యు పి ఎస్ సి

సంయుక్త కార్యదర్శి, డైరెక్టర్ స్థాయిలో కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం

Posted On: 05 FEB 2021 5:30PM by PIB Hyderabad

ప్రతిభ గల, ఉత్సాహపూరితులైన భారతీయులు ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి, డైరెక్టర్ స్థాయి పోస్టులలో చేరి దేశ నిర్మాణంలో పాల్గొనదలచుకుంటే దరఖాస్తు పంపుకోవాలని భారత ప్రభుత్వంలో సిబ్బంది, శిక్షణ విభాగం కోరుతోంది. కాంట్రాక్టు పద్ధతిలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ,ఆర్థిక మంత్రిత్వశాఖలోని రెవెన్యూ విభాగం, వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖలలోని ఈ దిగువ పేర్కొన్న విభాగాలలో పనిచేయటానికి  దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రభుత్వం కోరుతోంది.  

వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఆర్థిక మంత్రిత్వశాఖలోని ఆర్థిక సేవల విభాగం

ఆర్థిక మంత్రిత్వశాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం

వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ

న్యాయ మంత్రిత్వశాఖ

విద్యా మంత్రిత్వశాఖలోని పాఠశాల విద్య, సాక్షరతా విభాగం

విద్యా మంత్రిత్వశాఖలోని ఉన్నత విద్య

వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ

రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ

జలశక్తి మంత్రిత్వశాఖ

పౌరవిమానయాన మంత్రిత్వశాఖ

నైపుణ్యాభివృద్ధి, వ్యాపార నిర్వహణాభివృద్ధి మంత్రిత్వశాఖ

 

అభ్యర్థులకు అవసరమైన పూర్తి వివరాలతో, సూచనలతో  కమిషన్ వెబ్ సైట్ లో ఫిబ్రవరి 6న అప్ లోడ్ చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 22 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ దరఖాస్తులో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంటర్వ్యూకు పిలవాల్సిన అభ్యర్థుల జాబితా తయారుచేసి తెలియజేస్తారు. అందువలన కచ్చితమైన సమాచారం అందజేయాలి.  

<><><><>


(Release ID: 1695670) Visitor Counter : 207