ఆర్థిక మంత్రిత్వ శాఖ

రెవెన్యూ లోటు గ్రాంట్ 14 రాష్ట్రాలకు రూ.6,195 కోట్లు విడుదల

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రెవెన్యూ లోటు గ్రాంట్ రూ.68,145.91 కోట్లు రాష్ట్రాలకు విడుదల చేశారు

Posted On: 05 FEB 2021 4:04PM by PIB Hyderabad

ఖర్చుల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ నెలవారీ పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ (పిడిఆర్డి) గ్రాంట్‌ రూ. 6,195.08 కోట్లు రాష్ట్రాలకు విడుదల చేసింది. ఇది రాష్ట్రాలకు విడుదల చేసిన 11 వ వాయిదా పిడిఆర్డి గ్రాంట్. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.68,145.91 కోట్లు పోస్ట్ డివల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్‌గా అర్హత ఉన్న రాష్ట్రాలకు విడుదల చేశారు. ఈ నెలలో విడుదల చేసిన గ్రాంట్ కి సంబంధించిన రాష్ట్రాల వివరాలు మరియు 2020-21లో రాష్ట్రాలకు విడుదల చేసిన పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ మొత్తం జతచేయబడింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం రాష్ట్రాలకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు గ్రాంట్లు అందించబడతాయి. అధికార పంపిణీ తరువాత రాష్ట్రాల రెవెన్యూ ఖాతాలలో అంతరాన్ని తీర్చడానికి పదిహేనవ ఆర్థిక కమిషన్ సిఫారసుల ప్రకారం ఈ నిధులను నెలవారీ వాయిదాలలో విడుదల చేస్తారు. 14 రాష్ట్రాలకు పిడిఆర్‌డి గ్రాంట్లను కమిషన్ సిఫారసు చేసింది.

ఈ గ్రాంట్ ను స్వీకరించడానికి రాష్ట్రాల అర్హత మరియు గ్రాంట్ పరిమాణం, 2020-21 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన నిధుల వాటాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత రాష్ట్ర ఆదాయ మరియు అంచనా వ్యయాల మధ్య అంతరం ఆధారంగా కమిషన్ నిర్ణయించింది. పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ మొత్తం పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్‌ను 2020-21 ఆర్థిక సంవత్సరంలో 14 రాష్ట్రాలకు రూ.74,341 కోట్లు సిఫార్సు చేసింది. ఇందులో రూ. 68,145.91 కోట్లు (91.66%) ఇప్పటివరకు విడుదలైంది.

పదిహేనవ ఆర్థిక కమిషన్ పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్‌ను సిఫారసు చేసిన రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్.

రాష్ట్రాల వారీగా విడుదల చేసిన పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్:

 

(Rs. In crore)

S.No.

Name of State

Amount released in February 2021

(11th instalment)

Total amount released in 2020-21

 

Andhra Pradesh

491.42

5405.59

 

Assam

631.58

6947.41

 

Himachal Pradesh

952.58

10478.41

 

Kerala

1276.92

14046.09

 

Manipur

235.33

2588.66

 

Meghalaya

40.92

450.09

 

Mizoram

118.50

1303.50

 

Nagaland

326.42

3590.59

 

Punjab

638.25

7020.75

 

Sikkim

37.33

410.66

 

Tamil Nadu

335.42

3689.59

 

Tripura

269.67

2966.34

 

Uttarakhand

423.00

4653.00

 

West Bengal

417.75

4595.25

 

Total

6195.08

68145.91

 

****

 



(Release ID: 1695664) Visitor Counter : 144