రైల్వే మంత్రిత్వ శాఖ
రైళ్ల సేవల నిర్వహణ
Posted On:
05 FEB 2021 3:56PM by PIB Hyderabad
కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నివారించడానికి భారతీయ రైల్వే అన్ని సాధారణ ప్రయాణీకుల రైలు సర్వీసులను 23 మార్చి 2020 నుండి నిలిపివేసింది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం భారతీయ రైల్వే మే 1, 2020 నుండి శ్రామిక్ రైళ్లను నడపడం ద్వారా ప్రయాణీకుల రైలు కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. తరువాత మే 12, 2020 నుండి రాజధాని ప్రత్యేక సేవలను, జూన్ 1 , 2020 నుండి ఇతర ప్రత్యేక రైలు సర్వీసుల సంఖ్యను దశలవారీగా పెంచారు. ప్రస్తుతం భారత రైల్వే 1328 మెయిల్ / ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైళ్లు, 206 ప్యాసింజర్ రైళ్లు మరియు 5350 సబర్బన్ రైళ్లను నడుపుతోంది. 684 ఫెస్టివల్ స్పెషల్ సర్వీసులు కూడా నిర్వహిస్తోంది.
సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన ఆధారంగా భారతీయ రైల్వే 11.11.2020న కోల్‌కతా ప్రాంతానికి సేవలందిస్తున్న తూర్పు మరియు ఆగ్నేయ రైల్వేపై మరియు చెన్నై ప్రాంతానికి సేవ చేస్తున్న దక్షిణ రైల్వేపై 23.11.2020 నుండి పరిమిత ప్రాతిపదికన సబర్బన్ సేవలను తిరిగి ప్రారంభించింది.
ముంబై ప్రాంతంలో 705 సబర్బన్ సేవలు (సెంట్రల్ రైల్వేపై 355 మరియు వెస్ట్రన్ రైల్వేపై 350) పరిమిత తరగతి ప్రయాణీకుల కోసం 15.06.2020 తేదీన ప్రారంభించబడ్డాయి. 01.02.2021 తేదీ నాటికి అన్ని వర్గాల ప్రయాణీకులకు ముంబై ప్రాంతంలోని స్థానిక రైలు సర్వీసులలో గరిష్ట సమయంలో ప్రయాణించడానికి అనుమతి ఉంది. భారతీయ రైల్వే ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తోంది. దశలవారీగా రైలు కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తోంది.
ఈ సమాచారాన్ని రైల్వే, వాణిజ్య, పరిశ్రమ, వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ రోజు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు.
***
(Release ID: 1695578)