ఆర్థిక మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాలలో సహాయక సేవలను ప్రారంభించడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించబడింది

Posted On: 11 FEB 2021 3:27PM by PIB Hyderabad

అంతర్జాతీయ ఆర్ధిక సేవల కేంద్రాలు (ఐ.ఎఫ్.ఎస్.సి) లోని ఆర్థిక ఉత్పత్తులు, ఆర్థిక సేవలు మరియు ఆర్థిక సంస్థల అభివృద్ధికి, వృత్తిపరమైన సేవలతో పాటు, ఇతర సేవలందించేవారి ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని, సహాయక సేవలను ప్రారంభించడానికి  ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించడం జరిగింది. 

దిగువ పేర్కొన్న ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కార్యకలాపాలలో నిమగ్నమైన సహాయక సేవలందించేవారికి ఈ ప్రణాళిక వర్తిస్తుంది:

i.     చట్టపరమైన, వర్తింపు మరియు సెక్రటేరియల్;

ii.     ఆడిటింగ్, అకౌంటింగ్, బుక్ కీపింగ్ మరియు టాక్సేషన్ సర్వీసెస్;

iii.     ప్రొఫెషనల్ & మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్;

iv.     పరిపాలన, ఆస్తుల నిర్వహణ మద్దతు సేవలు మరియు  ధర్మకర్తృత్వ  సేవలు;

v.     ఎప్పటికప్పుడు ఐ.ఎఫ్.ఎస్.సి.ఏ. ఆమోదించిన ఇతర సేవలు.

అనుమతించదగిన సహాయక సేవలు, అర్హత కలిగిన సంస్థలు, సేవా గ్రహీతలు మొదలైన వాటి యొక్క కార్యకలాపాలను ఈ కార్యాచరణ ప్రణాళిక వివరిస్తుంది.

ఐ.ఎఫ్.ఎస్.సి.ఏ. వెబ్- ‌సైట్  URL:  https://ifsca.gov.in/Circular  లో ఈ కార్యాచరణ ప్రణాళిక వివరాలు అందుబాటులో ఉన్నాయి.

****



(Release ID: 1697261) Visitor Counter : 104