ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద 41.75 కోట్లకు చేసిన బ్యాంకు ఖాతాల సంఖ్య
Posted On:
08 FEB 2021 7:37PM by PIB Hyderabad
ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) [ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్‌ఆర్‌బీలు) సహా], ప్రైవేటు రంగంలోని 14 ప్రధాన బ్యాంకుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, 27.01.2021 నాటికి, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద ప్రజలు తెరిచిన ఖాతాలు 41.75 కోట్లకు చేరాయి. వీటిలో 35.96 కోట్ల ఖాతాలు క్రియాశీలకంగా ఉన్నాయి.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభకు సమర్పించారు.
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) కింద, ప్రైవేటు రంగ బ్యాంకులతో సహా ఏ బ్యాంకు శాఖలోనైనా ప్రజలు ఖాతా తెరవచ్చు.
పీఎంజేడీవై కింద పీఎస్‌బీల్లో (ఆర్‌ఆర్‌బీలు సహా) తెరిచిన ఖాతాలు 40.48 కోట్లు కాగా, ప్రైవేటు రంగంలోని 14 ప్రధాన బ్యాంకుల్లో తెరిచిన ఖాతాల సంఖ్య 1.27 కోట్లుగా మంత్రి వెల్లడించారు.
పీఎంజేడీవై కింద తెరిచే ఖాతాలు ప్రాథమిక బ్యాంకు పొదుపు ఖాతాలుగా కేంద్ర మంత్రి వివరించారు. 10.06.2019న ఆర్‌బీఐ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం, ఎలాంటి రుసుములు విధించకుండా, సున్నా నగదు నిల్వతో, ఈ క్రింది కనీస బ్యాంకింగ్ సౌకర్యాలను బ్యాంకులు ఖాతాదారులకు అందించాలి.
ఏటీఎంలు/సీడీఎంలతోపాటు బ్యాంకు శాఖల్లో నగదు జమ
ఏదైనా ఎలక్ట్రానిక్ ఛానల్ ద్వారా నగదు స్వీకరణ/క్రెడిట్ లేదా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, విభాగాలు ఇచ్చిన చెక్కుల డిపాజిట్/స్వీకరణ
ఒక నెలలో జరిపే నగదు జమల సంఖ్య, విలువపై పరిమితి లేకపోవడం
ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణలు సహా నెలలో కనీసం నాలుగు ఉపసంహరణలు
ఏటీఎం కార్డు లేదా ఏటీఎం కమ్ డెబిట్ కార్డు
***
(Release ID: 1696353)
Visitor Counter : 184