని ఆదాయాన్ని కనుగొన్నారు.
తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
****
(Release ID: 1697350)
Visitor Counter : 176