ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ టీకా కార్యక్రమం తాజా పరిస్థితి - 22వ రోజు
దేశవ్యాప్తంగా 56 లక్షల ఆరోగ్య కార్యకర్తలు, ముందువరుసలో పనిచేస్తున్నవారికి టీకా పూర్తి
నిన్న సాయంత్రం 6గంటలకు 2,20,019 మందికి టీకా
ఇప్పటి వరకు ఈ టీకా వేయడం వల్ల ప్రమాదకర/తీవ్రతరమైన ఏఈఎఫ్ఐ/మరణం సంభవించిన కేసులు లేవు
Posted On:
06 FEB 2021 7:58PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా కోవిడ్ 19 కు విరుగుడుగా టీకాలు తీసుకున్న మొత్తం లబ్ధిదారుల సంఖ్య 56 లక్షలను దాటింది.
22 వ రోజు దేశవ్యాప్తంగా కోవిడ్ -19 టీకా కార్యక్రమంలో భాగంగా నిన్న సాయంత్రం 6 గంటల వరకు తాత్కాలిక నివేదిక ప్రకారం 1,14,548 సెషన్ల ద్వారా (సాయంత్రం 6 గంటల వరకు) 56,36,868 మంది ఆరోగ్య, ఫ్రంట్‌లైన్ కార్మికులకు టీకాలు పొందారు, . 35 రాష్ట్రాలు / యుటిలలో టీకాల సెషన్స్ నిర్వహించారు.
మొత్తం సంఖ్యలో 52,66,175 మంది లబ్ధిదారులు ఆరోగ్య కార్యకర్తలు, 3,70,693 మంది ఫ్రంట్‌లైన్ కార్మికులు.
సాయంత్రం 6 గంటల వరకు 2,20,019 మంది లబ్ధిదారులకు టీకాలు వేశారు.
నిన్నటి వరకు టీకాలు వేసిన 12 రాష్ట్రాల్లో మొత్తం లబ్ధిదారులలో 85% మంది టీకా వేయించుకున్నారు.
13 రాష్ట్రాలు / యుటిలలో నమోదైన ఆరోగ్య సంరక్షణ కార్మికుల 60% కంటే ఎక్కువ కవరేజీని నమోదు చేశారు.
మరోవైపు, 12 రాష్ట్రాలు / యుటిలు తమ రాష్ట్రాలు / యుటిలలో ఆరోగ్య సంరక్షణ కార్మికులను 40% కన్నా తక్కువ కవరేజీని నమోదు చేశాయి. అవి- అస్సాం, ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, దాద్రా మరియు నగర్ హవేలి, లడఖ్, తమిళనాడు, చండీఘడ్ మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ మరియు పుదుచ్చేరి.
అన్ని రాష్ట్రాలు / యుటిలతో టీకా డ్రైవ్ పనితీరును కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ఈ రోజు సమీక్షించారు. టీకా కవరేజీని మెరుగుపరచాలని, ప్రతి సెషన్‌కు లబ్ధిదారుల సంఖ్యను మరియు టీకా వృధాను తగ్గించాలని రాష్ట్రాలు / యుటిలకు సూచించారు.
నిన్న సాయంత్రం 6 గంటల వరకు తాత్కాలిక నివేదిక ప్రకారం భారతదేశంలో ఇప్పటివరకు నిర్వహించిన టీకాల సంచిత జాబితా క్రింద ఇవ్వబడింది.
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
టీకాను వేయించుకున్నవారి సంఖ్య
|
1
|
అండమాన్ నికోబార్ దీవులు
|
3161
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
2,86,436
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
12,148
|
4
|
అసోం
|
85,538
|
5
|
బీహార్
|
3,68,413
|
6
|
చండీగఢ్
|
5645
|
7
|
ఛత్తీస్గఢ్
|
1,67,090
|
8
|
దాద్రా&నాగర్ హవేలీ
|
1408
|
9
|
దామన్ & డయ్యు
|
708
|
10
|
ఢిల్లీ
|
1,03,015
|
11
|
గోవా
|
8257
|
12
|
గుజరాత్
|
4,17,476
|
13
|
హర్యానా
|
1,39,068
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
54,126
|
15
|
జమ్మూ కశ్మీర్
|
49,311
|
16
|
ఝార్ఖండ్
|
90,330
|
17
|
కర్ణాటక
|
3,83,537
|
18
|
కేరళ
|
2,89,792
|
19
|
లడాఖ్
|
1935
|
20
|
లక్షద్వీప్
|
839
|
21
|
మధ్యప్రదేశ్
|
3,41,602
|
22
|
మహారాష్ట్ర
|
4,63,044
|
23
|
మణిపూర్
|
8099
|
24
|
మేఘాలయ
|
6841
|
25
|
మిజోరాం
|
10937
|
26
|
నాగాలాండ్
|
4,535
|
27
|
ఒడిశా
|
2,64,205
|
28
|
పుదుచ్చేరి
|
3532
|
29
|
పంజాబ్
|
75,853
|
30
|
రాజస్థాన్
|
4,19,059
|
31
|
సిక్కిం
|
5358
|
32
|
తమిళ్ నాడు
|
1,63,592
|
33
|
తెలంగాణ
|
2,02,047
|
34
|
త్రిపుర
|
40,315
|
35
|
ఉత్తర్ ప్రదేశ్
|
6,73,542
|
36
|
ఉత్తరాఖండ్
|
72,818
|
37
|
పశ్చిమ బెంగాల్
|
3,52,749
|
38
|
ఇతరములు
|
60,507
|
|
మొత్తం భారతదేశం
|
56,36,868
|
ఇప్పటివరకు మొత్తం 28 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇది మొత్తం టీకాలలో 0.0005% కలిగి ఉంది. ఆసుపత్రిలో చేరిన 28 కేసులలో 19 మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేయగా, తొమ్మిది మంది మరణించారు.
గత 24 గంటల్లో కొత్తగా ఆసుపత్రిలో చేరలేదు. ఈ రోజు వరకు మొత్తం 22 మరణాలు నమోదయ్యాయి. ఇవి మొత్తం టీకాలలో 0.0004% కలిగి ఉంటాయి.
22 మందిలో, తొమ్మిది మంది ఆసుపత్రిలో మరణించగా, 13 మరణాలు ఆసుపత్రి వెలుపల నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్త మరణాలు ఏవీ నివేదించబడలేదు. ఈ మరణాలలో ఏదీ కూడా కోవిడ్-19 టీకాతో సంబంధం కలిగి లేదు. ప్రమాదకరమైన/ తీవ్రమైన ఏఈఎఫ్ఐ / మరణం కేసులకు టీకా కారణం కాదు.
****
(Release ID: 1696026)
Visitor Counter : 101